తూర్పుగోదావరి

అంబరాన్నంటిన 3యోగా2 సంబరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 21: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రం కాకినాడలో గురువారం యోగా దినోత్సవం అంబరాన్నంటింది. నగరంలో పలుచోట్ల ఆరోగ్యకరమైన వాతావరణంలో యోగా శిబిరాలు కళకళలాడాయి. ఉదయం 6 నుండి 11 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యా, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వృద్ధుల నుండి విద్యార్థుల వరకు ఇలా అన్ని వర్గాల వారూ యోగాసనాలు వేస్తూ, ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపించారు. చిన్నా, పెద్దా తారతమ్యం లేకుండా ఉదయం 6 గంటల నుండే క్రీడా మైదానాలు, పార్కులు, పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాలకు చేరుకున్నారు. కాకినాడ నగరంలోని జిల్లా క్రీడామైదానంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో శాసనమండలి సభ్యుడు చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ యోగాతో మనస్సు ప్రశాంతంగా ఉంటుందని, ఆరోగ్య పరిరక్షణకు ఇదొక మంచి ప్రక్రియని చెప్పారు. ప్రతివొక్కరు నిత్యం యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాల వారూ యోగాను అనుసరించడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుందన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ మల్లికార్జున మాట్లాడుతూ యోగా ఐక్య రాజ్యసమితిచే గుర్తింపు పొందిందన్నారు. ఏటా జూన్ 21న యోగా దినోత్సవాన్ని అంతర్జాతీయంగా ప్రపంచ దేశాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. కాకినాడ నగరపాలక సంస్థ మేయర్ సుంకర పావని మాట్లాడుతూ భారత దేశ సంస్కృతిలో ఉన్న యోగాకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించడం చూస్తే ఈ ప్రక్రియకున్న ప్రాధాన్యతేంటో అర్ధమవుతుందన్నారు. యోగా మనిషి జీవితంలో భాగంగా మారితే ఎన్నో ప్రయోజనాలున్నాయని పేర్కొన్నారు. ఆరోగ్యంతో పాటు ప్రశాంతమైన జీవనానికి ఈ ప్రక్రియ చిరునామా వంటిదని పావని చెప్పారు. యోగా గురువులు ఎంవీ రాఘవానంద, బీవీపీ నాగేంద్ర, రాజు, అశోక్, రాణి తదితరులు యోగా నిర్వహించారు. యోగాసనాల్లో ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, జేసీ మల్లిఖార్జున, ఎన్‌సీసీ లెఫ్టినెంట్ కల్నల్ నాయుడు, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీఎస్ సుబ్బలక్ష్మి, సమాచార శాఖ డీడీ ఫ్రాన్సిస్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం జ్యోతి, డ్వామా పీడీ రాజకుమారి, డిఈవో ఎస్ అబ్రహాం, సర్వశిక్షాభియాన్ పీవో ఎం శేషగిరిరావు, కాకినాడ ఆర్డీవో ఎల్ రఘుబాబు, కాకినాడ నగరపాలక సంస్థ ఇన్‌ఛార్జి కమిషనర్ సత్యవేణి, వివిధ శాఖల అధికారులు, వివిధ డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు పాల్గొన్నారు.

ఓఎన్జీసీ కార్యాలయంలో యోగా దినోత్సవం
రాజమహేంద్రవరం, జూన్ 21: రాజమహేంద్రవరం ఓఎన్జీసీ కార్యాలయ ప్రాంగణంలోని కల్చరల్ భవన్ వద్ద గురువారం ప్రపంచ యోగ దినోత్సవాన్ని ఓఎన్జీసీ అసెట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డిఎంఆర్ శేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యోగ గురువు రామచంద్రన్ పర్యవేక్షణలో సుమారు వంద మంది ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ దళం అధికారులు, సిబ్బంది, 400మంది ఓఎన్జీసీ సిబ్బంది, కేంద్రీయ విద్యాలయ బాల బాలికలు యోగాసనాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా యోగ ప్రాముఖ్యతను రామచంద్రన్ వివరించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ దళం (రాజమహేంద్రవరం) రీజనల్ కమాండెంట్ డిఎన్‌ఏ బాషా, అసిస్టెంట్ కమాండెంట్ డికెఎస్ రాజు, ఎయిర్ పోర్టు ఇన్స్‌పెక్టర్ మల్లికార్జునరావు, ఓఎన్జీసీ అధికారులు పాల్గొన్నారు.