తూర్పుగోదావరి

గిరిజన ప్రాంతాల్లో సాంకేతికతతో ఆధునిక వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగవరం, జూన్ 21: మారుమూల గిరిజన ప్రాంతాల్లో గిరిజన ప్రజలకు సాంకేతిక సహకారంతో ఆధునిక వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని, దీనిలో భాగంగానే ముఖ్యమంత్రి గిరి ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసిందని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, రంపచోడవరం ఐటీడీఎ పీవో నిషాంత్‌కుమార్ అన్నారు. గురువారం ఎండపల్లి ఆరోగ్య ఉప కేంద్రంలో గిరి ఆరోగ్య కేంద్రాన్ని (టెలీ మెడిసిన్ సెంటర్) రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యే రాజేశ్వరి, స్థానిక వైద్యసిబ్బంది, రోగులతో మాట్లాడారు. గిరిజనులకు అందుబాటులో ఆధునిక వైద్యాన్ని అందించేందుకు టెలీ మెడిసిన్ సెంటర్లు ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజేశ్వరి, రంపచోడవరం ఐటీడీఎ పీవో నిషాంత్ కుమార్ గిరిజనులనుద్దేశించి మాట్లాడారు. మారుమూల గిరిజన ప్రజలకు మరింత చేరువలో కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో 40 ఆరోగ్య ఉప కేంద్రాల్లో గిరి ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పినట్టు వారు చెప్పారు. దీనిలో భాగంగా రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని ఎండపల్లి, వాతంగి, చికిలింత, అమ్మిరేకుల ఆరోగ్య ఉప కేంద్రాల్లో టెలీ మెడిసిన్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ సెంటర్ పనితీరును పీవో నిషాంత్‌కుమార్ ప్రజలకు వివరించారు. గిరిజనులు తమ గ్రామం నుంచే కార్పొరేట్ వైద్య నిపుణుల సహాయంతో ఆధునిక వైద్యాన్ని సకాలంలో తక్షణమే పొందే అవకాశం ఉందన్నారు. ఏటీఎం మాదిరిగా మెడిసిన్ మిషన్ పనిచేస్తుందన్నారు. స్థానిక ఏఎన్‌ఎం ద్వారా ఆధార్ అనుసంధానంతో ఈ సెంటర్ పనిచేస్తుందన్నారు. గిరిజనుల అనారోగ్య పరిస్థితులు యాప్ ద్వారా నేరుగా విశాఖ, విజయవాడ కేంద్రాల్లో గల మెడికల్ కన్స్‌ల్టెంటేషన్ పేనల్‌కు ఆన్‌లైన్ చేయబడుతుందన్నారు. అలా ఆన్‌లైన్ అయిన వెంటనే వైద్య నిపుణులు ఆన్‌లైన్ సిఫార్సు మేరకు స్థానిక టెలీ మెడిసిన్ కేంద్రంలోగల ఆటోమెటిక్ డ్రగ్ వైండింగ్ మిషన్ ద్వారా మందులు బయటకు వస్తాయన్నారు. వాటిని ఏఎన్‌ఎం సలహాలు, సూచనల మేరకు వినియోగించుకోవాలన్నారు. ఎమ్మెల్యే రాజేశ్వరి ప్రసంగిస్తూ గిరిజనుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ఎంతో శ్రద్ధ తీసుకుంటుందన్నారు. మరింత చేరువులో అధునిక వైద్యం అందించేందుకు సీఎం శ్రీకారం చుట్టారని, ప్రభుత్వ పధకాలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తొలుత పీవో, ఎమ్మెల్యేలు ఆటోమెటిక్ డ్రగ్ మిషన్, వైద్యశిబిరాన్ని పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఎంపీపీ తీగల ప్రభ, జడ్పీటీసీ పాము సూర్యకాంతం, ఎండపల్లి సర్పంచ్ బాలురెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు ముసలయ్యదొర, మాజీ ఉపాధ్యక్షుడు కనిగిరి రాంబాబు, టీడీపీ నాయకులు బాపనమ్మ, బాపన్నదొర, అప్పలకొండ, తదితరులు పాల్గొన్నారు.

రైతు సంక్షేమానికి కృషి చేయాలి
మలికిపురం, జూన్ 21: మార్కెట్ కమిటీ పాలకవర్గం రైతు సంక్షేమానికి పెద్దపీట వేయాలని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి వైస్ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. రాజోలు మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా మలికిపురానికి చెందిన కాకి లక్ష్మణరావు వారి బృందం ప్రమాణ స్వీకారం సందర్భంగా స్థానిక ఎఎఫ్‌డీటీ విద్యాసంస్థల గ్రౌండ్స్‌లో రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగిన ప్రమాణ స్వీకార అభినందన సభలో రెడ్డి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలుచేస్తోందన్నారు. రూ. 24 వేల కోట్లు మేరకు రుణ మాఫీ చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ ఛైర్మన్ నామన రాంబాబు, టీటీడీ పాలకవర్గ సభ్యులు రుద్రరాజు పద్మరాజు, గోదావరి ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ భూపతిరాజు ఈశ్వరవర్మ, డాక్టర్ బిక్కిన వీరాస్వామి, బోణం నాగేశ్వరావు, అడబాల సాయిబాబు, అప్పనపల్లి దేవస్థానం ఛైర్మన్ మొల్లేటి శ్రీనివాస్, మలికిపురం జడ్పీటీసీ మంగిన భూదేవి, డాక్టర్ గేదెల వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నూతన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన కాకి లక్ష్మణ్ మాట్లాడుతూ తనకు పదవిని అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే సూర్యారావుల నమ్మకం మేరకు రైతు సంక్షేమానికి పాటుపడతానన్నారు. సమావేశానికి ముందు ఛైర్మన్ కాకి లక్ష్మణ్ భారీ ఊరేగింపుతో సభాస్థలానికి చేరుకున్నారు.