తూర్పుగోదావరి

జూలై 6 నుండి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 23: జూలై 6 నుండి 15వ తేదీ వరకు నగరంలో నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి వివిధ శాఖలకు చెందిన అధికారులు ఏర్పాట్లను సమగ్రంగా నిర్వహించాలని జెసి ఎ మల్లికార్జున అన్నారు. ఈ ర్యాలీకి సంబంధించి ఆయా శాఖల అధికారులతో శనివారం జెసి తన ఛాంబర్‌లో సమావేశం నిర్వహించారు. జిల్లా క్రీడాప్రాధికార మైదానంలో జరిగే ఈ ర్యాలీలో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలకు చెందిన అభ్యర్థులు పాల్గొంటారన్నారు. ఈ ర్యాలీకి సుమారు 45 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వారికి అవసరమైన ఏర్పాట్లను చేయాలని చెప్పారు. అభ్యర్థులకు అవసరమైన తాగునీరు, మరుగుదొడ్లను స్టేడియం వద్ద ఏర్పాటు చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. అధిక ధరలకు తినుబండారాలను విక్రయించకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో విశాఖ ఆర్మీ రిక్రూట్‌మెంట్ విభాగ డైరెక్టర్ కల్నల్ శశాంకవర్మ, సుబేదార్ మేనేజర్ అశోక్‌కుమార్, సెట్రాజ్ సిఇఓ ఎస్ మల్లిబాబు, ఆర్డీవో ఎల్ రఘుబాబు, డిటిసి సిరి ఆనంద్, ట్రాఫిక్ డిఎస్పీ సత్యనారాయణ, వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వాడపల్లి వెంకన్నను దర్శించుకున్న అనిల్ చంద్ర పునీఠా
ఆత్రేయపురం, జూన్ 23: కోనసీమ తిరుపతిగా పేర్గాంచిన వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని శనివారం ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఛార్జి చీఫ్ సెక్రటరీ, చీఫ్ కమిషనర్ ఆఫ్ లా అండ్ అడ్మినిస్ట్రేషన్ అనిల్ చంద్ర పునీఠా, జెసి మల్లికార్జున్ సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. దేవస్థాన ఈవో ముదునూరి సత్యనారాయణరాజు, అభివృద్ధి కమిటీ ఛైర్మన్ కరుటూరి నర్సింహారావులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం పండితులు వేదాశీస్సులు అందజేశారు. స్వామివారి చిత్ర పటాన్ని, ప్రసాదాన్ని దేవస్థాన ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు, అభివృద్ధి కమిటీ ఛైర్మన్ కరుటూరి నర్సింహరావులు అందజేశారు. ఈయన వెంట అమలాపురం, కాకినాడ ఆర్డీవోలు వెంకటరమణ, రఘుబాబు ఉన్నారు.