తూర్పుగోదావరి

వైసీపీ పటిష్టానికి కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనపర్తి, జూన్ 23: భేషజాలను, వ్యక్తిగత ఇబ్బందులను పక్కనబెట్టి పార్టీ విజయ పథాన నడిపించేందుకు పార్టీ శ్రేణులు కృషిచేయాల్సిన అవసరం ఉందని వైసీపీ జిల్లా ఇన్‌ఛార్జి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ అన్నారు. శనివారం నియోజకవర్గ ప్రధాన కేంద్రం అనపర్తిలో కో-ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డిచే నిర్మించబడిన నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని మాజీ మంత్రి ధర్మాన, మాజీ ఎంపీపీ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ధర్మాన మాట్లాడుతూ 2014లో పార్టీ స్వల్ప ఓట్ల తేడాతో అధికారాన్ని అందుకోలేకపోయిందని, అతి విశ్వాసాన్ని పక్కనబెట్టి ఆత్మ విశ్వాసంతో ప్రతి కార్యకర్త పనిచేస్తే సునాయసంగా పార్టీ గెలుస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కార్యకర్తను కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత ప్రతి నేతపైనా ఉందన్నారు. మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తానన్న కేంద్ర ప్రభుత్వం దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్న తీరును గత నాలుగు సంవత్సరాలుగా చిత్తశుద్ధిగానే పోరాడామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను మోదీ వద్ద తాకట్టుపెట్టి వారి స్వప్రయోజనాలను నెరవేర్చుకునే పనిలోనే ఉన్నారన్నారు. అమరావతిలో తిడుతూ ఢిల్లీలో లోపయకారి ఒప్పందాలు కుదుర్చుకునే చంద్రబాబు నాయుడు ఎక్కువ రోజులు ప్రజలను మోసం చేయలేరన్నారు. ప్రత్యేక హోదా పోరాటంలో 13సార్లు అవిశ్వాసం ప్రవేశపెట్టామని, విధిలేని పరిస్థితిలో చివరి అస్త్రంగా రాజీనామాలు చేసి వచ్చామన్నారు. పార్టీ పటిష్ఠతకు ప్రతి ఒక్కరూ కృషిచేసి విజయానికి బాటలు వేయాలన్నారు. డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో మాజీ ఎమ్మెల్యేలు తేతలి రామారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోసు, రౌతు సూర్యప్రకాశరావు, మండపేట, రామచంద్రపురం పార్టీ కోఆర్డినేటర్లు లీలాకృష్ణ, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి కె శ్రీనివాస్, పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యులు సత్తి వీర్రెడ్డి, ఏఎంసీ మాజీ ఛైర్మన్ జంగా సుబ్బారెడ్డి, రాష్ట్ర పార్టీ సంయుక్త కార్యదర్శి సత్తి సుబ్బిరెడ్డి (న్యాయవాది), మండల పార్టీ కన్వీనర్ ఆదినారాయణరెడ్డి, ప్రముఖ నేత్ర వైద్యులు తేతలి సత్యనారాయణరెడ్డి, పార్టీ నాయకులు చిర్ల వీరరాఘవరెడ్డి, సబ్బెళ్ల కృష్ణారెడ్డి, రావూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
భీమేశ్వరుడిని దర్శించుకున్న దినేష్‌రెడ్డి
రామచంద్రపురం, జూన్ 23: అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ వి దినేష్‌రెడ్డి శనివారం రాత్రి ద్రాక్షారామలోని శ్రీ మాణక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయాన్ని, కె గంగవరం మండలం కోటిపల్లిలోని శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించారు. ద్రాక్షారామ ఆలయానికి చేరుకున్న దినేష్‌రెడ్డికి ఆలయ అధికారులు, అనువంశిక అర్చక స్వాములు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం దినేష్‌రెడ్డి కోటిపల్లి బయలుదేరి వెళ్లారు. కోటిపల్లిలో శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి వారి ఆలయం వద్ద జన్మభూమి కమిటీ సభ్యుడు చిల్లే నాగేశ్వరరావు ఆయనకు స్వాగతం పలికారు. ఆలయ అర్చక స్వాములు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ద్రాక్షారామలో రామచంద్రపురం ఎస్‌ఐ కోట వంశీధర్, కోటిపల్లిలో కె గంగవరం ఎస్‌ఐ జి నరేష్ బందోబస్తు ఏర్పాటు చేశారు.