తూర్పుగోదావరి

ఉత్సాహంగా ఒలింపిక్ రన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 23: అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒలింపిక్ పరుగు జరిగింది. క్రీడాకారులు, విద్యార్థులు, వ్యాయామ ఉపాధ్యాయులు సుమారు 200 మంది ఈపరుగులో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక ఆనంకళాకేంద్రం వద్ద అదనపు కమిషనర్ ఎన్‌వివి సత్యనారాయణ, శాప్ డైరెక్టర్ యర్రా వేణుగోపాలరాయుడు, అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్ స్వామినాయుడు, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి సుంకర నాగేంద్రకిషోర్ ఈపరుగును ప్రారంభించారు. ఆనంరోటరీహాలు వరకు ఈపరుగు సాగింది. అనంతరం జరిగిన కార్యక్రమంలో క్రీడాపిపాసి, ప్రసిద్ధ ఫుట్‌బాల్ క్రీడాకారుడు సుంకర భాస్కరరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వివిధ క్రీడల్లో ప్రతిభకనపరిచిన క్రీడాకారులకు సుంకర భాస్కరరావు స్మారక పురస్కారాలను అందించి, సత్కరించారు. ఈసందర్భంగా స్వామినాయుడు మాట్లాడుతూ శారీరక, మానసిక ఆరోగ్యానికి క్రీడలు, వ్యాయామాన్ని జీవితంలో అంతర్భాగం చేసుకోవాలని యువతకు, విద్యార్థులకు పిలుపునిచ్చారు. యర్రా వేణుగోపాలరాయుడు మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో క్రీడాకారుల సౌకర్యార్థం స్టేడియం, ఇతర వౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషిచేస్తానన్నారు.
మండపేటలో ఒలింపిక్న్
మండపేట, జూన్ 23: మండపేట పట్టణంలో శనివారం నిర్వహించిన ఒలంపిక్ రన్ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక రథం సెంటర్లో ఎమ్మెల్యే వేగుళ్ల ఒలింపిక్ రన్ వెలిగించిన అనంతరం జెండా ఊపి ప్రారంభించారు. రథం సెంటర్, బస్టాండు మీదుగా కలువ పువ్వు సెంటర్‌కు ఈ రన్ చేరుకుంది. అనంతరం ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ క్రీడాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు, విద్యార్థులకు మున్సిపల్ ఛైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వి సాయికుమార్‌బాబు, రామచంద్రపురం డీఎస్పీ జెవి సంతోష్ సర్ట్ఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో సీఐలు లక్ష్మణరెడ్డి, గీతారామకృష్ణ, ఎస్సైలు నున్న రాజు, వి సాంబశివరావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.