తూర్పుగోదావరి

నేటి నుంచి యధావిధిగా పాఠశాలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిఠాపురం, జూన్ 24: వేసవి తాపంతో బడులకు సెలవులు కొనసాగించిన నేపథ్యంలో సెలవులు పూర్తికావడంతో యథావిధిగా బడులు సోమవారం నుంచి తెరచుకోనున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 6,052 పాఠశాలలు సోమవారం నుంచి పనిచేయనున్నాయి. ఈ నెల 12న బడులు తెరుచుకున్నప్పటికీ ఉహించని రీతిలో ఎండలు మరలా పెరగడంతో ప్రభుత్వం బడులకు ఈ నెల 21 వరకూ సెలవులను పొడిగించింది. 22వ తేదీన బడులు తెరుచుకోవాల్సి ఉండగా ఎండల తీవ్రత మరింత పెరగడంతో మరలా 23 వరకూ సెలవులను రెండురోజుల పాటు పొడిగించారు. పెంచిన సెలవులు పూర్తికావడంతో యథావిధిగా పాఠశాలలు పునఃప్రారంభం కానున్నట్టు డీఈవో ఎస్. అబ్రహాం తెలిపారు. ఇదిలా ఉండగా పాఠశాలలకు చేరాల్సిన పాఠ్య పుస్తకాలు ఇంకా చేరలేదు. జిల్లాకు 23 లక్షల పుస్తకాలు చేరాల్సి ఉంది. కానీ ఇప్పటివరకూ 50 శాతం కూడా పుస్తకాలు మండల కేంద్రాలకు వెళ్లలేదు. మండలానికి 70 వేల నుంచి 90 వేల పుస్తకాలు రావాల్సి ఉన్నాయి. అందులో 20 నుంచి 30 వేల పుస్తకాలు మాత్రమే ఇప్పటివరకూ చేరాయి. అన్ని తరగతులకు సంబంధించి పుస్తకాలు రాకపోవడంతో వచ్చిన వాటినే పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే మండల వనరుల కేంద్రాల వద్ద ఉన్న పుస్తకాలను సోమవారం నుంచి అందించడానికి ఏర్పాట్లు చేశారు. పిల్లలకు అందించాల్సిన దుస్తులూ రాలేదు. జిల్లా వ్యాప్తంగా 14 లక్షల దుస్తులు రావాల్సి ఉంది. ఈ వారంలోనే దుస్తులు అందుతాయని ఎస్‌ఎస్‌ఏ అధికారులు చెబుతున్నారు.
విమానాశ్రయం అగంతకుడు బంధువులకు అప్పగింత
కోరుకొండ, జూన్ 24: మధురపూడి విమానాశ్రయంలో ఆగంతకుడి కలకలమంటూ ఆంధ్రభూమిలో వచ్చిన వార్తకు కోరుకొండ పోలీసులు స్పందించారు. వదిలివేసిన ఆగంతకుడిని తిరిగి అదుపులోకి తీసుకున్నారు. అతని వేలిముద్రల ఆధారంగా కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం నరసాపురం గ్రామానికి చెందిన టమాటం ఈడిగా రామాంజనేయులుగా పోలీసులు గుర్తించారు. అతని బంధువులకు సమాచారం ఇవ్వగా అతని సోదరుడు, కొడుకు కోరుకొండ వచ్చి అతని వివరాలు అందజేశారు. రామాంజనేయులు హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో కొంతకాలం చికిత్స పొందినట్టు అతని బంధువులు ఆధారాలు చూపినట్టు పోలీసులు తెలిపారు. మతిస్థిమితం లేని వ్యక్తిగా పూర్తి వివరాలు సేకరించాక అతడిని వారి బంధువులకు అప్పగించినట్టు పోలీసులు తెలిపారు.