తూర్పుగోదావరి

వినతులు స్వీకరిస్తూ సమస్యలు వింటూ జగన్ పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజోలు, జూన్ 24: ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని వారిలో భరోసా నింపేందుకు వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 197వ రోజు ఆదివారం ఉదయం ములికిపల్లి నుంచి ప్రారంభమయ్యింది. అక్కడ నుంచి కడలి, వేగివారిపాలెం, గెద్దాడ మీదుగా మొగలికుదురు, తాటిపాక మీదుగా నగరం వరకు పాదయాత్ర కొనసాగింది. వైఎస్ జగన్‌ను కలవడానికి ఉదయం నుండే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీ నేతలు, మహిళలు, యువతీ, యువకులు, విద్యార్థులు జనసంద్రంలా తరలి వచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలు వింటూ వినతి పత్రాలను స్వీకరిస్తూ, సెల్ఫీలు దిగుతూ ములికిపల్లి నుంచి నగరం వరకు పాదయాత్ర సాగింది. పిల్లలకు అక్షరాభ్యాసాలు చేస్తూ, ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారికి భరోసా ఇస్తూ, జగన్ పాదయాత్ర కొనసాగింది. జగన్ పాదయాత్ర ఆదివారం సుమారు 8.1 కిలోమీటర్లు కొనసాగింది. అలాగే వేగివారిపాలెంలో జగన్ అభిమాని పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన వంగలపూడి ఏసయ్య అనే యువకుడిని జగన్‌ను కలిసేందుకు సెక్యూర్టీ సిబ్బంది అంగీకరించకపోడవంతో వేగివారిపాలెం వద్ద గల 132 కేవీ విద్యుత్ టవర్ ఎక్కేందుకు ప్రయత్నించారు. యువకుడు ఆవేదనను అర్ధం చేసుకున్న వైసీపీ యువజన నేత చెల్లుబోయిన రాంబాబు అతనికి నచ్చజెప్పి టవర్ నుండి దింపి జగన్‌తో ఫొటో తీయించారు. దీనితో అతను పట్టరాని ఆనందాన్ని వ్యక్తం చేశాడు. పాదయాత్ర ఆద్యంతం భారీ జన సందోహం మధ్య కొనసాగడంతో పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాలను వ్యక్తం చేశారు. మధ్యాహ్నం తాటిపాకలో భోజన విరామం అనంతరం పి గన్నవరం నియోజకవర్గానికి పాదయాత్ర కొనసాగించారు. కార్యక్రమంలో రాజోలు వైసీపీ కోఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు, కొండేటి చిట్టిబాబు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి, బండారు కాశి, కెఎస్‌ఎన్ రాజు, పాముల ప్రకాష్, జక్కంపూడి వాసు, బొలిశెట్టి భగవాన్, సాగి రామరాజు, కంచర్ల శేఖర్ పాల్గొన్నారు.
గోదావరిలో పర్యాటకుల స్నానాలు
ఆత్రేయపురం, జూన్ 24: బొబ్బర్లంక కాటన్ బ్యారేజ్ వద్ద ఆదివారం సెలవు దినం కావటంతో రాజమహేంద్రవరం, వేమగిరి, ధవళేశ్వరం తదితర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు స్నానాలు చేశారు. గోదావరి నీరు పెరగటంతో ఆనకట్టపై నుంచి వెళుతున్న నీటిలో వీరు స్నానమాచరించారు. బైకులపై యువకులు ఉత్సాహంగా ఆనకట్టపై తిరిగారు. ఇక్కడ తగిన భద్రత లేకపోవటంతో ప్రమాదం పొంచి ఉంది. భద్రత లేనిచోట్ల స్నానాలు చేయటం వల్ల గతంలో మృత్యువాత పడిన ఘటనలు ఇక్కడ చోటుచేసుకున్నాయి. గోదావరిలో ఎక్కడపడితే అక్కడ స్నానాలు చేయకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలని పలువురు కోరుతున్నారు. పర్యాటకులు ఎక్కడపడితే అక్కడ స్నానాలు చేయకుండా తగిన భద్రతా సౌకర్యాలు కల్పించాలని బొబ్బర్లంక గ్రామస్థులు కోరుతున్నారు.