తూర్పుగోదావరి

ఆయనకు నిజం చెప్పడం రాదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 24: చంద్రబాబునాయుడుకు నిజం చెప్పడం రాదని, బీజేపీకి అబద్ధం చెప్పడం చేతకాదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. పోలవరం నిర్మాణంపై ప్రధాని మోదీ అంకితభావంతో వున్నారన్నారు. తొలిసారిగా జిల్లా పర్యటనకు వచ్చిన కన్నా లక్ష్మీనారాయణకు బీజేపీ శ్రేణులు ఆదివారం ఘన స్వాగతం పలికారు. స్థానిక ఒక ప్రైవేటు హోటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కేంద్ర మాజీ మంత్రి పురంధ్రీశ్వరి, మాజీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్శింహరావు, స్థానిక ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి, 13 జిల్లాల బీజేపీ అధ్యక్షులతో కలిసి మీడియా సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడారు.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు పోలవరం మినహా కేంద్రం రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టులు నిర్మాణం చేపడితే, ఒక్క పోలవరానికే రూ.16 వేల కోట్ల అంచనాలతో పోలవరం చేపట్టిందన్నారు. నూటికి నూరు శాతం నిధులను కేంద్రమే భరించి నిర్మిస్తోందన్నారు. ప్రాజెక్టుపై అనేక ఆరోపణలు వస్తున్నాయని, సాంకేతికంగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కేంద్రం నుంచి తామే కడతామని రాష్ట్రం తీసుకుందన్నారు. పొత్తులో వున్నామని ఇంత కాలం మాట్లాడలేదన్నారు. ప్రభుత్వ డబ్బుతో హడావిడి చేస్తూ బస్సులు పెట్టి పోలవరానికి తరలిస్తున్నారన్నారు. కేంద్రం సొమ్ముతో కడుతున్న ఈ ప్రాజెక్టుపై చంద్రబాబు నిజాలు చెప్పడం లేదన్నారు. తమకు అబద్ధం చెప్పడం రాదన్నారు. తాను తమ సొంత డబ్బుతోనే పోలవరం చూడ్డానికి వెళ్తున్నామన్నారు. పట్టిసీమ విషయంలో కాగ్ తేల్చిన లెక్కల విషయం ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. పోలవరం కోసం త్యాగం చేసిన నిరాశ్రయులను ఆదుకుంటామన్నారు.
వైసీపీ, టీడీపీ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం నడపడం లేదా అని కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. ఇద్దరూ కలిసి జనాన్ని మోసం చేస్తున్నారన్నారు. వీరిద్దరు కలిసి ఎవరిపై బురద జల్లుతారని ప్రశ్నించారు. వైసీపీ, టీటీపీ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. నాటకాలాడుతున్నారని ఆరోపించారు. స్థానిక బీజేపీ అధ్యక్షుడు బొమ్ముల దత్తు స్వాగతం పలికిన ఈ సమావేశంలో నాయకులు కావూరి సాంబశివరావు, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, సురేష్‌రెడ్డి, గోకరాజు గంగరాజు, శ్రీకాకుళం అధ్యక్షుడు నారాయణరావు, పొనగంటి అప్పారావు, విజయనగరం అధ్యక్షుడు జగన్మోహనరావు, విశాఖ పులుసు జనార్ధన్, కార్పొరేటర్ రేలంగి శ్రీదేవి, పాకలపాటి సన్యాసిరావు, తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య, భానుప్రకాష్, ఆంజనేయరెడ్డి, డాక్టర్ హరినాధరెడ్డి, విల్సన్, చల్లపల్లి నర్శింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేవీవీ సత్యనారాయణరెడ్డి, దారా సాంబయ్య, పూడి తిరుపతిరావు, షేక్ బాజీ, మానేపల్లి అయ్యాజీ వేమా, వేటుకూరి సూర్యనారాయణరాజు, కర్రి చిట్టిబాబు, క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్, నాళం పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.
ఈ సమస్యల పరిష్కారం..మీదే బాధ్యత!
*పార్టీ కో-ఆర్డినేటర్లకు జగన్ ఆదేశం
మామిడికుదురు, జూన్ 24: రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాగానే వీటన్నింటినీ పరిష్కరించాల్సిన బాధ్యత మీదేనంటూ ఆ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి తన ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజలు ఇచ్చిన వినతులన్నింటినీ ఆ పార్టీ కో-ఆర్డినేటర్లకు ఎక్కడికక్కడ ఇచ్చేస్తున్నారు. తమ సమస్యలను ఎంతో ఆతృతగా విన్నవించుకుంటున్న మహిళలు, ప్రజలు, వివిధ వర్గాల ప్రజలు విజ్ఞాపన పత్రాలతో ఎంతో సమయం వేచి ఉండి..జగన్ రాగానే ప్రైవేటు భద్రతా దళాలను సైతం తోసుకుంటూ జగన్‌కు సమర్పిస్తున్నారు. అయితే వాటిని కనీసం చదవ కుండా..ఒకే..అలాగే..అన్నీ చూస్తాను..పరిశీలిస్తానంటూ జగన్ ఆ కాగితాలన్నింటినీ తన పక్కనే ఉండే ఆయా నియోజకవర్గాల్లో కో-ఆర్డినేటర్ల చేతికి ఇచ్చేస్తున్నారు. రేపు మన పార్టీ అధికారంలోకి రాగానే వీటన్నింటినీ పరిష్కరించాల్సిన బాధ్యత మీదేనని ఆయా కో-ఆర్డినేటర్లతో జగన్ చెబుతున్నారు.
అయితే మొగలికుదురు గ్రామంలో చేనేత కార్మికులు తమ సమస్యలపై జగన్ వద్ద తమ ఇబ్బందులను విన్నవించుకున్నారు. చేనేత ఉత్పత్తులు లేక, గిట్టుబాటు ధరలు లేక, మగ్గాలనే నమ్ముకున్న తమకు న్యాయం చేయాలని కోరారు. మీ సమస్యలన్నీ తనకు తెలుసునని, వీటిపై ఉద్యమిస్తానని జగన్ వారికి భరోసా ఇచ్చారు. అదే మాదిరిగా కాంట్రాక్టు పంచాయతీరాజ్ కార్మికులు, ఆర్‌డబ్ల్యూఎస్ కార్మికులు తమ సమస్యలపై జగన్‌కు వినతి పత్రాలు సమర్పించారు. వేతనాలు పెంచేలా, రెగ్యులరైజ్ చేసేలా ప్రభుత్వంపై పోరాడతానని హామీ ఇచ్చారు. తప్పక న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.