తూర్పుగోదావరి

పోలవరం కాలువ వద్ద పొంచి ఉన్న పెను ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోకవరం, జూలై 16: గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామ శివారు పోలవరం కాలువపై నిర్మించిన ఆర్ అండ్ బి వంతెన అప్రోచ్ కోతకు గురైంది. పొంచి వున్న ప్రమాదంతో గ్రామస్థులు, వాహనదారులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అచ్యుతాపురం నుండి మండల కేంద్రమైన గోకవరం వైపు వెళ్ళే ఆర్ అండ్ బి రోడ్డుకు పోలవరం కాలువపై వంతెన నిర్మాణం చేశారు. ఈ వంతెన వద్ద ప్రమాదం పొంచి వుంది. వంతెన వద్ద అప్రోచ్ లోతుగా కోతకు గురవ్వడంతో ఈ రోడ్డుపై ప్రయాణించే బస్సులు, వాహనాలకు ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఆర్ అండ్‌బి శాఖ, పోలవరం కాలువ నిర్మాణం చేస్తున్న ఆ శాఖ అధికార్లు వెంటనే ఈ సమస్యపై స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ వంతెన పై నుండే నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలతోపాటు రైతులు తమ పొలాలకు ఈ వంతెన పై నుండే వెడుతుంటారు. అంతేకాకుండా ఈ వంతెన వద్ద ఏ విధమైన రక్షణ గోడలు లేకపోవడంతో కాలువ గట్టుపై వున్న మట్టి అంతా వంతెన పైకి చేరుతుంది. దీంతో వంతెన పైకి వచ్చేసరికి వాహనాలు జారిపోయి పోలవరం కాలువలో పడిపోయే ప్రమాదం కూడా ఉందని వాహన చోదకులు ఆందోళన చెందుతున్నారు. వర్షం వస్తే ఈ వంతెనపై వాహనాలు గానీ, పాదచారులు (రైతులు) గానీ వెళ్ళే అవకాశం లేదని స్థానికులు తెలిపారు. మరోపక్క ఈ వంతెన వద్ద అప్రోచ్ కోతకు గురవ్వడం వల్ల రాత్రి సమయంలో వాహనదార్లు గానీ, పాదచారులు గానీ ప్రమాదవశాత్తు పోలవరం కాలువలో పడిపోయే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ వంతెన వద్ద తాండవిస్తున్న సమస్యలపై సంబంధిత శాఖాధికార్లు తక్షణం స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు. జిల్లా ఉన్నతాధికార్లు తక్షణం స్పందించి వంతెన వద్ద పేరుకుపోయిన మట్టిని, కోతకు గురైన అప్రోచ్‌పై దృష్టి సారించి ప్రయాణికులు ప్రమాదం బారిన పడకుండా కాపాడాలని కోరుతున్నారు. దీనిపై సంబంధిత శాఖాధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులో లేరు.

కొనసాగుతున్న గాలింపు చర్యలు
రామచంద్రపురం, జూలై 16: రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలోని కె గంగవరం మండలానికి చెందిన శేరెల్లంక విద్యార్థినులు గోదావరిలో గల్లంతైన నేపథ్యంలో వారి ఆచూకీ దొరకకపోవటంతో సోమవారం కూడా గాలింపు చర్యలు జరిగాయి. రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, జిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రా, జిల్లా ఎస్పీ విశాల్ గున్నీతో కలిసి గోదావరిలో పంటుపై గాలింపుచర్యల కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపునేని రాజకుమారి తదితరులతో కలిసి విలేఖర్లతో మాట్లాడారు.

సీటీఆర్‌ఐ సైంటిస్ట్ డా.హేమకు జవహర్‌లాల్ నెహ్రూ కేంద్ర అవార్డు

రాజమహేంద్రవరం, జూలై 16: రాజమహేంద్రవరంలోని సీటీఆర్‌ఐలో పని చేస్తున్న సైంటిస్ట్ డాక్టర్ బలివాడ హేమకు కేంద్ర ప్రభుత్వం నుంచి అరుదైన అవార్డు లభించింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ నుంచి న్యూఢిల్లీలో సోమవారం డాక్టర్ బలివాడ హేమ అవార్డుగా బంగారు పతకాన్ని, నగదును అందుకున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ అవార్డు ఫర్ అవుట్ స్టాండింగ్ డాక్టొరల్ థిసీస్ రీసెర్చి ఇన్ అగ్రికల్చరల్ సైస్సెస్-2017 పేరిట అవార్డును అందుకున్నారు. బంగారు పతకంతో పాటు రూ.50 వేల నగదు బహుమతిని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్‌సింగ్ ఢిల్లీలో జరిగిన అవార్డు ప్రదాన కార్యక్రమంలో ప్రదానం చేశారు. డాక్టర్ బలివాడ హేమ గతంలో కూడా పరిశోధనలకు సంబంధించి ఎన్నో అవార్డులు, బంగారు పతకాలను అందుకున్నారు. సీటీఆర్‌ఐ సైంటిస్టు డాక్టర్ హేమకు లభించిన ఈ అవార్డుపై పలువురు అభినందనలు తెలియజేశారు.

ప్రారంభమైన ఉపాధ్యాయ విద్య పరీక్షలు
*ఇద్దరు విద్యార్థులపై చర్యలు

రాజమహేంద్రవరం, జూలై 16: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ, డీపీఈడీ రెండవ సెమిస్టర్‌కు చెందిన ఉపాధ్యాయ విద్య పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు చీఫ్ స్వ్కాడ్‌గా వున్న డాక్టర్ కె సుబ్బారావు అమలాపురంలోని శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కాలేజిలో పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. ఈ పరీక్షా కేంద్రంలో కాపీయంగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు విద్యార్థులు పట్టుబడ్డారు. వారిపై చర్యలు తీసుకున్నారు. దీనిపై డాక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థులంతా క్రమశిక్షణతో పరీక్షలు రాయాలని, భవిష్యత్‌లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవాలన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 12 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, తూర్పుగోదావరి జిల్లాలో 7 పరీక్షా కేంద్రాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 5 పరీక్షా కేంద్రాలు వున్నాయని తెలిపారు. పరీక్షలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయని, నిర్ణీత సమమంలో పరీక్ష కేంద్రాలకు హాజరుకావాలన్నారు.

ప్రమాద ‘గుట్ట’ అదేనా...
ఐ పోలవరం, జూలై 16: పశువుల్లంక మొండి రేవు వద్ద శనివారం జరిగిన నాటు పడవ ప్రమాదానికి ఒక గుట్ట కారణమనే వాదన వినిపిస్తోంది. గోదావరిలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనుల కోసం ఈ అడ్డుకట్ట నెలకొల్పినట్టు సమాచారం. గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతున్నప్పటికీ ఈ అడ్డుకట్ట తొలగించలేదు. దీనితో బ్రిడ్జి మూడవ పిల్లరు వద్ద నుండి నీటి ప్రవాహం అధికంగా నెట్టివేస్తోంది. వృద్ధ గౌతమి గోదావరి అన్నంపల్లి అక్విడెక్టు వైపునకు వరద ప్రవాహం సాఫీగా వెళ్తున్నా యానాం వైపు గోదావరి ప్రవాహం వేగం పెరుగుతుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. గతంలో ఏటిగట్లు తాకినంతగా వరదలు వచ్చినా ఇక్కడె పడవ ప్రమాదాలు ఇక్కడ జరగలేదని స్థానికులు అంటున్నారు. ప్రమాదం జరిగిన రోజు పడవ బయలుదేరినప్పుడు సుమారు 26 మందితోపాటు 7 మోటారు బైక్‌లు, 25 యూరియా బస్తాలు పడవపై వేశారని స్థానికులు చెబుతున్నారు. గతంలో రేవు దాటించే పడవ కాకుండా చిన్న పడవను నడపడం కూడా ప్రమాదానికి కారణమంటున్నారు. ఆ పడవకు మోటార్ పంకా ఒక రెక్కతో ఉందని, మూడు రెక్కలు మోటార్ ఉన్న పడవ ఉపయోగించడంలేదని స్థానికులు చెబుతున్నారు. రేవు పాటదారుడు స్థానికుడు కావడం వల్లే ఇష్టారాజ్యంగా పడవ నడిపించాడని, అధికారుల పర్యవేక్షణ ఉంటే ఇంత దారుణం జరిగి ఉండేది కాదని స్థానికులు అంటున్నారు. గతంలో పంటు నిర్వాహకులకు సరిగా జీతాలు ఇవ్వకుండా వెళ్లగొట్టారని, ఎలాంటి అనుమతి లేకుండా నాటు పడవ దాటింపునకు పంచాయతీ పాట పెట్టించి రేవు దాటింపు నిర్వహించడం వల్లే ఈ ప్రమాదానికి అవకాశం ఏర్పడిందనే వాదన వినిపిస్తోంది.

హిందూ ధర్మ రక్షా సమితి నేత చేదులూరి గృహ నిర్బంధం
*విజయవాడ వెళ్ళకుండా అడ్డుకున్న పోలీసులు *కత్తి మహేష్ తీరుపై ధ్వజం

కాకినాడ, జూలై 16: హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ విశే్లషకుడు కత్తి మహేష్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి బహిష్కరించాలని హిందూ ధర్మరక్షా సమితి రాష్ట్ర అధ్యక్షుడు చేదులూరి గవరయ్య డిమాండు చేశారు. జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో సోమవారం గవరయ్యను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. విజయవాడలో కత్తి మహేష్ తీరుకు నిరసనగా ఆందోళన కార్యక్రమానికి వెళ్ళేందుకు సిద్ధమైన గవరయ్యను నగరంలోని సంత చెరువు వద్ద ఆయన నివాసంలో పోలీసులు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా విలేఖర్లతో గవరయ్య మాట్లాడుతూ హిందూ ధర్మంపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసిన పక్షంలో సహించేది లేదని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం తరహాలో కత్తిమహేష్‌ను తక్షణమే ఆంధ్రప్రదేశ్ నుండి కూడా బహిష్కరించాలని డిమాండ్ చేశారు. శ్రీరాముడిపై కత్తి వ్యాఖ్యలను నిరసిస్తూ విజయవాడ అర్బన్ తహసీల్దారు కార్యాలయంలో వినతిపత్రాన్నిచ్చేందుకు బయలుదేరుతుండగా తమను అరెస్ట్ చేయడం శోచనీయమన్నారు. ధర్మం కోసం పోరాడుతున్న తమను తీవ్రవాదుల మాదిరిగా నిర్బంధించడం ఎంతమాత్రం సరికాదని వాపోయారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే రీతిలో తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పారు. మహేష్‌ను రాష్ట్రం నుండి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ త్వరలో రాష్టవ్య్రాప్తంగా ఉద్యమాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. హిందువులను విమర్శిస్తున్న ఇతర మతాలవారిని కాపాడటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. మహేష్‌ను తెలంగాణ ప్రభుత్వం బహిష్కరించినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు బహిష్కరించడం లేదని ప్రశ్నించారు. హిందువులపై జరుగుతున్న దాడులను ప్రతివొక్కరు సంఘటితంగా ఎదుర్కోవాలని, హిందూ దేవతల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునే వరకూ విశ్రమించేది లేదన్నారు. హిందూ దేశంలో ఉంటూ హిందూ దేవుళ్ళను విమర్శిస్తున్న అన్యమతాల వారిపై కేసులు నమోదుచేసి, వారిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. విజయవాడలో శివస్వామిని సైతం పోలీసులు నిర్బంధించారని గవరయ్య ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు.