తూర్పుగోదావరి

రుణమాఫీ వడ్డీకే సరిపోలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదపూడి, జూలై 14: బేషరుతుగా రైతు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన డబ్బులు రుణాల వడ్డీలకే సరిపోలేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం పెదపూడి మండలం గొల్లల మామిడాడలో జరిగిన భారీ బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. తొలుత బిక్కవోలు ఊలపల్లి నుంచి ఉదయం 8.40 గంటలకు పాదయాత్రగా బయల్దేరిన జగన్ బిక్కవోలు మీదుగా మధ్యాహ్నానానికి జి మామిడాడ చేరుకున్నారు. సాయంత్రం మెయిన్ రోడ్డులో నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దోపిడీ విధానాన్ని ఆదర్శంగా చేసుకుని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గంలో మట్టి, సాగునీరు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. సహకార సంఘాలలో రుణాలు తీసుకున్న రైతులకు 6శాతం వడ్డీ రైతులే మరిచిపోయేలా మొత్తానికి ఎగ్గొట్టారన్నారు. వడ్డీలేని రుణాలు కూడా టీడీపీ ప్రభుత్వం ఇవ్వడం లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే దివంగత నేత డాక్టర్ రాజశేఖరరెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలన్నీ అమలుపరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. తొలుత నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ సూర్యనారాయణరెడ్డి, రాజమహేంద్రవరం, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జిలు కవురు శ్రీనివాసు, కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తదితరులు ప్రసంగించారు. జగన్ ప్రసంగిస్తుండగా వర్షం ప్రారంభం కావటంతో జనం ఇబ్బందిని గమనించి ప్రసంగాన్ని వడి వడిగా ముగించేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, జక్కంపూడి విజయలక్ష్మి, జక్కంపూడి రాజా, సత్తి సుబ్బిరెడ్డి, తేతలి రామారెడ్డి, చెల్లుబోయిన వేణు తదితర నాయకులు పాల్గొన్నారు.
వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే తేతలి
అనపర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత తేతలి రామారెడ్డి వైసీపీలో చేరారు. శనివారం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ సమక్షంలో రామారెడ్డి పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి రామారెడ్డిని సాదరంగా వైసీపీలోకి జగన్ ఆహ్వానించారు. అలాగే సంపర ఏఎంసీ మాజీ ఛైర్మన్ అద్దంకి ముక్తేశ్వరరావు, పెదపూడి మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు కొటికలపూడి చిన్నబాబు, మాజీ ఎంపీటీసీ గుండా ఈశ్వరరావు తదితరులు వైసీపీలో చేరారు. వీరందరికీ జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.