తూర్పుగోదావరి

ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, జూలై 20: ప్రజాస్వామ్య విలువలను కాపాడవల్సిన బాధ్యత విద్యావంతులు, విద్యార్థులపైనే ఉందని సీబీఐ మాజీ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. అమలాపురం ఎస్‌కేబీఆర్ కళాశాలలో సమైక్య భారతి ఆధ్వర్యంలో రాజకీయాలు- విలువలపై శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నేటి యువత, విద్యావంతులు, మేధావులు రాజకీయాలతో తమకు సంబంధం లేదంటూ మాట్లాడటం సమజసం కాదన్నారు. మేధావులు, ఆదర్శవాదులు, విద్యావంతులు రాజకీయాల్లోకి వచ్చినపుడే విలువలతో కూడిన సమాజం నిర్మాణం జరుగుతుందని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. నేటి రాజకీయాల్లో వివక్షత ఎదుర్కొంటున్న ప్రతీ వ్యక్తి స్పందిస్తే శుద్ధమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించడం కష్టం కాదన్నారు. స్వాతంత్య్రం వచ్చిన ప్రారంభంలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు విలువలకు కట్టుబడి పనిచేసేవారని, కాని నేడు విలువలతో సంబంధం లేని భూస్వాములు, ధనవంతులు, గూండాలు రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజాస్వామ్య నిర్వచనానే్న మార్చేసారన్నారు. ప్రజా సామ్యంలో ఎన్నికైన ప్రతినిధులు పవిత్రమై రాజ్యాంగపై ప్రమాణం చేస్తారని, కాని ఆ ప్రమాణాన్ని పాటించకుండా అన్యాయాలు, అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. ఇటువంటి రాజకీయాలను సమూలంగా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నేడు పార్లమెంట్‌లో 350 మందికి పైగా వందల కోట్లు ఆస్తులు కలిగిన ఎంపీలు ఉన్నారని, వారంతా ప్రజా సేవను పక్కన పెట్టి స్వార్ధంతో పనిచేస్తున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. దేశంలో విలువలు నశించుపోవడానికి ప్రధాన కారణం ప్రాంతీయ పార్టీలేనని అన్నారు. ప్రాంతీయ పార్టీలు కుటుంబ పాలనను తెరపైకి తెచ్చి వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారన్నారు. దీంతో ఆసక్తి ఉన్నా చాలా మంది రాజకీయాలకు దూరమైపోతున్నారన్నారు. నేటి విద్యార్థుల్లో నైతిక విలువలతో పాటు ప్రజా స్వామ్యం, రాజ్యాంగ విలువలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత కళాశాల అధ్యాపకులపై ఉందని లక్ష్మీనారాయణపై అభిప్రాయపడ్డారు. మరో ముఖ్య అతిథి, ప్రముఖ సామాజిక వేత్త దేవి మాట్లాడుతూ భారత రాజ్యంగం అందించిన విలువలను పాటించడంలో రాజకీయ నాయకులు, అధికారులు అలసత్వం వహిస్తున్నారన్నారు. ప్రస్తుతం దేశంలో మూకస్వామ్యం కొనసాగుతుందని దీనితో అనేకమంది ప్రాణాలు కొల్పొతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఈడీ కళాశాల అధ్యాపకుడు బండారు రామ్మోహన్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో కళాశాల పాలకవర్గ సభ్యుడు డీఎస్‌ఎన్ రాజు, సమైక్య భారతి జాతీయ కన్వీనర్ పి కన్నయ్య, జాతీయ కోశాధికారి వాదా ప్రసాదరావు, ప్రిన్సిపాల్ వక్కలంక కృష్ణమోహన్, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పుణ్యమూర్తుల ప్రసాద్, అహ్వాన కమిటీ ఛైర్మన్ నల్లా పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.