తూర్పుగోదావరి

తెలుగుదేశం పార్టీలో అవిశ్వాస రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 20: రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో వరుసగా మూడుసార్లు అధికారాన్ని చేపట్టిన తెలుగుదేశం పార్టీ సాంప్రదాయంగా వస్తున్న అసమ్మతి, అవిశ్వాస రాజకీయానికి తెర తీసింది. తెలుగుదేశం పార్టీకి పదవీకాలం చివరిరోజుల్లోనే ఆపార్టీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులకు తాము ఎన్నుకున్న మేయర్ల తప్పులు, పొరపాట్లు గుర్తుకు వస్తాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈసారి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరికి అనుంగు అనుచరుడైన డిప్యుటీ మేయర్‌పై కూడా అవిశ్వాసం ప్రవేశపెట్టాలని నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది. నగరపాలక సంస్థగా మారిన తరువాత తొలి మేయర్‌గా పదవి చేపట్టిన దివంగత ఎంఎస్ చక్రవర్తికి వ్యతిరేకంగా గోరంట్ల బుచ్చయ్యచౌదరి, గుడా చైర్మన్ గన్ని కృష్ణ తదితరుల ప్రోద్భలంతో కార్పొరేటర్లు అసమ్మతి బావుటా ఎగురవేశారు. ఆతరువాత మేయర్‌గా ఎన్నికైన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సతీమణి వీరరాఘవమ్మకి వ్యతిరేకంగా అసమ్మతి గళాన్ని వినిపించి, ప్రత్యేక బస్సులో హైదరాబాద్ వెళ్లి పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు చేశారు. నాడు నగర టిడిపి అధ్యక్షుడిగా వ్యవహరించిన ఆదిరెడ్డి అప్పారావు పార్టీ నాయకుల వైఖరితో తీవ్ర అసంతృప్తి చెంది వైఎస్సార్‌సిపిలో చేరి, ఎమ్మెల్సీ పదవి సాధించారు. తాజాగా మేయర్ పంతం రజనీశేషసాయిపై టిడిపి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. అలాగే డిప్యుటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు కూడా అవిశ్వాసాన్ని ప్రకటించాలని తీర్మానించారు. ఈమేరకు శుక్రవారం సాయంత్రం టిడిపి కార్పొరేటర్లు సమావేశమై సంతకాలు సేకరించారు. సుమారు 30 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేసినట్లు సమాచారం. మేయర్, డిప్యుటీ మేయర్ ఎన్నిక సందర్భంగా రెండున్నరేళ్ల తరువాత తనకు డిప్యుటీ మేయర్ పదవిని కట్టబెడతామని నాయకులు హామీ ఇచ్చారని, ఆ హామీని నెరవేర్చాలని చీఫ్‌విప్ పాలిక శ్రీను డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం ఆయన డిప్యుటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబుకు వ్యతిరేకంగా సంతకాలు సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సకాలంలో స్థారుూసంఘం సమావేశాలు నిర్వహించడం లేదని, తమ మాట వినడం లేదన్న కోపంతో మేయర్ రజనీశేషసాయిపై నాయకులు, కార్పొరేటర్లు అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. మేయర్, డిప్యుటీ మేయర్లపై అవిశ్వాసానికి పార్టీ పెద్దల ఆశీస్సులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో పార్టీ నాయకుల వైఖరిని వ్యతిరేకించిన ఆదిరెడ్డి అప్పారావు నేడు అవిశ్వాసానికి మద్దతునివ్వడం గమనార్హం. కాగా, గతంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిపై అసమ్మతి గళాన్ని వినిపించారు. మరోసారి బిసి సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళపై అవిశ్వాసాన్ని ప్రకటించారు. తాజాగా ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళపై అవిశ్వాసానికి సిద్ధం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సంవత్సరంలో ఆయా వర్గాలకు వ్యతిరేకంగా టిడిపి పనిచేయడం వల్ల పార్టీకి నష్టమే తప్ప ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈపరిణామాలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే టిడిపి అభ్యర్థిపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు.
విధుల్లో చేరిన ఏఎస్పీ
రాజమహేంద్రవరం, జూలై 20: దక్షిణ మండలం ఏఎస్పీగా నియమితురాలైన వి అజిత శుక్రవారం విధుల్లో చేరారు. గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న అర్బన్‌జిల్లాలోని దక్షిణ మండలం డిఎస్పీ పోస్టును ఐపిఎస్ అధికారిణి అజితతో భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఆమె రంపచోడవరం ఏఎస్పీగా పనిచేస్తూ బదిలీపై దక్షిణ మండలం ఏఎస్పీగా నియమితులయ్యారు.