తూర్పుగోదావరి

ఎంపీలకు మద్దతుగా కాగడాల ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, జూలై 20: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంలో బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని, పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ ఎంపీలు హోదా విషయంలో వీరోచితంగా పోరాడుతున్నారని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుమేరకు నియోజకవర్గంలోని 40 గ్రామాల కూడలి గ్రామమైన ద్రాక్షారామలో శుక్రవారం సాయంత్రం కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బోసుబొమ్మ సెంటర్ వద్ద ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన హామీల విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలు దేశ ప్రజల దృష్టికి తీసుకురావాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టినట్టు వెల్లడించారు. ఈ అవిశ్వాస తీర్మానం వల్ల కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేకపోయినప్పటికీ పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలు, ఒప్పందాలు అమలు జరగడంలేదన్న విషయం అదే పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే కాకుండా కోట్లాది మంది దేశ ప్రజలకు ఈవిషయం అర్ధమయ్యేందుకు అవకాశం కలిగిందని ఆయన అన్నారు. 15 ఏళ్ల క్రితం బీజేపీ ప్రభుత్వం వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉండగా ప్రతిపక్షం పెట్టిందని, మళ్లీ అదే బీజేపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస ధ్వజమెత్తిందన్నారు. పార్లమెంటులో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని టీడీపీకి చెందిన లోక్‌సభ సభ్యులు విజ్ఞప్తి చేసినప్పటికీ నిర్లక్ష్యం, నిర్లిప్తతతో పాతపాటే పాడటం దురదృష్టకరమన్నారు. ఈకార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు సయ్యద్ మీర్జా కాజిం హుస్సేన్ (్ఛటు), టీడీపీ నాయకులు పేపకాయల సత్యనారాయణ (బాబ్జి), తోట పృధ్వీరాజ్, తెలగాని ఏడుకొండలు, యండమూరి ఈశ్వరరావు, కోటిపల్లి ఆదేశ్వర సూర్యనారాయణ, కంచుమర్తి బాబూరావు, ఎంపీటీసీ సభ్యులు ఎస్ బాబి, విత్తనాల వెంకటరమణతోపాటు గ్రామసర్పంచ్‌లు, సింగిల్‌విండో ఛైర్మన్లు, వ్యవసాయ మార్కెట్‌కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.
ఎంపీలకు మద్దతుగా కాగడాల ప్రదర్శన
జగ్గంపేట జూలై 20: నవ్యాంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా ఇస్తామని మోసం చేసిన కేంద్ర ప్రభుత్వంపై ఎంపీలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో జరుగుతున్న సందర్భంగా వారికి మద్దతుగా జగ్గంపేటలో శుక్రవారం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మన్ ఎస్‌విఎస్ అప్పలరాజు, ఎంపీపీ గుడెల రాణీ, వైఎస్ ఎంపీపీ మారిశెట్టి భద్రం, జీను మణిబాబు, కొత్త కొండబాబు, ఎస్ ఎ గపూర్,మంతిన నీలాద్రీరాజు తదితరులు పాల్గొన్నారు.
అనపర్తి : అంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనైతికంగా విభజించిన తీరుకు నిరసనగా కాగడాల ప్రదర్శన నిర్వహించినట్టు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం రాత్రి నియోజకవర్గ కేంద్రమైన అనపర్తిలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి నేతృత్వంలో భారీ కాగడాల ప్రదర్శన జరిగింది. స్థానిక స్టేషన్ రోడ్డులో పంచాయతీ వద్ద ప్రారంభమైన ఈ ప్రదర్శన కెనాల్‌రోడ్డులో దేవీచౌక్ వద్దకు చేరుకోగా అక్కడ ఎమ్మెల్యే ప్రసంగించారు. శుక్రవారం పార్లమెంటులో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రదర్శన నిర్వహించినట్టు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్భ్రావృద్ధి కోసం, ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం పార్టీ అహర్నిశలూ కష్టపడుతుంటే జగన్, పవన్ బీజేపీతో అంతర్గతంగా జట్టుకట్టి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా సాధన కోసం టీడీపీ చేస్తున్న కృషిని ప్రజలు గుర్తించాలని ఎమ్మెల్యే కోరారు. కాగడాల ప్రదర్శనలో ఎంపీపీ ఉమామహేశ్వరి నారాయణరెడ్డి, వైస్-ఎంపీపీ వైజాగ్ శ్రీను, టీడీపీ నాయకులు ఎన్ త్రిమూర్తులు, దత్తుడు శ్రీను, మల్లిడి సురేందర్‌రెడ్డి, అన్నవరం పాలకమండలి సభ్యుడు సత్తి దేవదానందరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ శిరసపల్లి నాగేశ్వరరావు, ఓగిరెడ్డి రాధ, చిర్ల శ్రీదేవి, అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.