తూర్పుగోదావరి

విభజనతో తీవ్రంగా నష్టపోయాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 26: రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేసి ఆదుకోవాలని లోక్‌సభలో టిడిపి ఫ్లోర్ లీడర్, కాకినాడ ఎంపి తోట నరసింహం కోరారు. మంగళవారం లోక్‌సభలో రైల్వే బడ్జెట్ నిధులు, కేటాయింపులపై జరిగిన సమీక్షలో ఎంపి తోట రాష్ట్రానికి రైల్వే పరంగా జరిగిన నష్టాన్ని వివరించారు. విశాఖకు ప్రత్యేక రైల్వేజోన్, విశాఖ-విజయవాడ మధ్య డబుల్ డెక్కర్ రైలు, విశాఖ నుండి వివిధ ప్రాంతాలకు కొత్త రైళ్ళ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం శోచనీయమని అన్నారు. రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయించిన వాటాను తక్షణం విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ కేంద్రంగా శాటిలైట్ స్టేషన్ ఏర్పాటవుతుందని ఆశలు పెట్టుకున్నప్పటికీ నిరాశే ఎదురయ్యిందని ఆయన పేర్కొన్నారు. ప్రయాణికులపై అదనపు భారం మోపకపోవడం అభినందనీయమైనా, రాష్ట్రానికి రైల్వే పరంగా పెద్దపీట వేసిన పక్షంలో అభివృద్ధి సాధ్యమవుతుందని తోట వివరించారు.