తూర్పుగోదావరి

సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పలగుప్తం, ఆగస్టు 14: తీర ప్రాంతాలలోని గ్రామాలన్నింటికీ అవసరమైన వౌళిక వసతులు కల్పించి ప్రజలందరికి సంతోషకరమైన జీవితాన్ని అందించేందుకు టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఉప్పలగుప్తంలో మంగళవారం అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుతో కలిసి ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అయితాబత్తుల వారి పేటనుండి పేరయ్య చెరువుమీదుగా కూనవరం డ్రైయిన్‌పై కోటి రూపాయలతో నిర్మించిన వంతెనకు ప్రారంభోత్సవం చేశారు. ఆదేవిధంగా ఎన్ కొత్తపల్లి నుండి కాటారివారిపేట వరకు 3.36 కోట్లతో నిర్మించే బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అయితాబత్తుల వారి పేట నుండి పేరయ్యచెరువు మీదుగా వానపల్లిపాలెం వరకు నిర్మించి రోడ్డుకు ప్రారంభోత్సవం చేశారు. అదేవిధంగా ఎస్ యానంలోని బీచ్ రోడ్డు వద్ద డ్రైయిన్‌పై కెయిన్ ఎనర్జీ నిధులు రూ. 50 లక్షలతో నిర్మించే వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లు, వంతెనలు, విద్యుత్, తాగునీరు వంటి వౌళిక సదుపాయాలు ప్రజలకు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేస్తున్నామని, ఎస్ యానం గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పలగుప్తం ఎంపీపీ శిరంగు రాజా, జడ్పీటీసీ లక్ష్మినారాయణ, మాజీ సర్పంచ్‌లు పెయ్యిల రమాదేవి, నిమ్మకాయల చెల్లయ్య నాయుడు, నిమ్మకాయల జగ్గయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.

దేశరక్షణలో సైనికులు
*ఆకట్టుకున్న చిత్రకళ
రామచంద్రపురం, ఆగస్టు 14: భారతదేశ 72వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న శుభసమయంలో మండలంలోని నరసాపురపుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిత్రకళా ఉపాధ్యాయుడు రాయుడు త్రినాథ ప్రసాద్ ప్రస్తుత భారత పరిస్థితికి అద్దంపట్టేలా చిత్రం గీసి అందరి ప్రశంసలు అందుకున్నారు. సర్వమతాలు, అన్ని సామాజిక వర్గాలతో నిండి ఉన్న భారతదేశాన్ని రాత్రింబవళ్లు కంటికి రెప్పలా కాపాడుతూ పహారా కాస్తున్న ప్రతీ సైనికుడు ఉగ్రవాదులను సరిహద్దు ప్రాంతంలో ఎదురొడ్డి పోరాడుతూ తమ ప్రాణాలను పణంగా పెడుతున్న దృశ్యాన్ని ఈ చిత్రం ద్వారా త్రినాథ ప్రసాద్ ఆవిష్కరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కెకెఎల్ కుమారి, విద్యాకమిటీ ఛైర్మన్ రెడ్డి వెంకటరమణ, గ్రామ తాజా మాజీ సర్పంచ్ బడుగంటి చిన్నయ్య, ఎంఈవో ఎం శ్రీనివాస్‌తోపాటు పలువురు చిత్రకారులు రాయుడు త్రినాథ ప్రసాద్‌ను అభినందించారు.