తూర్పుగోదావరి

వానరం థాడిలో 12 మందికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొల్లప్రోలు, ఆగస్టు 14: మండల పరిధిలోని ఎపి మల్లవరం, చేబ్రోలు గ్రామాల్లో మంగళవారం వానరం (అలబొండ కోతి) స్వైర విహారం చేసింది. ఎపి మల్లవరం గ్రామానికి చెందిన పది మందిని, చేబ్రోలు గ్రామానికి చెందిన ఇద్దరిని తీవ్రంగా గాయపరిచింది. మంగళవారం ఉదయం ఎపి మల్లవరంలో తంగెళ్ల అప్పన్న, నక్కా అప్పన్న, పెనుమల్లు అప్పారావు, కడిమిశెట్టి సూర్యనారాయణ రెడ్డి, కాజులూరి వెంకట్రావు, బొడ్డపాటి మహాలక్ష్మి, పెనుమల్లు రామారెడ్డి, తాతపూడి పేరయ్య, కాలిబోయిన సూర్యనారాయణ, తంగెళ్ల సత్తిబాబు వానరం దాడిలో గాయాలపాలయ్యారు. సోమవారం చేబ్రోలులో పి వెంకటేశ్వరరావుతో పాటు మరో వ్యక్తిని కరిచింది. కోతి బారి నుండి కాపాడుకునేందుకు ప్రజలు పరుగులు తీశారు. గాయపడిన వారు చేబ్రోలు, గొల్లప్రోలు పిహెచ్‌సిలలో చికిత్స పొందారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గొల్లప్రోలు పోలీసులు చాకచక్యంగా వానరాన్ని పట్టుకుని శంఖవరం అటవీ ప్రాంతానికి తరలించారు.
తగ్గుతున్న గోదావరి
విఆర్ పురం, ఆగస్టు 14: గోదవరి ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు పెరిగిన గోదావరి, మంగళవారం తగ్గుముఖం పట్టింది. భద్రాచలం వద్ద 38.1 అడుగులకు చేరుకున్న వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టి 35.1 అడుగులకు చేరుకుంది. అదేవిధంగా మండల కేంద్రం విఆర్ పురం వద్ద 13.74 మీటర్ల వరకు చేరిన గోదావరి ఉద్ధృతి నెమ్మదిగా తగ్గుతూ 13.62 మీటర్లకు చేరింది. ఇదిలావుండగా ప్రస్తుతం గోదావరి వరద ఉద్ధృతికి, శబరి ఎగపోటుకు గున్నంకొండ వద్ద చింతరేవుపల్లి-విఆర్ పురం రహదారిపైకి నీరుచేరుకొని రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా వాగులగుండా శబరి ఎగపోటుకు దుక్కులు దున్ని సిద్ధం చేసుకున్న పంట పొలాల్లోకి నీరు చేరింది. భద్రాచలం ఎగువ ప్రాంతాల్లో కూడా గోదావరి వరద తగ్గుతుండటంతో మండలంలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు గ్రామాల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.
ముగిసిన ప్రజా సంకల్పయాత్ర
తుని, ఆగస్టు 14: వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర మంగళవారం జిల్లాలో ముగిసింది. కోటనందూరు మండలం కాకరాపల్లి వద్ద శిబిరం నుండి విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గన్నవరం మెట్ట వరకు 237వ రోజు పాదయాత్ర చేరింది. ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తదితర నాయకులు జగన్‌కు వీడ్కోలు పలికారు. ఈ ఏడాది జూన్ 12న ప్రజ సంకల్పయాత్ర రాజమహేంద్రవరం రైల్ కం రోడ్డు వంతెన మీదుగా జిల్లాలో ప్రవేశించింది. రంపచోడవరం, రాజానగం నియోజవర్గాలు మినహ 17 నియోజకవర్గాల్లో 32 మండలాలు, 232 గ్రామాలతో పాటు ఎనిమిది మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలో యాత్ర సాగింది. 15చోట్ల బహిరంగ సభలతో పాటు కాకినాడ రూరల్‌తో సహా రెండు చోట్ల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. జిల్లాలో జగన్ తన పాదయాత్రలో 2400, 2500, 2600, 2700 కిమీ ప్రస్థానం పూర్తి చేయడం విశేషం. జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర 412 కిమీ సాగింది.