తూర్పుగోదావరి

నేడు స్వాతంత్య్ర దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఆగస్టు 14: భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో బుధవారం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకలకు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని పతాకావిష్కరణ చేస్తారని కలెక్టర్ కార్తికేయ మిశ్రా చెప్పారు. 72వ స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా పోలీస్ పరేడ్ మైదానంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన పిమ్మట సంప్రదాయ కవాతు నిర్వహిస్తారు. ఉదయం 9.15నుండి 930 గంటల మధ్య మంత్రి ఉపన్యసిస్తారు. జిల్లా ప్రగతి, ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను తమ ప్రసంగంలో వివరిస్తారు. ఉదయం 9.30 నుండి 10.15 నిముషాల మధ్య జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం జిల్లాలో వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు, ప్రభుత్వ శాఖల అధికారులకు ప్రశంసాపత్రాలు బహుకరిస్తారు. వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా మంజూరైన ఉపకరణాలను లబ్ధిదారులకు అందజేస్తారు. ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రతిభావంతులు పాల్గొనే స్వాతంత్య్ర దినోత్సవాన్ని జయప్రదం చేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా కోరారు.