తూర్పుగోదావరి

500 మీటర్ల జాతీయ జెండాతో ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, ఆగస్టు 14: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం అమలాపురంలో 500 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శిస్తూ తిరంగయాత్రను నిర్వహించారు. ఈ యాత్రను ఎస్‌కేబీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ వి కృష్ణమోహన్ ప్రారంభించి మాట్లాడుతూ విద్యార్థులు దేశ భక్తిని పెంపొందించుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం స్థానిక ఎస్‌కేబీఆర్ కళాశాల నుండి పట్టణంలోని సుబ్బారాయుడు చెరువు, గోఖలే సెంటర్, హైస్కూల్ సెంటర్, గడియారస్థంభం సెంటర్, బస్టాండ్ వరకు ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాజమహేంద్రవరం విభాగ్ సంఘటన కార్యదర్శి సుమన్, నాయకులు కొత్తపల్లి వంశి, బీ ఉదయ్, వై కొండ, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.
స్వల్పంగా తగ్గుముఖం పట్టిన గోదావరి
కూనవరం, ఆగస్టు 14: భారీ వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతితో కూనవరం వద్ద గోదావరి నీటి ప్రవాహం మంగళవారం సాయంత్రం వరకూ పెరిగింది. 13.74 మీటర్లకు చేరుకుని సాయంత్రం 6గంటలకు 14 పాయింట్లు తగ్గి 13.6 మీటర్ల వద్ద గోదావరి ప్రవహిస్తోంది. కోనరాజుపేట కాజ్‌వేపైకి వరద నీరు పోటెత్తటంతో మంగళవారం ఉదయం నుంచి ఆరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని కోనరాజుపేట, వాల్సార్డ్‌పేట, శ్రీరాంపురం, శబరి కొత్తగూడెం, జినె్నలగూడెం, చిన్నార్కూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరంలో రెండు జోనల్ టీంలను ఏర్పాటుచేశామని, బఫర్ స్టాక్‌ను సిద్ధం చేశామని తహసీల్దార్ ఉదయ్ భాస్కర్ తెలిపారు.

లంక గ్రామాలకు పొంచి ఉన్న వరథ ముప్పు
అయినవిల్లి, ఆగస్టు 14: భద్రాచలంలో గోదావరి 40 అడుగుల మేర ప్రవహిస్తుండడంతో ధవళేశ్వరం బ్యారేజ్ నుండి సముద్రంలోకి సుమారు ఏడు లక్షల క్యూసెక్కులు నీటిని వదలడంతో లంకగ్రామాలకు వరదనీరు పోటెత్తుతోంది. అయినవిల్లి మండలం ముక్తేశ్వరం తొగరపాయ పాతవంతెన మంగవారం సాయంత్రానికి వరదనీటిలో మునిగింది. దీంతో లంక గ్రామాల ప్రజలను తహసీల్దారు వి సుస్వాగతం అప్రమత్తం చేసి వీఆర్వోలు ఎప్పటికప్పుడు వరదనీటి పరిస్థితిని తెలియజేయాలన్నారు. బుధవారం నాటికి వరద ప్రవాహం అధికంగా ఉండే పరిస్థితులున్నాయని, ఈ మేరకు గ్రామాల్లో దండోరా వేయించాలని తహసీల్దారు సూచించారు. లంక గ్రామాలనుండి పాఠశాలలకు వెళ్ళే విద్యార్ధులకు ప్రభుత్వం రెండు రోజులు సెలవు ప్రకటించడంతో గోదావరి దాటి విద్యార్థులు ఎవరూ బయటకు వెళ్ళకుండా చూడాలని వీఆర్వోలను హెచ్చరించారు. అలాగే ఎఫ్‌డివో శ్రీనివాస్‌ను లంక గ్రామాల్లో గోదావరి దాటేందుకు ఇంజను పడవలు సిద్ధం చేయాలని తహసీల్దారు సుస్వాగతం ఆదేశించారు.

పడవ దాటింపులు నిలిపివేత
ఐ పోలవరం, ఆగస్టు 14: గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఐ పోలవరం మండల పరిధిలోని అన్ని రేవుల్లోను కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశాలు మేరకు సోమవారం సాయంత్రం నుండి పడవ దాటింపు నిలిపివేసినట్లు తహసీల్దారు ఎం విద్యాసాగర్ తెలిపారు. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నందున రెండురోజులు పశువుల్లంక, గోగుల్లంక, మూలపొలం, పల్లంకుర్రు, కేశనకుర్రు రేవుల్లో రేవు దాటింపు నిలిపివేశామన్నారు. అన్ని రేవుల్లో రెవెన్యూ, పోలీసు సిబ్బందిని అందుబాటులో ఉంచామని, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.