తూర్పుగోదావరి

వరద పరిస్థితిపై అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దాపురం, ఆగస్టు 17: జిల్లాలో రెండు రోజులుగా నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరిలో వరద ఉద్ధృతి తీవ్రంగా ఉందని, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం హోం మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలని, వరద పెరుగుదలపై పూర్తి సమాచారాన్ని ఆయా ప్రాంతాల వారికి తెలియజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. లంక గ్రామాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశాలిచ్చారు. బలహీనంగా ఉన్న గోదావరి గట్లు, అవుట్ ఫ్లో స్లూయిజ్‌ల వద్ద పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పాపికొండల ప్రాంతం నుంచి వచ్చే వరద ఉద్ధృతిని అంచనా వేస్తూ, ప్రమాదాలు సంభవించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. లంక గ్రామాల్లో ప్రజలు నాటు పడవల్లో ప్రయాణాలు చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు అన్ని మండల కేంద్రాల్లో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్టు మంత్రి తెలిపారు.

కాపులకు ఇచ్చిన హామీ నేరవేర్చండి: ముద్రగడ
అల్లవరం, ఆగస్టు 17: కాపుజాతి వల్లే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే చెబితే సరిపోదని, తమకు ఇచ్చిన హామీ మేరకు బీసీ జాబితాలో కాపులను చేర్చాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. శుక్రవారం అల్లవరంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించడానికి బీసీ కులాలు, కేంద్ర ప్రభుత్వం అడ్డు తగులుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం సాకులు చెప్పడం సరికాదన్నారు. రాష్ట్రంలో కాపులకు బీసీ రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే కేంద్రంలో ప్రవేశపెట్టాలన్నారు. కాపుల రిజర్వేషన్ల కోసం అనేక మంది ఐపీఎస్, ఐఏఎస్ అధికార్లను, సీనియర్ న్యాయవాదులను కలిసి సలహాలు అడగడం జరిగిందని ముద్రగడ తెలిపారు. రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన పార్టీలు అధికారంలో ఉన్నా కాపులకు న్యాయం జరగడం లేదన్నారు. చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలపై జూలై 14న ముఖ్య మంత్రి చంద్రబాబుకు లేఖ వ్రాయడం జరిగిందన్నారు. కాపులను బీసీ-ఎఫ్ జాబితాలో చేర్చి తహసీల్దార్ కార్యాలయంలో సర్ట్ఫికెట్లు మంజూరు చేయాలని ముద్రగడ డిమాండ్ చేశారు. కాపులను బీసీల్లో చేర్చే అధికారం ముఖ్యమంత్రికి ఉందని, చేర్చే వరకు తాము అడుగుతూనే ఉంటామన్నారు. వచ్చే 2019 ఎన్నికలు గురించి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ముద్రగడ చెప్పారు. ఈ సమావేశంలో నల్లా విష్ణుమూర్తి, చిట్నీడి శ్రీనివాస్, కంకిపాటి సుబ్బారావు, తిక్కా ప్రసాద్‌రావు, కంకిపాటి వీరబాబు, డి రమేష్, సీహెచ్ వెంకన్న పాల్గొన్నారు.