తూర్పుగోదావరి

భారతరత్న వాజ్‌పేయి సేవలు అజరామరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఆగస్టు 17: భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి జగమంత కుటుంబాన్ని సంపాదించుకున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య అన్నారు. దివంగత నేత వాజ్‌పేయి స్మృత్యర్థం జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని బీజేపీ కార్యాలయంలోను, గాంధీ నగర్ రైతుబజారు, బాలాజీ చెరువు వద్ద టీటీడీ కళ్యాణ మండపం, ఎంఎస్‌ఎన్ ఛారిటీస్ తదితర ప్రాంతాల్లో గురువారం సంతాప సభలు నిర్వహించారు. ఆయా సభలకు హాజరైన మాలకొండయ్య మాట్లాడుతూ వాజ్‌పేయి మన మధ్య లేకపోవడం దురదృష్టకరమన్నారు. అటల్‌జీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు చెప్పారు. బ్రహ్మచారిగా జీవించిన ఆయన జగమంత కుటుంబాన్ని సంపాదించారని శ్లాఘించారు. దేశానికి ఎంతో సేవ చేసిన నిస్వార్ధమైన, నిష్కళంకమైన రాజకీయ వేత్తగా అటల్‌జీ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందారన్నారు. ఆయన పాలనలో దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిందని చెప్పారు. దేశం గర్వించదగిన మహానేతగా ఎదిగిన వాజ్‌పేయి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఆయన అడుగుజాడల్లో పయనిస్తూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. జాతీయ రహదారుల విస్తరణ-అభివృద్ధి కార్యక్రమాలు ప్రజాదరణ పొందాయన్నారు. పోక్రాన్ అణుపరీక్షలు, కార్గిల్ యుద్ధం వంటి సంచలనాత్మక ఘట్టాలు అటల్‌జీ దీక్షాదక్షతలకు దర్పణం పట్టాయన్నారు. రైతాంగం అభివృద్ధి, సాంకేతిక విప్లవానికి నాంది ఇలా ఎన్నో దేశం గర్వించదగిన కార్యక్రమాలను అటల్‌జీ ప్రవేశపెట్టారని శ్లాఘించారు. వాజ్‌పేయి అందించిన సేవలు దేశ చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించివుంటాయని పేర్కొన్నారు. మానవతావాదిగా, పాత్రికేయుడిగా, కవిగా ఆయన చేసిన సేవలు మరువలేమని మాలకొండయ్య శ్లాఘించారు. ఆయా శిబిరాల్లో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పార్టీ నేతలు సంతాప సూచికగా కూర్చున్నారు. బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు, బీజేపీ కాకినాడ నగర అధ్యక్షుడు పి రవికిరణ్, ఎన్‌వీ సాయిబాబా, గోడి వెంకట్, పార్టీ కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.