తూర్పుగోదావరి

అట్టహాసంగా జన్మభూమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జనవరి 2: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా పిలుపునిచ్చిన జన్మభూమి కార్యక్రమం జిల్లాలో శనివారం నుండి ప్రారంభమయ్యింది. ఈనెల 11వ తేదీ వరకు ఆయా గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో జన్మభూమిని నిర్వహిస్తున్నారు. శనివారం జన్మభూమి కార్యక్రమాన్ని జిల్లాలోని పెద్దాపురంలో ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభించారు. కలెక్టర్ హనుమంతు అరుణ్‌కుమార్, సంయుక్త కలెక్టర్ ఎస్ సత్యనారాయణ, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులకు రేషన్‌కార్డులు, పింఛన్లను ఉప ముఖ్యమంత్రి అందజేశారు. అలాగే జిల్లా కేంద్రం కాకినాడలోని రేచర్లపేటలో జరిగిన జన్మభూమి ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యుడు వనమాడి వెంకటేశ్వరరావు, నగర పాలక సంస్థ కమీషనర్ అలీం బాషా, సహాయ కమీషనర్ ఎస్ గోవిందస్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు పింఛన్లు, రేషన్‌కార్డులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో అధికారుల పర్యవేక్షణలో, ప్రజా ప్రతినిధుల సమక్షంలో జన్మభూమి కార్యక్రమాలను ప్రారంభించారు. స్మార్ట్‌గ్రామం, స్మార్ట్‌వార్డు ప్రథాన అజెండాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ దఫా జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీనిపై విస్తృతరీతిలో ప్రచారం చేయాలని ప్రభుత్వం సూచించింది. గతంలో జన్మభూమి, ఇతర సందర్భాలలో ప్రజల నుండి అందిన ఫిర్యాదుల పరిష్కారానికి కూడా తాజా జన్మభూమిలో ప్రాధాన్యతనిస్తున్నారు. పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది, పేదరికంపై గెలుపు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, నీరు-చెట్టు తదితన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నీరు, రహదారి, విద్యుత్, గ్యాస్, ఫైబర్ ఆప్టిక్ తదితర ఐదు రకాల గ్రిడ్లు, ప్రాధమిక సెక్టార్, సోషల్ ఎంపవర్‌మెంట్, నాలెడ్జ్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్, అర్బన్ డెవలప్‌మెంట్, ఇండస్ట్రీ సెక్టార్, వౌళిక సౌకర్యాలు, సేవా రంగం వంటి 7 రకాల మిషన్లపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో జన్మభూమి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతున్న నేపథ్యంలో ఈనెల 8న కాకినాడలో జరిగే జన్మభూమి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.

పిసిసిలో రాజమహేంద్రవరానికి పెద్దపీట
రాజమహేంద్రవరం, జనవరి 2: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గాన్ని అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి విస్తరించారు. ఈ విస్తరణలో రాజమహేంద్రవరానికి పెద్దపీట వేశారు. పిసిసి కార్యవర్గంలో రాజమండ్రి నుంచి పలువురు కాంగ్రెస్ నాయకులకు చోటు లభించింది. పిసిసి కార్యదర్శులుగా దాసి వెంకట్రావు, ఎం విశే్వశ్వరరావు, అసదుల్లా అహ్మద్, గట్టి నర్సయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా బెజవాడ రంగారావు, సంయుక్త కార్యదర్శులుగా తాళ్లూరి విజయ్‌కుమార్, ముళ్ల మాధవరావు నియమితులయ్యారు.