తూర్పుగోదావరి

అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ప్రాథమిక సౌకర్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుని, ఏప్రిల్ 28: ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రాథమిక సౌకర్యాలు కల్పిస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో రూ.8.5 కోట్లతో నిర్మించనున్న ప్రసూతి, శిశు ఆరోగ్య కేంద్రానికి, ఇ-హెచ్‌ఎంఎస్‌పనులను మంత్రులు కామినేని, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి కామినేని మాట్లాడుతూ ఈ ఆసుపత్రిలో రోజుకు సగటున పది డెలివరీ కేసులు నమోదవుతున్నాయని, డెలివరీకి సంబంధించిన అన్ని సౌకర్యాలు నూతనంగా నిర్మిస్తున్న మాతా శిశు ఆసుపత్రిలో ఉంటాయన్నారు. ఈ వైద్యశాలలో 50 బెడ్స్ ఉంటాయని, రాష్ట్రంలో రూ.4 కోట్లతో అనకాపల్లిలోను, రూ.8.05 కోట్లతో తునిలోను వైద్యశాలు నిర్మిస్తున్నట్టు తెలిపారు. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా తల్లీబిడ్డలు చనిపోతున్నారని, 2015-16లో మరణాలను తగ్గించినట్లు చెప్పారు. ఫేస్‌లిఫ్ట్ ద్వారా రూ.80 కోట్ల రివాల్వింగ్ ఫండుతో రాష్ట్రంలో 69 వైద్యశాలలకు ప్రాథమికావసరాలు కల్పించినట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1400 మంది వైద్యులను నియమించామని, మరో 500మందిని నియమిస్తామని, లోగడ వెయ్యి మంది నర్సులను నియమించామని, కొత్తగా మరో వెయ్య మందిని నియమిస్తామని తెలిపారు. పిహెచ్‌సి స్థాయి నుండీ అన్ని వైద్య పరీక్షలు చేస్తారని, పరికరాల నిర్వహణకు కాంట్రాక్టు ఇచ్చామని చెప్పారు. అన్ని ఏరియా వైద్యశాలలో ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ సౌకర్యం ఏర్పాటుచేసినట్టు తెలిపారు. జిల్లాలో 11 పిహెచ్‌సిలను మంజూరు చేసినట్టు మంత్రి కామినేని తెలిపారు. రోగి వైద్య రికార్డు ఆధార్ కార్డు ద్వారా ఆన్‌లైన్‌లో నమోదవుతుందని, దీనివల్ల రాష్ట్రంలో ఏ వైద్యశాలకు వెళ్లినా ఆన్‌లైను ద్వారా రికార్డును పరిశీలించవచ్చునన్నారు. రాష్ట్రంలో అనకాపల్లి, కెజిహెచ్, నర్సిపట్నం, తునిలలో ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. ముందుగా తునిలో గురువారం ప్రారంభించినట్టు మంత్రి కామినేని తెలిపారు. ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ పేదలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పిహెచ్‌సిలను బలోపేతం చేస్తున్నట్టు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ నామన రాంబాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎన్ వీరెడ్డి, ఎపిఎంఎస్ ఐడిసి ఎండి సిహెచ్ వెంకట గోపీనాధ్, జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్, ఎఎంసి ఛైర్మన్ యనమల కృష్ణుడు, హెచ్‌డిసి ఛైర్మన్ పి శేషగిరిరావు, మున్సిపల్ ఛైర్మన్ ఇ సత్యనారాయణ, తాండవ సుగర్స్ ఛైర్మన్ ఎస్ లోవరాజు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.