తూర్పుగోదావరి

అన్ని రకాల ధాన్యం కొనాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, ఏప్రిల్ 28: రైతు పక్షపాతిగా అధికారులు పనిచేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ ఆదేశించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో గురువారం ఎనిమిది మండలాల తహసీల్దార్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జిలు, ఎంహెచ్‌వోలు తదితర సిబ్బందితో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి సత్యనారాయణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు రికార్డులు సక్రమంగా ఉంచడంలేదన్నారు. కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చిన రైతులతో ప్రభుత్వ కల్పిస్తున్న మద్దతు ధర, వివరాలు వారికి పూర్తిగా తెలియజేయాలన్నారు. ఏ ఒక్కరు నిర్లక్ష్యం చేసినా కఠిన చర్యలు ఉంటాయన్నారు. కొనుగోలు కేంద్రాలు తనిఖీ చేయాల్సిన బాధ్యత తహసీల్దార్లపై ఉందన్నారు. బొండాలు ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని, ఏ ధాన్యం అయినా కొనుగోలు చేయాలన్నారు. ఏవరైన కొనుగోలు చేయకపోతే తనకు ఫిర్యాదు చేయాలన్నారు. సివిల్ సప్లయిస్ అధికారులు రేషన్ డీలర్లతో జెసి మాట్లాడారు. రేషన్ సరుకులకు వచ్చిన వారు వేలిముద్రలు పడటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. పది వేళ్లలో ఏ ఒక్క ఫింగర్ పడినా... ఆ వేలును పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఎవరినీ ఇబ్బందులకు గురిచేయవద్దన్నారు. బెస్ట్ ఫింగర్స్ డిటెక్షన్ అనే పద్ధతిలో ఏ వేలునైనా పరిగణలోకి తీసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్డీవో కె సుబ్బారావు, ఎనిమిది మండలాల తహసీల్దార్లు, డిఎస్‌వోలు, డిఎంవోలు, డిసివో పాల్గొన్నారు.