తూర్పుగోదావరి

రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రౌతులపూడి, ఏప్రిల్ 28: ఉప ప్రణాళిక ప్రాంత గ్రామాల రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నట్ట రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. గురువారం ఉప ప్రణాళిక ప్రాంత గ్రామాలైన ఎస్ పైడిపాల, సత్యవరం గ్రామాలకు రూ.6.9 కోట్లు గిరిజన ఉప ప్రణాళిక నిధులతో బిటి రోడ్లు నిర్మాణాలకు హోం మంత్రి చినరాజప్ప శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక విలేఖర్లతో చినరాజప్ప మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా గిరిజన గ్రామాలకు రహదారుల సౌకర్యం లేక గిరిజనులు ఇబ్బందులు పడేవారని, ప్రభుత్వం గిరిజన ప్రాంతాలలో రహదారి సమస్యలను పరిష్కరించేందుకు రూ.6.9 కోట్ల నిధులను కేటాంచి రహదారుల నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. గ్రామ పంచాయతీ 50 శాతం, ఉపాధి హామీ పథకం ద్వారా 50 శాతం నిధులతో అన్ని గ్రామాలల్లో సిసి రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాలు చేపట్టారని, ఎన్‌ఆర్‌ఇజిఎస్ ద్వారా పుంత రోడ్ల నిర్మాణం కూడా చేపట్టినట్టు తెలిపారు. రౌతులపూడి మండలం ఏర్పాటు ఆలస్యం కావడం వలన పోలీసు స్టేషన్, ఎపి ట్రాన్స్‌కో ఎఇ కార్యాలయం ఏర్పాటు కాలేదని, వీటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. మండలానికి ఒక జూనియర్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ కళాశాల ఏర్పాటుకు ప్రైవేటు విద్యా సంస్థ ముందుకు వస్తే అనుమతులు మంజూరు చేస్తామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. నూతన రాజధాని నిర్మాణానికి 33వేల ఎకరాలను ప్రభుత్వానికి ఎటువంటి ఖర్చులేకుండా భూ సేకరణ చేసినట్టు తెలిపారు. మెట్టప్రాంతానికి సాగునీరు అందించేందుకు పుష్కర ఎత్తిపోతల పథకంతోపా, పోలవరం ఎడమ కాలువ ద్వారా సాగునీరు అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. అలాగే రాష్ట్భ్రావృద్ధికి కేంద్రం నిధులు రాబట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు తెలిపారు. కాపు కార్పోరేషన్ ద్వారా కూడా రుణాలను మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. అక్రమంగా జరిగే గ్రావెల్, మైనింగ్ కార్యకలాపాలను అరికట్టమని అధికారులను ఆదేశించామని తెలిపారు. భూగర్భ జలాలు పెంచేందుకు నీరు-చెట్టు ద్వారా చెర్వులలో పూడికతీత పనులను చేపట్టారని, వీటితోపాటు ఫాంపాండ్స్, ఇంకుడు గుంతలను నిర్మిస్తున్నట్టు తెలిపారు. వేసవిలో ఎక్కడా తాగునీటి ఎద్దడి లేకుండా అవసరమైన చర్యలు తీసుకున్నామని, అవసరమైతే కొన్ని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తాగునీరందించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నందున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రూ.2.4 కోట్లతో రౌతులపూడి నుండి ఎస్ పైడిపాల వరకు, రూ.2 కోట్లతో ఎస్ పైడిపాల నుండి బలరాంపురం, రూ.2.05 కోట్లతో ఎస్ పైడిపాల నుండి సత్యవరం వరకూ ఆర్‌అండ్‌బి రోడ్ల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎ లక్ష్మీశివకుమారి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, డిసిసిబి ఛైర్మన్ వరుపుల రాజా, పర్వత రాజబాబు, పర్వత సురేష్, ఆర్‌అండ్‌బి డిఇ ఎఎస్‌ఎస్ ప్రకాశరావు, జెఇ కుమార్, ఎంపిడిఒ నాగేశ్వరరావు, తహసీల్దార్ రూజ్‌వెల్ట్, ఎంపిపి ఇ సూర్యభాస్కరరావు, జడ్పీటీసీ సిహెచ్ సత్తిబాబు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.