తూర్పుగోదావరి

డిటిసి మోహన్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 28: ఆదాయానికి మించి భారీ ఆస్తులతో అవినీతి నిరోధక శాఖ సోదాల్లో చిక్కిన కాకినాడ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (డిటిసి) ఆదిమూలం మోహన్‌ను అరెస్ట్ చేసినట్టు ఎసిబి ఇన్‌స్పెక్టర్ సతీష్ గురువారం రాత్రి ధ్రువీకరించారు. విజయవాడ ఎసిబి కోర్టులో శుక్రవారం నిందితుడిని హాజరుపరచనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. కాకినాడలోని మోహన్ నివాసంలో గురువారం రాత్రి పొద్దుపోయే వరకు సోదాలు జరుగుతుండగా శుక్రవారం ఉదయం వరకు ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉన్నట్టు చెప్పారు. కాకినాడలోని మోహన్ నివాసంలో రూ.85వేల నగదు, 2 కిలోల బంగారు ఆభరణాలు, ఐదున్నల కిలోల వెండితో పాటు విలువైన మరికొన్ని వస్తువులు సేకరించామని, పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలియజేశారు.