తూర్పుగోదావరి

‘ఆది’నుండీ అవినీతిమయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 28: సుమారు రూ.100 కోట్ల అక్రమాస్తులతో అవినీతి నిరోధక శాఖకు చిక్కిన కాకినాడ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (డిటిసి) ఆదిమూలం మోహన్ వ్యవహార శైలి ఆది నుండి వివాదాస్పదంగానే తయారయ్యింది. కాకినాడ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషర్‌గా గత ఏడాదిన్నరగా పనిచేస్తున్న మోహన్ పేరు చెబితే సంబంధిత కార్యాలయ సిబ్బందే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ఈయన పనిచేసిన ప్రతిచోటా అధికారులు, దిగువస్థాయి సిబ్బందితో ఏ మాత్రం సత్సంబంధాలు లేకుండా వ్యవహరించడం ఈయన ప్రత్యేకతగా సహచరులు చెప్పుకుంటున్నారు. విధి నిర్వహణలో అలసత్వం, అక్రమార్జనలో అందెవేసిన చేయిగా మోహన్‌ను రవాణా శాఖ సహోద్యోగులే విమర్శిస్తుండటం గమనార్హం. ఇటీవల సాక్షాత్తూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు కుమారుడు డిటిసి అక్రమ వ్యవహారశైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. మంత్రి కూడా పలు సందర్భాలలో మోహన్ తీరు పట్ల అసహనం వ్యక్తం చేసినట్టు భోగట్టా. మోహన్ తీరుపై స్థానికంగా అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ఒక మహిళ లైసెన్స్ కోసం గత నవంబర్‌లో డిటిసి కార్యాలయానికి చెప్పులరిగేలా తిరిగింది. సుమారు నెల రోజుల పాటు తిరిగి చివరికి కార్యాలయం వద్దే విసిగి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో సిబ్బంది స్పందించి ఆమెను ఆసుపత్రికి తరలించి, ఆమె కోలుకున్నాక పని పూర్తిచేసిపెట్టారు. స్థానికంగా లారీ యూనియన్ల వివాదాలు సృష్టించిన ఘనత కూడా మోహన్‌కు ఉన్నట్టు లారీ యజమానులు చెప్పుకుంటున్నారు. లారీ యూనియన్‌ల నేతలు ఇతడితో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ట్రావెల్స్ సంస్థల నిర్వాహకులు కూడా ఈయన పెట్టే బాధలు తట్టుకోలేక తమ వాహనాలను అమ్ముకునేందుకు సైతం సిద్ధపడ్డారంటే అతిశయోక్తి కాదు. డిటిసి తన కార్యాలయంలో తక్కువగా కనిపించడం, విధులకు డుమ్మా కొట్టడం, ఇంటి వద్దే పంచాయుతీలు పెడుతుండటంతో సహచర అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయంలోకి ఎవర్నీ రాకుండా చేయడం, సిబ్బందికి ప్రమోషన్లు ఇవ్వాలంటే లక్షలాది రూపాయలు గుంజుతున్నారన్న ఆరోపణలు మోహన్‌పై ఉన్నాయి.
కాకినాడ నగరంలోని గైగోలపాడు సాయిభావజ్ఞ కాలనీలో మోహన్ నివసిస్తున్నారు. ఎసిబి అధికారులు గురువారం ఆయన నివాసంపై మెరుపుదాడి చేయడం రవాణా శాఖ వర్గాల్లో కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా బెంగుళూరులో మొత్తం 9 చోట్ల ఎసిబి బృందాలు ఏకకాలంలో దాడులు ప్రారంభించాయి. కాకినాడలో నివసిస్తున్న మోహన్ ఇంటికి హైదరాబాద్ నుండి ఎసిబి సెంట్రల్ ఇనె్వస్టిగేషన్ యూనిట్ చేరుకుని, వెనువెంటనే సోదాలు జరిపింది. ఎసిబి-డిజి డాక్టర్ ఎం మాలకొండయ్య ఆదేశాల మేరకు ఎసిబి సెంట్రల్ ఇనె్వస్టిగేషన్ యూనిట్ డిఎస్‌పి ఎ రమాదేవి ఆధ్వర్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి.