క్రైమ్/లీగల్

వణికిస్తున్న ‘డెంగ్యూ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ రూరల్, సెప్టెంబర్ 18: వరుస డెంగ్యూ జ్వరాలు కాకినాడ రూరల్ గ్రామాలను వణికిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా జనం డెంగ్యూ జ్వరాలతో ఆసుపత్రులు పాలవుతున్నారు. దీనికి ప్రధాన కారణం గ్రామాల్లో అపారిశుద్ధ్యమే. గ్రామ పంచాయతీ లలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేక జనం బబ్బులకు గురవుతున్నారు. పంచాయతీలలో పాలనా వ్యవస్థ కుంటుపడటంతో అధికారుల అలసత్వం స్పష్టమవుతోంది. కొన్ని పంచాయతీలు రెంటికి చెడ్డరేవడిలా అటు కార్పొరేషన్‌కి చెందక ఇటు పంచాయతీలకి చెందనట్లు కార్యదర్శులున్నా ప్రత్యేక అధికారుల పాలన నడుస్తోంది. ఇక్కడ పారిశుద్ధ్య నిర్వహణ కంటితుడుపు చర్యగా నడుస్తోంది. కార్పొరేషన్‌లో విలీనం అయినట్లు చెబుతున్న పంచాయతీలన్నీ సుమారు 15వేల నుండి 25 వేల జనాభా కల్గినవే. రమణయ్యపేట, తూరంగి, ఇంద్రపాలెం, ఎస్ అచ్యుతాపురం, చీడిగ, వలసపాకల, సర్పవరం, తిమ్మాపురం, వాకలపూడి లాంటి పెద్ద పంచాయతీలతో బాటు రేపూరు, కొవ్వాడ, గంగనాపల్లి, స్వామి నగర్, పండూరు, తమ్మవరం, నేమం, పెనుమర్తి, వెంకటాపురం, సూర్యారావుపేట, కొవ్వూరు లాంటి పంచాయతీలల్లో పూర్తి కావడంతో ప్రశ్నించే నాధుడు లేక కార్యదర్శుల పనితీరు నిర్లక్ష్య ధోరణితో నడుస్తోంది. కనీసం బ్లీచింగ్ కూడా కొట్టని స్థితి నెలకొంది. తూరంగి, తిమ్మాపురంలలో ఇప్పటికీ జనం జ్వరాలతో బాధపడుతూ ఉన్నారు. తిమ్మాపురంలో ఓ మహిళ డెంగ్యూతో చనిపోయిన తర్వాత పంచాయతీ పారిశుద్ధ్య పనులు ప్రారంభించిందని మృతురాలి కుటుంబ సభ్యుల ఆవేదన వ్యక్తం చేశారు. పందుల, కుక్కల బెడద అయితే మరీను. ఈ మధ్యకాలంలో ఇంద్రపాలెం పంచాయతీ వద్ద గ్రామస్థులు ధర్నాలు కూడా నిర్వహించారు. తమ తప్పుని కప్పిపుచ్చుకోడానికి బ్లూ క్రాస్ చట్టం సాకుగా కనిపిస్తోంది.

మన్యంలో మరో శిశుమరణం
నాలుగునెలల మగబిడ్డ అనారోగ్యంతో మృతి
రాజవొమ్మంగి, సెప్టెంబర్ 18: మన్యంలో శిశుమరణాల పరంపర కొనసాగుతోంది. మండలంలో కొత్త కిండ్ర అనే మారుమూల గ్రామంలో నివసిస్తున్న వెలుచూరి మంజుల అనే గిరిజన మహిళకు జన్మించిన నాలుగు నెలల వయస్సున్న మగబిడ్డ అనారోగ్యంతో బాధ పడుతూ సోమవారం రాత్రి మరణించాడు. ఈ గ్రామం లోతట్టున ఉండడంతో ఈ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. సోమవారం సాయంత్రం తీవ్ర జ్వరంతో బాధ పడుతూ ఊపిరి పీల్చుకోలేకపోడంతో బిడ్డను హుటాహుటిన కుటుంబీకులు లాగరాయి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తీసుకొచ్చారు. వైద్య సిబ్బంది పరీక్షించే సరికే బిడ్డ మరణించాడు. తొలికాన్పులో మగబిడ్డ పుట్టాడని ఆనందపడ్డామని, ఆ ఆనందం నాలుగునెలలు తరువాత మాయమైందని తమ ఆశలు అడియాశలయ్యాయని బిడ్డ తల్లి దండ్రులు ఆవేదన వ్యక్తం చేసారు. బిడ్డ తండ్రి నల్లమయ్య అదే గ్రామంలో ప్రయివేటు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. తనకు గత వారం రోజులుగా ఎటువంటి పనులు లేకపోడంతో చిల్లిగవ్వకూడ లేకపోడంతో బిడ్డను ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్ల లేకపోయానని అందుకే మరణించాడని ఆవేదన వ్యక్తం చేసాడు. విశాఖ జిల్లా చింతపల్లికి చెందిన మంజుల ఆమె అమ్మగారి ఇంటి వద్ద పురుడు పోసుకుని ఇటీవలే అత్తవారి ఇల్లయిన కొత్త కిండ్రకు వచ్చింది. అ బిడ్డ మరణంతో మండలంలో ఈ ఏడాది మరణించిన శిశువుల సంఖ్య 12కి చేరుకుంది.