తూర్పుగోదావరి

పిఠాపురం మున్సిపల్ కమిషనర్‌గా సృజన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిఠాపురం, సెప్టెంబర్ 19: పిఠాపురం మున్సిపల్ నూతన కమిషనర్‌గా ఇటీవల గ్రూప్-1లో అర్హత సాధించిన గానుగుల సృజన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ కార్పొరేషన్‌లో కార్యదర్శిగా పనిచేసిన ఈమె తాజాగా బదిలీల్లో పిఠాపురం కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. బాధ్యతలు స్వీకరించిన కమిషనర్‌ను కార్యాలయంలో పలు విభాగాల అధికారులు, మున్సిపల్ ఉపాధ్యాయులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తన వంతు బాధ్యతగా పనిచేసి ప్రజా సమస్యలు తీర్చేందుకు అందరి సహకారంతో పనిచేస్తానని ఈసందర్భంగా సృజన చెప్పుకొచ్చారు.

సత్యదేవుని హుండీ ఆదాయం రూ. 50 లక్షలు
అన్నవరం, సెప్టెంబర్ 19: రత్నగిరిపై వేంచేసియున్న శ్రీ సత్యనారాయణస్వామికి హుండీల రూపంలో యాభై లక్షల రూపాయల ఆదాయం లభించినట్టు ఈవో ఎం జితేంద్ర తెలిపారు. బుధవారం దేవస్థానం హుండీలను సత్యదేవుని నిత్య కల్యాణ మండపంలో ఈవో సమీక్షంలో ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు లెక్కించారు. దేవస్థానంలో కొండపైన, దిగువున ఉన్న 53 హుండీలను తెరిచి లెక్కించగా గడచిన 16 రోజులకు రూ. 50,033,940 రూపాయల నగదు, 180 గ్రాముల బంగారం, 245 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ లభించింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం అసిస్టెంటు కమిషనర్ ఈరంకి జగన్నాధరావు, పాలక మండలి సభ్యులు కొత్త కొండబాబు తదితరులు పాల్గొన్నారు.

లక్ష్మీగణపతికి లక్ష గరికపూజ
రాయవరం, సెప్టెంబర్ 19: గణపతి నవరాత్రుల్లో భాగంగా మండలంలోని వెదురుపాక చప్టా సెంటర్ వద్ద ఉన్న లక్ష్మీగణపతికి లక్ష గరికపూజ, లక్ష్మీగణపతి హోమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉత్సవకమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇటికిరాల సుబ్రహ్మణ్యశర్మ అర్చకత్వంలో గణపతికి అష్టోత్తర సహస్రనామాలతో కుంకుమపూజ, లక్ష గరిక పూజ నిర్వహించారు. అనంతరం లక్ష్మీగణపతి మహాలక్ష్మీ కుబేర సహిత రుద్ర నవగ్రహ హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. గ్రామానికి చెందిన సుమారు 200 మంది దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కొవ్వూరి బులివీర్రెడ్డి, కొవ్వూరి లక్ష్మీనారాయణరెడ్డి, కొవ్వూరి జానకిరామారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా మార్స్‌టెక్ ఫెస్ట్
రామచంద్రపురం, సెప్టెంబర్ 19: స్థానిక విఎస్‌ఎం ఇంజనీరింగ్ కళాశాలలో గత మూడు రోజులుగా ఇంజనీరింగ్ మెకానికల్ విభాగం విద్యార్థుల ఆధ్వర్యంలో మార్స్ టెక్ ఫెస్ట్-2కె18 వేడుకలు ఘనంగా జరిగాయి. కళాశాల అకడమిక్ డైరెక్టర్ మెర్ల సత్యనారాయణమూర్తి, ప్రిన్సిపాల్ డాక్టర్ వెలగపూడి శ్రీనివాస్, పాలకవర్గ డైరెక్టర్ కె మధుర మీనాక్షి పాల్గొన్నారు. పేపర్ ప్రజెంటేషన్, క్విజ్, ఆటోమొబైల్ వర్క్‌షాపు, ప్రాజెక్టు ప్రదర్శన తదితర అంశాలు నిర్వహించారు. పలు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విజేతలకు అకడమిక్ డైరెక్టర్ ఎంఎస్‌ఎన్ మూర్తి బహుమతులు అందించారు. అలాగే మార్స్ వీడియో లాంచింగ్, మాగ్జయిన్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రసిద్ధ ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ హెచ్‌ఒడి పి సతీష్‌రెడ్డి హాజరయ్యారు. చివరి రోజైన బుధవారం డైరెక్టర్ మూర్తిని విద్యార్థులు ఘనంగా సన్మానించారు.

సెప్టిక్ ట్యాంకులో పడిపోయిన పాడి గేదె
గండేపల్లి, సెప్టెంబర్ 19: మండల కేంద్రం గండేపల్లి యడ్ల వీరబాబు అనే రైతుకు చెందిన పాడి గేదె బుధవారం ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంకులో పడిపోయింది. గడ్డి మేస్తున్న సమయంలో సెప్టిక్ ట్యాంకుపై అడుగు వేడంతో పైనున్న మూత విరిగిపోయి, గేదె ట్యాంకులో పడిపోయింది. అయితే స్థానికులు వెంటనే గమనించి, తాళ్ల సాయంతో సురక్షితంగా బయటకు తీశారు. దీనితో గేదెకు ప్రాణాపాయం తప్పింది. దీనితో వీరబాబు ఆనందం వ్యక్తంచేశారు.