తూర్పుగోదావరి

క్రీడాల్లో జాతీయ స్థాయిలో రాణించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 19: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఇంటర్ కాలేజియేట్ ఛాంపియన్‌షిప్, యూనివర్సిటీ టీమ్ సెలక్షన్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విశ్వవిద్యాలయంలో వీసీ ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు బెలూన్స్ ఎగురవేసి క్రీడాపోటీలు ప్రారంభించారు. తొలిరోజు బాస్కెట్ బాల్ మెన్ విభాగానికి చెందిన పోటీలు నిర్వహించారు. ఈ బాస్కెట్ బాల్ పోటీల్లో ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయం పరిధిలోని అనుబంధ కళాశాలకు చెందిన 14 జట్లు పాల్గొన్నాయి. ఈ క్రీడా పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వీసీ ముత్యాల నాయుడు మాట్లాడుతూ ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం విద్యార్థులు జాతీయ స్థాయి క్రీడల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయానికి జాతీయస్థాయి గుర్తింపు రావడానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయన్నారు. అనంతరం విశ్వవిద్యాలయ స్పోర్ట్స్ బోర్డు కో ఆర్డినేటర్ డాక్టర్ కె సుబ్బారావు, సెక్రటరీ డాక్టర్ బి రామగోపాల్ మాట్లాడుతూ వివిధ పోటీల వివరాలను తెలియజేశారు. చివరిగా వీసీ ముత్యాలనాయుడు బాస్కెట్‌బాల్‌తో గోల్ చేశారు. కార్యక్రమంలో డీన్స్ ఆచార్య ఎస్ టేకి, డాక్టర్ పి సురేష్ వర్మ, కెవి స్వామి, డాక్టర్ జి ఎలీషాబాబు, మూర్తి, డేవిడ్, ఫణీంద్ర, సత్యనారాయణ, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

మాడవీధిలో మూషిక వాహనంపై సిద్ధి వినాయకుని ఊరేగింపు
అయినవిల్లి,సెప్టెంబర్ 19: వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా అయినవిల్లి సిద్ధివినాయకస్వామివారి ఆలయంలో స్వామివారిని ఆలయ ప్రధాన అర్చకులు, భక్తులు మూషిక వాహనంపై ఊరేగించారు. ఈసందర్భంగా భక్తులు, చిన్నారుల కోలాటాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆలయ అర్చకులు సిద్ధివినాయకస్వామివారిని పూలదండలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం స్వామివారికి వివిధ రకముల అభిషేకాలు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునే భక్తులకు ఎటువంటి ఆటకం లేకుండా ఆలయ ఈవో మాచిరాజు లక్ష్మీనారాయణ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామివారి ఆలయం ప్రాంగణంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

21 నుంచి సీబీఎస్‌ఈ సౌత్‌జోన్ బాలికల ఫుట్‌బాల్ పోటీలు
రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 19: స్థానిక దివాన్‌చెరువులోని శ్రీ ప్రకాష్ విద్యానికేతన్‌లో ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు సీబీఎస్‌ఈ సౌత్ జోన్ బాలికల ఫుట్‌బాల్ పోటీలు నిర్వహించనున్నట్టు శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్ విజయ్ ప్రకాష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలికల విభాగంలో అండర్-17, అండర్-19 కేటగిరీల్లో ఈ పోటీలు జరగనున్నట్టు చెప్పారు. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గోపా రాష్ట్రాల నుంచి, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి సుమారు 500 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. 21వ తేదీన ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదలయ్యే ప్రారంభ కార్యక్రమానికి రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే, తూర్పు గోదావరి జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఆకుల సత్యనారాయణ, ద్రోణాచార్య అవార్డు గ్రహీత, మాజీ ఇండియన్ టీమ్ ఫుట్‌బాల్ ప్లేయర్ సయ్యద్ సహీద్ హకీమ్, ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కె గోపాలకృష్ణ తదితరులు అతిథులుగా హాజరవుతారన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పించామని, అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్టుగా ఫుట్‌బాల్ కోర్టులు తయారు చేశామని శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ ప్రిన్సిపాల్ ఎఎస్‌ఎన్ మూర్తి తెలిపారు.