తూర్పుగోదావరి

రాజమహేంద్రవరంలో జయహో..బీసీ మహాసభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 21: అక్టోబర్ నెలాఖరున రాజమహేంద్రవరంలో నిర్వహించనున్న రాష్టస్థ్రాయి బీసీ మహాసభకు భారీ సన్నాహాలు మొదలయ్యాయి. స్థానిక లాలాచెరువు సమీపంలో ఈ సదస్సును నిర్వహించేందుకు సభాస్థలిని ఎంపిక చేశారు. ఈ ప్రాంతాన్ని శుక్రవారం రాష్ట్ర డిప్యూటీ సీఎం, హోం మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కిమిడి కళా వెంకటరావు పరిశీలించారు. అక్టోబర్ 27న గానీ, 28న గానీ రాజమహేంద్రవరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మహాసభ నిర్వహించనున్నట్టు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకటరావు వెల్లడించారు. స్థానిక లాలాచెరువు వద్ద హోండా షోరూమ్ వద్ద ఖాళీ స్థలాన్ని, ఆర్ట్సు కాలేజి గ్రౌండ్‌ను ప్రాథమికంగా ఎంపికచేసి ఈ రెండు ప్రాంతాల్లో ఏదో ఒక చోట మహాసభ నిర్వహించేందుకు అనువుగా ఉంటుందని పరిశీలన నివేదిక ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించామని మంత్రి కిమిడి చెప్పారు. అనుమతి వచ్చిన ప్రాంతంలో సభాస్థలి ఏర్పాటు చేస్తామన్నారు. రాజమహేంద్రవరంలో నిర్వహించే సభను జయప్రదం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని డిప్యూటీ సీఎం చినరాజప్ప చెప్పారు. ఈ సందర్భంగా మంత్రుల వెంట రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడా ఛైర్మన్ గన్ని కృష్ణ, శాప్ డైరెక్టర్ యర్రా వేణుగోపాలరాయుడు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు నామన రాంబాబు, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, ట్రాన్స్‌కో ఎస్‌ఈ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రత్నగిరిపై వైభవంగా యాగశాల కలశ స్థాపన
అన్నవరం, సెప్టెంబర్ 21: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం దేవస్థానం రత్నగిరిపై స్వామివారి ప్రధాన రాజ గోపురానికి ఈశాన్యంగా నిర్మించిన యాగశాలపై కలశ స్థాపనా కార్యక్రమం శుక్రవారం అట్టహాసంగా నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన దాత వివిఎన్ డ్రగ్స్ పార్మాస్యూటికల్స్ లిమిటెడ్ అధినేత బొట్ట పర్వతయ్య, శారద దంపతులచే సుమారు కోటి రూపాయల వ్యయంతో నిర్మించారు. యాగ శాలలో ముందుగా వేద పండితులు విఘ్నేశ్వర పూజతో ప్రారంభించి, పుణ్యాహవచనం, రక్షాబంధనం పూజల అనంతరం యాగ శాలపై ఉదయం 9.20 గంటలకు దాతలచే కలశ స్థాపనా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం లక్ష్మీగణపతి హోమం, ఆయుష్ష్ హోమం, నక్షత్ర హోమాలతో పూర్ణాహుతి గావించారు. ఈ కార్యక్రమాన్ని దేవస్థాన వేద పండితులు ముష్ఠి కామశాస్ర్తీ, రామశాస్ర్తీ, ఆలయ అర్చకులు కోట శ్రీనివాస శర్మ, కంచిభట్ల సాయిశర్మ, వ్రత పురోహిత బ్రహ్మ నాగాభట్ల కామేశ్వర శర్మ, ముత్య సత్యనారాయణలు నిర్వహించారు. శ్రీ సత్యదేవునికి ప్రతి రోజు ఆయుష్షు హోమం నిర్వహించేందుకు స్వామివారి తూర్పు రాజ గోపురం దిగువన గల శ్రీకృష్ణుని పార్కులో ఈ యాగ శాలను నిర్మించారు. ఈ యాగ శాలను కోటప్పకొండ నుంచి ప్రత్యేకంగా రప్పించిన బ్లాక్ గ్రానైట్‌తో నిర్మించారు. 16 స్తంభాలపై 16 చిత్ర గణపతి ఆకృతులను అత్యంత సుందరంగా చెక్కించి నిర్మించారు. మహోపన్యాసక దేవతలు, విజయ గణపతి, మేథ, దక్షణిమూర్తి విగ్రహాలతో ఏర్పాటుచేసిన ఈ యాగ శాలను గత నెల 12న జగద్గురు శృంగేరీ శారద పీఠ ఉత్తరాధికారి విధుశేఖర తీర్థ మహాస్వామి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ యాగ శాలలో దేవస్థానానికి వచ్చే భక్తులు తమ గ్రహస్థితుల అనుకూలత కోసం, ఆయుష్షు హోమాలు జరిపించుకోవచ్చు. కలశ స్థాపనా మహోత్సవంలో దేవస్థాన ఈవో మారిశెట్టి జితేంద్ర, అసిస్టెంట్ కమిషనర్ ఈరంకి జగన్నాధరావు, దేవస్థానం పాలక మండలి సభ్యులు కొత్త కొండబాబు, సింగిలిదేవి సత్తిరాజుతోపాటు దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.