తూర్పుగోదావరి

గురజాడ జీవితం ఆదర్శనీయం వీసీ ముత్యాలనాయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 21: సమాజంలో జరుగుతున్న అన్యాయాలను తన సాహిత్య పటిమతో ప్రశ్నించిన గురజాడ అప్పారావు జీవితం నేటి తరానికి ఆదర్శం కావాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు అన్నారు. శుక్రవారం యూనివర్సిటీలోని గురజాడ అప్పారావు జయంతి వేడుకలను నిర్వహించారు. గురజాడ చిత్రపటానికి వీసీ పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ గురజాడ సాహిత్యం గొప్ప విజన్‌తో కూడిన సాహిత్యం అన్నారు. ఆనాటి సమాజంలో ఉన్న దురాచాలకు గుణపాఠంగా గురజాడ సాహిత్యం ఉందన్నారు. నేడు ఎవరైనా దేశభక్తిని ప్రస్తావిస్తే ముందు గురజాడ రాసిన దేశభక్తి గేయాన్ని స్మరిస్తారని, అంత బాగా ప్రజల్లో గురజాడ దేశభక్తి గేయం స్థిరపడిందన్నారు. గురజాడ సాహిత్యం నేటికీ అనేక మంది కవులకు మార్గదర్శకం అవుతుందన్నారు. గోదావరి జిల్లాల్లో ఉన్న తెలుగు సాహిత్య విద్యార్థులంతా గురజాడ సాహిత్య పరిమళాలను ఆకళింపు చేసుకుని గొప్ప సాహిత్యవంతులుగా తయారు కావాలని సూచించారు. అనంతరం విద్యాశాఖ అధ్యాపకులు డాక్టర్ ఎం గోపాలకృష్ణ మాట్లాడుతూ సాహిత్యంపై మక్కువ ఉన్నవారు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని, దానికి చక్కని ఉదాహరణ వీసీ ముత్యాలనాయుడు అని అన్నారు. విద్యార్థులంతా దేశభక్తుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారిని స్మరిస్తూ ఉండాలని, ఎంత ఉన్నతికి చేరినా మహనీయుల త్యాగాలను మరువకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో కె బాల సత్యనారాయణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.