తూర్పుగోదావరి

కుండపోత శబరినదికి భారీగా నీరు: పొంగిన సోకిలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, సెప్టెంబర్ 21: ఎగువ ప్రాంతంలో కురుస్తున్న కుండపోత వర్షానికి శబరి నదిలో భారీగా నీరు చేరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. శబరి నదికి అనుసంధానమైన సోకిలేరు వాగు ఉద్ధృతమై శుక్రవారం రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో చింతూరు, వీఆర్‌పురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ ప్రాంతమైన ఒరిస్సాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో దిగువున గల సీలేరు, డొంకరాయి డ్యామ్‌లలో భారీగా నీరు చేరింది. దీంతో జెన్‌కో అధికారులు డ్యామ్ గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నీరంతా శబరి నదిలో చేరి పరవళ్లుతొక్కుతూ ప్రవహిస్తోంది. శబరి నది ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడంతో లోతట్టు ప్రాంత ప్రజల్లో ఒకింత వరదభయం అలముకుంది.
న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు వివాహిత దీక్ష
చింతూరు, సెప్టెంబర్ 21: ఓ వివాహిత తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు శుక్రవారం దీక్షకు దిగింది. భర్త తనను మోసం చేసి, మరో మహిళను పెళ్లి చేసుకుని తనకు అన్యాయం చేశాడని ఆరోపించింది. తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని రోదించింది. వివరాలు ఇలావున్నాయి. చింతూరులోని ఎస్టీ కాలనీకి చెందిన కరక సర్వేష్ తులసిపాక గ్రామానికి చెందిన పల్లెల శాంతిని రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి బిడ్డ జన్మించింది. కొద్దిరోజుల క్రితం సర్వేష్ భార్య శాంతికి తెలియకుండా మరో మహిళను పెళ్లి చేసుకుని ఊరు వదిలేసి వెళ్లిపోయాడు. ప్రస్తుతం తాను, తన బిడ్డ అనాథలుగా మిగిలామని, తమను ఆదుకోవాలని, భర్త ఇంటి ముందు దీక్షకు దిగింది. ఉదయం నుండి సాయంత్రం వరకు భర్త ఇంటి ముందే దీక్ష చేసింది. పోలీస్ అధికారులు అందుబాటులో లేకపోవడంతో శనివారం మహిళా సంఘాలతో కలిసి మరలా భర్త ఇంటి ముందు న్యాయం కోసం దీక్ష చేపట్టనున్నట్టు ఆమె మీడియాకు తెలిపింది.