క్రైమ్/లీగల్

వేటాగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలకు యువకుడు బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోకవరం, సెప్టెంబర్ 23:సూదికొండ రిజర్వు పారెస్టులో వన్య ప్రాణులను వేటాడేందుకు వేటాగాళ్లు అమర్చిన బైండింగ్ వైరుకు విద్యుత్ అమర్చిన తీగలకు యువకుడు బలి అయిన సంఘటన ఆదివారం గోకవరం మండలంలో పలు అనుమానాలకు తావిస్తోంది. దీనికి సంబంధించి గోకవరం ఎస్సై టి తిరుమలరావు కధనం ప్రకారం మండలంలోని కామరాజుపేట పంచాయతీ పరిదిలోని జగన్నాధపురం గ్రామానికి చెందిన బొందల వీరవెంకట సత్యనారాయణ (22) అదే పంచాయతీ పరిధిలోని మల్లవరం గ్రామానికి చెందిన మండపేట అప్పారావుకు చెందిన పంట భూమి శివరామపట్నంలో ఉందని ఆ భూమిని సత్యనారాయణ కౌలుకు తీసుకున్నాడన్నారు. దీనితో ఈనెల 22వ తేదిన బొందల సత్యనారాయణ అతని స్మేహితుడైన జెట్టి ఎరుకరాజుతోకలిసి పోలం వెళ్లి రాత్రి సమయంలో ఇంటికి వస్తుండగా సూదికొండ రిజర్వుపారెస్టులో వన్యప్రాణుల కోసం అమర్చిన విద్యుత్ బైండింగ్ వైర్లు తగిలి బొందల వీర వెంకట సత్యనారాయణ అక్కడికి అక్కడే మృతిచెందడన్నారు. ఈ విషయం ఎరకరాజు మృతుడు బంధువులకు చెప్పడంతో మృతుడు సోదరుడు బొందల నాగేశ్వరరావు ఆదివారం గోకవరం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. దీనితో సంఘటన స్థలానికి చేరుకుని శవపంచనమా నిర్వహించి మృతుడిని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తిరుమాలరావు తెలిపారు. మృతుడు బొందల వీర వెంకట సత్యనారాయణకు గతంలోనే తండ్రి చనిపోవడంతో తల్లి, అక్క, తమ్ముడు ఉన్నారన్నారు. కుటుంబం జీవనాధరం కేవలం మృతి చెందిన వీర వెంకట సత్యనారాయణ మీదనే ఆధారపడి ఉందన్నారు.

గణేష్ నిమజ్జనోత్సవంలో అపశృతి: యువకుడు మృతి
ప్రత్తిపాడు, సెప్టెంబర్ 23: మండలంలోని ఇ గోకవరం గ్రామంలో ఆదివారం జరిగిన గణేష్ నిమజ్జనోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. ఉత్సవంలో గిరిజన యువకుడు మృతిచెందాడు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..విశాఖ జిల్లా కొయ్యూరు మండలం సింగరాడపాడు గ్రామానికి చెందిన ఉల్లి అప్పారావు (23) ఇ గోకవరం గ్రామంలోని సుబ్బారెడ్డిసాగర్ కాలువలో ప్రమాదవశాత్తు కాలుజారి గల్లంతయ్యాడు. వంతాడ గ్రామంలో వినాయక చవితి సందర్భంగా గత తొమ్మిది రోజుల నుంచి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు విశాఖ జిల్లా సింగరాడపాడు నుంచి వంతాడలోని అత్తింటికి వచ్చాడు. ఆదివారం వంతాడ నుంచి ఇ గోకవరం గ్రామానికి గణేశ్ ఉత్సవ విగ్రహాన్ని తీసుకువచ్చి సుబ్బారెడ్డిసాగర్‌లో ఆదివారం మధ్యాహ్నం 2గంటల సమయంలో నిమజ్జనం చేస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గల్లంతైనప్పట్నుంచీ అప్పారావు కోసం గ్రామస్థులు గాలింపుచర్యలు చేపట్టగా రాత్రి 8గంటలకు సాగర్‌లో మృతదేహాన్ని కనుగొన్నారు. ప్రత్తిపాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదుజేసి దర్యాప్తు చేస్తున్నారు.