తూర్పుగోదావరి

యువత నిస్వార్ధ సేవకు ప్రతీక కావాలి నన్నయ రిజిస్ట్రార్ డాక్టర్ అశోక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 24: యువత నిస్వార్ధంగా సేవలు చేసే అలవాటు అలవర్చుకోవాలని, స్వచ్ఛంధ సేవా ధృక్పదంతో పని చేయాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ టి అశోక్ అన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ ఆవిర్భవించి యాభై ఏళ్ళయిన సందర్భంగా సోమవారం యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిష్ట్రార్ మాట్లాడుతూ ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్ల ఆదర్శవంతమైన సేవలు అందించాలన్నారు. ఆత్మసంతృప్తిగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో కో ఆర్డినేటర్ డాక్టర్ ఎన్ కిరణ్ చంద్ర, ప్రొగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ జి రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ ఆర్ ఎస్ వరహాలదొర, డాక్టర్ ఎం గోపాలకృష్ణ, ఆర్ సాంభశివరావు, డాక్టర్ ఎలీషాబాబు, వి రామకృష్ణ, డాక్టర్ ఎన్ సుజాత, రాజేశ్వరిదేవి పాల్గొన్నారు.
సెల్‌ఫోన్ పేలి విద్యార్థికి గాయాలు
అమలాపురం, సెప్టెంబర్ 24: తమ స్నేహితుడి దగ్గర సెల్‌పోన్ తీసుకుని ప్యాంటు జేబులో పెట్టుకోగా అది పేలడంతోతన ఎడమ కాలుకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే అమలాపురం రూరల్ సమనస గ్రామంలో గల గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్ధి ముంగండ అజయ్ రత్నం తన స్నేహితుడైన బూల అజయ్ కుమార్ సెల్‌ఫోను తీసుకున్నాడు. అజయ్ కుమార్ సెల్‌ఫోనును తన ప్యాంటు జేబులో పెట్టుకోగా కొద్ది సేపటికి ప్యాంటు జేబులో పెలిపోయింది. దీంతోగురుకుల పాఠశాల సిబ్బంది గాయాలైన అజయ్‌ను అమలాపురం ఏరియాసుపత్రికి తీసుకెళ్ళగా డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. విద్యార్థి తల్లిదండ్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ కుమారుడి చూసి బోరున విలిపించారు. అయితే విద్యార్థికి స్వల్పగాయాలే తప్ప ప్రమాద పరిస్థితి ఏమిలేదని తల్లిదండ్రులకు డాక్టర్లు చెప్పారు. దీనిపై పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం ప్రతినిధి బృందం సోమవారం సమనస గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీడీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరపతిరావు మాట్లాడుతూ సమనస గురుకుల పాఠశాలలో 390మంది విద్యార్థులు ఉన్నారని వీరికి పాఠశాలలో పర్యవేక్షణ కొరవడిందన్నారు. అయితే రాత్రి సమయంలో అక్కడ విద్యార్థులు బయట తిరుగుతున్న వాచ్‌మెన్‌లు ఎవరూ పట్టించుకోవడంలేదన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ పాఠశాలలో పర్యవేక్షణ కొరవడంతో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని పీడీఎస్‌యూ నాయకులు ఆరోపిస్తున్నారు. సెల్‌ఫోన్ పేలిన ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.