తూర్పుగోదావరి

గోకవరం హైస్కూల్‌లో కుళ్లిన కోడిగుడ్లు సరఫరా గుడ్లను ఉడకబెట్టి పడేసిన నిర్వాహకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోకవరం, సెప్టెంబర్ 24: పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసే గుడ్లు నాసిరకంగా ఉండటం, అవి తిన్న విద్యార్థులు అనారోగ్యానికి గురికావటం..ఇటీవల దిన పత్రికలలో తరచూ చదువుతూనే ఉన్నాం. పత్రికలో వార్త వచ్చిందంటే అధికారులు హడావిడి..విచారణకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఆదేశాలు..కొన్ని రోజుల తర్వాత ఆ విషయం మరిచిపోవటం..మళ్లీ ఎక్కడో గుప్పుమంటే అధికారుల హడావిడి, పరుగులు మామూలే.
ఈ మారు గోకవరం మండలంలో ఈ కథ పునరావృతమైంది. వివరాల్లోకి వెళ్లితో..ఈ నెల 18న గోకవరం ఉన్నత పాఠశాలకు 2,500 గుడ్లను అందజేశారు. వాటిని విద్యార్థులకు వారానికి అయిదు రోజులపాటు పౌష్ఠికాహారంగా అందించాల్సి ఉంది. అయితే 19న వండిన సుమారు 100 గుడ్లకు పైగా కుళ్లిపోయాయి. ఆ తర్వాత పాఠశాలకు సెలవు దినం కావడంతో సోమవారం విద్యార్థుల కోసం సుమారు 500 గుడ్లను నిర్వాహకులు ఉడకబెట్టారు. అవి కుళ్లిపోవటంతో కంపుకొట్టాయి. దీంతో వాటినీ పారవేశారు. ఆ కంపును భరించలేక విద్యార్థులు ముక్కు మూసుకుని పారిపోయేంత పరిస్థితి తలెత్తింది. ఈ విషయమై నిర్వాహకులు స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ గతంలో కూడా ఇదే మాదిరిగా కుళ్లిన గుడ్లు వచ్చాయని, వాటిని బయట పారవేసినట్టు చెప్పారు. ఇటువంటి గుడ్లనే ఇప్పటికే మండలంలోని పలు పాఠశాలలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేసినట్లు తెలిసింది. ఈ విషయమై అధికారులు చాలా సీరియస్‌గా విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో విద్యార్థులు అనారోగ్యానికి గురై భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉంది. ఈ విషయమై గుడ్లను సరఫరా చేసే నిర్వాహకులను ప్రశ్నిస్తే గుడ్లు కుళ్లితే వాటిని పరిశీలించి, బదులుగా కొత్త గుడ్లను సరఫరా చేస్తామని చెపుతున్నారు.