తూర్పుగోదావరి

నన్నయలో కోకో పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 24: ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో బాలికల కోకో పోటీలను స్పోర్ట్స్ బోర్డు ఛైర్మన్, వీసీ ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు సోమవారం ప్రారంభించారు. అంతర్ కళాశాలల పోటీలు, విశ్వవిద్యాలయం జట్టు ఎంపికలో భాగంగా అమ్మాయిల కోకో పోటీలు నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని నన్నయ అనుబంధ కళాశాలల నుంచి విద్యార్థినులు ఈ కోకో పోటీల్లో పాల్గొన్నారు. అక్టోబర్ 4వ తేదీ నుంచి ఆరవ తేదీ వరకు క్రికెట్ సెలక్షన్లు, 8న యోగా పోటీలు రాజమహేంద్రవరం క్యాంపస్‌లో జరగనున్నాయని తెలిపారు. చెస్ పోటీలు తాడేపల్లిగూడెం క్యాంపస్‌లో జరుగుతాయన్నారు. కోకో పోటీలు ముగిసిన అనంతరం స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ డాక్టర్ కె సుబ్బారావు, సెక్రటరీ డాక్టర్ బి రామగోపాల్ ఫలితాలను విడుదల చేశారు. కోకో అమ్మాయిల విభాగంలో మొదటి స్థానం కాకినాడ పిఆర్ కాలేజి, రెండవ స్థానం తణుకు ఎస్‌కెఎస్‌డి కాలేజి, మూడవ స్థానం ఏలూరు సెయింట్ థెరిస్సా కాలేజీ, నాలుగోస్థానం ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజి విద్యార్థులు విజేతలుగా నిలిచారు. కార్యక్రమాన్ని కె నాగభూషణం నిర్వహించారు.
కలెక్టరేట్ ఎదుట పలు సంఘాల ధర్నా
కాకినాడ, సెప్టెంబర్ 24: జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా పలు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాకినాడ దుమ్ములపేట కొత్తపాకల ప్రాంతంలో గత 35 ఏళ్ళుగా మత్య్సకార కుటుంబాలు పాకలు వేసుకుని జీవనం సాగిస్తున్నాయని దీంతో పట్టాలు లేవనే కారణంతో నగరపాలక సంస్ధ అధికారులు నోటీసులు జారీ చేయకుండా తొలగించటాన్ని నిరశిస్తూ బాధితులు ధర్నా నిర్వహించారు. ఈ నెల 22న తుపాను హెచ్చరికలు ఉన్నా 60 అడుగుల రోడ్డు వస్తుందనే కారణంతో నగరపాలక అధికారులు పాకలను తొలగించి వర్షంలో కుటుంబాలు ఉండేలా చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధర్నాకు జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. తమకు చెందిన కాకినాడ సెజ్ భూముల్లో ఈ నెల 30వ తేదీన వరినాట్లును వేస్తామని దీన్ని అడ్డుకుంటే అరెస్ట్‌లకు సిద్ధమంటూ రైతులు సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కాకినాడ సెజ్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రైతు నోట్లో మట్టి కొడుతున్నారంటూ వారు పేర్కొన్నారు. సుమారు ఆరేళ్ళ క్రితం సిఎం చంద్రబాబు పొలం దున్ని ఏరువాక సాగించి తాము అధికారంలోకి వస్తే ఈ భూములను తిరిగి రైతులకిస్తామంటూ ప్రకటించారని వారు చెప్పారు. భూములు ఇవ్వని వారిని అనేక రకాలుగా ఇబ్బందులు పాల్జేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులను నిరశిస్తూ సోమవారం ఆంధ్ర మాలమహానాడు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దళితులను హింసించి చంపుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వౌనం వహిస్తున్నాయంటూ రాష్ట్ర అధ్యక్షుడు సిద్దాంతుల కొండబాబు అన్నారు. సామర్లకోట రోడ్డులో ఉంటున్న లోవలక్ష్మికి పట్టా ఇచ్చారని దాన్ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే భర్త పిల్లి సత్తిబాబు రద్దు చేయించి వేరే ప్రభుత్వ ఉద్యోగి ఇస్తున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాలమహానాడు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించారు.