తూర్పుగోదావరి

ఖరీఫ్ నాటికి కౌలు రైతులకు పూర్తిస్థాయిలో రుణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 25: జిల్లాలో 4.5 లక్షల మంది కౌలు రైతులకు వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తిస్థాయిలో పంట రుణాలందించాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. కినాడ కలెక్టరేట్‌లో మంగళవారం వ్యవసాయ, అనుబంధ శాఖల ప్రగతిపై కలెక్టర్ సమీక్షా నిర్వహించారు. జిల్లాలో అర్హత కలిగిన నాలుగున్నర లక్షల మంది కౌలు రైతులున్నారని, వీరిలో రెండున్నర లక్షల మంది కౌలురైతులకు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ వరకూ 800 కోట్ల మేర ఎల్‌ఈసీ, సీవోసీ ధ్రువీకరణ పత్రాల ఆధారంగా పంట రుణాలు మంజూరు చేశామన్నారు. కౌలురైతులకు ఇంత భారీ స్థాయిలో పంట రుణాలు మంజూరు చేయడం ఇదే ప్రథమమన్నారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా జిల్లాలో 1002 ట్రాక్టర్లను పంపిణీ చేసేందుకు లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటివరకు 534 ట్రాక్టర్లు పంపిణీ చేశామన్నారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు పంట రుణాల పంపిణీ 98 శాతం పూర్తయ్యిందని కలెక్టర్ చెప్పారు. ఈ సంవత్సరం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. 44వేల 900 మంది రైతులను ప్రకృతి వ్యవసాయంలో ప్రోత్సహించాలన్నది లక్ష్యం కాగా 29వేల 480 మంది రైతులను ఇప్పటివరకూ ప్రోత్సహించినట్టు తెలియజేశారు. ఇటీవల వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని త్వరితగతిన అందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. డీ వార్మింగ్, వేక్సినేషన్, ప్రకృతి గర్భోత్పత్తిలో డిసెంబర్ నాటికి లక్ష్యాలను పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లాలో 36 గోకులాల ఏర్పాటుకు స్థలాలు గుర్తించామని, 22 నిర్మాణాలకు పరిపాలన అనుమతులు వచ్చినట్టు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కాంపోనెంట్‌లో మంజూరైన పనులను వచ్చే అక్టోబర్‌కు పూర్తిచేయాలని ఆదేశించారు. ఇంకా ఉద్యానవన పంటల ప్రగతిపై కలెక్టర్ సమీక్షించారు. సమావేశంలో జేసీ-2 సీహెచ్ సత్తిబాబు, వ్యవసాయ శాఖ జేడీ కేఎస్వీ ప్రసాద్, ఏపీఎంఐపీ పీడీ రామ్మోహన్, మత్స్యశాఖ జేడీ జయరావు, పశు సంవర్ధక శాఖ జేడీ శ్రీనివాసరావు, మార్కెటింగ్ శాఖ ఏడీ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.