తూర్పుగోదావరి

తప్పుడు కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, సెప్టెంబర్ 25: ఎస్సీ, ఎస్టీ కేసులకు సంబంధించి తప్పుడు కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటే ఇక ముందు అటువంటి పరిస్థితులు పునరావృతం కావని కాకినాడకు చెందిన ఎస్సీ, ఎస్టీ కమిటీ సభ్యులు కల్యాణం కోటేశ్వరరావు పేర్కొన్నారు. రామచంద్రపురం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో రామచంద్రపురం డివిజన్ స్థాయి విజిలెన్స్ మోనటరింగ్ కమిటీ సమావేశం మంగళవారం ఆర్డీవో ఎన్ రాజశేఖర్, డీఎస్పీ జయంతి వాసవీ సంతోష్‌ల నేతృత్వంలో జరిగింది. డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, సభ్యులు చిలుకూరి సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు చిలుకూరి వీరవెంకట సత్యనారాయణ, రామచంద్రపురం సీఐ కొమ్ముల శ్రీ్ధర్‌కుమార్, ఎస్సైలు ఎన్ సతీష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు పలు అంశాలను సమావేశం దృష్టికి తెచ్చారు. ఎస్సీ, ఎస్టీ కేసు బనాయించగానే బాధితులకు 25వేల రూపాయలు చొప్పున సొమ్ము ముందుగానే అందిస్తున్నారని, తప్పు అని నిర్ణయించి పోలీసు అధికారులు ఫాల్స్‌గా ఆ కేసులను తీసివేయడం ద్వారా ఎస్సీలకు సక్రమమైన న్యాయం జరగడంలేదన్నారు. అరెస్టుల విషయంలో కూడా నిష్పక్షపాతంగా జరగడం లేదన్నారు. అదే అంశంలో ఎస్సీ, ఎస్టీ కేసుల్లో తప్పుడు ఫిర్యాదులు చేయడానికి అలవాటుపడిన ప్రాణులు కేసు పెట్టడం, రాజీ మార్గాన్ని సూచించడం, ఆర్థిక దోపిడీ చేయడం జరుగుతుందన్న విషయాన్ని సమావేశం దృష్టికి తెచ్చారు. తప్పుచేసినవారి కళ్లల్లో బెదురు కనిపిస్తుందని, పోలీసులు ఆ కేసుకు సంబంధించి తప్పు, ఒప్పు గుర్తెరగగలరని అంటూ తప్పుడు కేసులు పెట్టినవారిపై చర్యలు తీసుకుంటే ఇక ముందు అటువంటి పరిస్థితులు పునరావృతంకావని కోటేశ్వరరావు పేర్కొన్నారు. సమావేశంలో 2015 నుంచి 2018 వరకు నమోదైన కేసులు, వాటి పర్యవసానాలు, బాధితులకు అందిన నష్టపరిహారాలు తదితర అంశాలను ఆర్డీవో రాజశేఖర్, డీఎస్పీ సంతోష్ సభ్యులకు వివరించారు.
బాణాసంచాదారులతో సమావేశం:
రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో దీపావళి మందుగుండు సామాను (బాణాసంచా) అమ్మకానికి సంబంధించి 152 మంది తాత్కాలిక లైసెన్సుదారులు వ్యాపారం చేస్తున్నారని, వారు అధికారులు నిర్దేశించిన ప్రదేశంలోనే బహిరంగ స్థలాల్లోనే అమ్మకాలు సాగించాలని ఆర్డీవో రాజశేఖర్, డీఎస్పీ సంతోష్ స్పష్టంచేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో రాజశేఖర్ మాట్లాడుతూ చిన్న పొరపాటు ద్వారా అగ్ని రాజుకుంటే ప్రాణ, ఆస్తినష్టాలు జరుగుతున్నాయని, అనధికారికంగా మందుగుండు సామాగ్రి అమ్మకాలు, తయారీ జరగడం నేరమన్నారు. చిల్లర అమ్మకాలను ప్రోత్సహించవద్దని, జనావాసాల మధ్య ప్రత్యేకించి అగ్నికి దోహదపడే వస్తువులతో తయారుచేసిన పాకలు తదితరాలు ఉండరాదని ఆయన స్పష్టంచేశారు. విద్యుత్ కనెక్షన్ ఉండకూడదని, సరుకు దిగుమతి, వాటిని వినియోగించిన విధానాలు లెక్కను సక్రమంగా మెయింటెయిన్ చేయాలన్నారు. రాయవరం, ద్రాక్షారామలో తయారీ కేంద్రాలను తాము చూశామని, మండపేటలో అయితే జనావాసాల మధ్య ఉన్నాయని, వాటిని తొలగించాలని సూచించినట్టు తెలిపారు. గంగవరంలో తయారీకి, అమ్మకాలకు అనుమతి లేదన్నారు. డీఎస్పీ వాసవీ సంతోష్ మాట్లాడుతూ పనిచేతకాని కార్మికులతో ఈ బాణాసంచా తయారు చేయించవద్దని, అత్యవసర పరిస్థితుల్లో ఎలా తప్పించుకోవాలన్న విషయం వారికి అవగాహన లేదన్నారు. అనధికారికంగా అమ్మకం సాగించే వారెవరో హోల్‌సేల్ డీలర్లుగా అందరికీ తెలుసునని అంటూ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా అందరికీ నష్టమేనన్నారు. ఇళ్లల్లో సేఫ్టీ మెజర్‌మెంట్లు ఉండవని, ఎక్స్‌పోజర్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదుచేయడం జరుగుతుందని హెచ్చరించారు. చేసిన సూచనలను పాటించాలని ఆయన స్పష్టంచేశారు. రామచంద్రపురం సీఐ కె శ్రీ్ధర్‌కుమార్, ఫైర్ ఆఫీసర్ నారిశెట్టి నాగేంద్రప్రసాద్ తదితరులు ప్రసంగించారు.
భూములు పరిశీలించిన జేసీ
రామచంద్రపురం, సెప్టెంబర్ 25: రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లులేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున మాలపాడు గ్రామంలో భూసేకరణకు ప్రతిపాదనలు వచ్చిన భూమిని మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా భూమి యొక్క స్థల స్వరూపాన్ని, గ్రామానికి చేరువగా ఉందా లేదా అన్న విషయాలను పరిశీలించారు. అనంతరం ద్రాక్షారామలోని నిత్యావసర వస్తువుల పంపిణీకి వినియోగించే గోదామును తనిఖీ చేశారు. తూకపు యంత్రాలు, స్టాకు రిజిష్టర్ తదితరాలను జేసీ మల్లికార్జున కూలంకషంగా తనిఖీ చేశారు. ఈకార్యక్రమాల్లో ఆర్డీవో ఎన్ రాజశేఖర్, రామచంద్రపురం తహసీల్దార్ పైడి చిన్నారావు, వీఆర్వోలు, ఆర్‌ఐ నాయుడు తదితరులు పాల్గొన్నారు.