తూర్పుగోదావరి

యువత సంక్షేమానికి పెథ్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, సెప్టెంబర్ 25: దేశాభివృద్ధికి కీలకమైన యువత సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. సెట్రాజ్-జిల్లా క్రీడాప్రాధికార సంస్థల ఆధ్వర్యంలో అయిదు రోజులపాటు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి యువజన సమైక్యతా శిబిరాన్ని మంగళవారం సామర్లకోట టీటీడీసీలోని జిల్లా సమాఖ్య సమావేశ మందిరంలో ప్రారంభించారు. తొలుత కలెక్టర్ కార్తికేయ మిశ్రా జ్యోతిప్రజల్వన చేయగా, తదుపరి హాజరైన ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమానికి సెట్రాజ్ సీఈవో ఎస్ మల్లిబాబు అధ్యక్షత వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుండి హాజరైన యువతీ యువకులనుద్దేశించి మంత్రి రాజప్ప మాట్లాడారు. సమాజంలో యువత మద్యం, పేకాట, గంజాయి వంటి వ్యసనాలకు బానిసలై భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారని, టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ కేసుల్లో ఇరుక్కుంటున్నారన్నారు. ముఖ్యంగా 25 ఏళ్లలోపు వయసుగల యువత వ్యసనాలకు త్వరగా లోనవుతున్నారన్నారు. ఈ పరిస్థితి నుంచి యువత బయటకు రావడానికి క్రమశిక్షణను అలవర్చుకోవాలన్నారు. యువతకు అండగా ఉండేందుకు ప్రభుత్వం ఈ శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. సీఎం చంద్రబాబు యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశ్యంతో సుమారు 20 వేలకు పైగా ప్రభుత్వ పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. గతంలో పోలీసు శాఖలో ఆరువేల పోస్టులు భర్తీ చేశామని, త్వరలో మరో మూడువేల పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి రాజప్ప చెప్పారు. కలెక్టర్ కార్తికేయ మిశ్రా, సెట్రాజ్ సీఈవో ఎస్ మల్లిబాబు, ప్రముఖ మానసిక వైద్య నిపుణలు, అంతర్జాతీయ ఆవార్డుల గ్రహీత, రాజమంఢ్రి మానస ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ కఱ్రి రామారెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి, సీనియర్ కౌన్సిలర్ మన్యం చంధ్రరావు, ప్రభుత్వ క్లస్టరు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, జిల్లా సమాచార శాఖ ఉప సంచాలకులు ఎం ఫ్రాన్సిస్, సెట్రాజ్ అధికారులు పాల్గొన్నారు. అనంతరంమంత్రి చినరాజప్ప, కలెక్టర్ కార్తికేయ మిశ్రాలను సెట్రాజ్ సీఈవో మల్లిబాబు ఘనంగా సత్కరించారు. మొదటి రోజు శిక్షణలో భాగంగా మానసిక వత్తిడిని జయించడం ఎలా అనే అంశాలపై డాక్టర్ కర్రి రామారెడ్డి అవగాహన కల్పించారు.

పురోహిత దర్శనం గంగాస్నాంతో సమానం
అమలాపురం, సెప్టెంబర్ 25: గంగలో స్నానం చేస్తే ఎంతపుణ్యం వస్తుందో పురోహితుని చూస్తే అంత పుణ్యం కలుగుతుందని వేదాలు, ధర్మశాస్త్రాలు చెపుతున్నాయని మహామహోపాధ్యాయ దోర్భల ప్రభాకరశర్మ అన్నారు. స్థానిక సత్యసాయి కళ్యాణ మండపంలో డాక్టర్ చిర్రావూరి శ్రీరామశర్మ అధ్యక్షతన మంగళవారం జరిగిన ఆపస్తంభ పురోహిత పరిషత్ 18వ వార్షికోత్సవ సభలో ప్రభాకరశర్మ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భగవంతుడు అందికీ బుద్ధి బలాన్ని ఇచ్చాడని, సంస్కృత భాష దేవభాషని, మనకు చెప్పబడే 16 కర్మలకు సంబంధించిన మంత్రాలన్నీ సంస్కృతంలోనే చెప్పబడతాయన్నారు. ఆపకర్మలను నిష్ఠతో చేయించాలని సూచించారు. కర్మలు చేయించుకునే టప్పుడు యజమాను పురోహితులు కూడా భక్తి శ్రద్ధలతో ఉండాలని ప్రభాకరశర్మ ఉద్భోదించారు. ప్రస్తుత కాలంలో పురోహితులు చేయించే కర్మలకంటే చాయాగ్రహకులకు (్ఫటోలకు) ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. సంస్కృత భాషను, వేదాలను, స్మృతుల నుండి పుట్టిన స్మార్తాన్ని చక్కగా అధ్యయనం చేసి ప్రజాహితానికి పాడుపడాలని ప్రభాకరశర్మ పురోహితులకు హితవు పలికారు. సభకు అధ్యక్షత వహించిన శ్రీరామశర్మ దానాల వల్ల వచ్చే ఫలితాన్ని, దాని వల్ల యజమానికి కలిగే ఫలితాలను చక్కగా వివరించారు. పురోహితులు సుస్వరంతో చక్కగా ప్రజాహితాన్ని కోరుతూ కర్మలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో గూడపర్తి వెంకట సూర్యకుమార శర్మ, కంభంపాటి సాయికిరణ్ శర్మ, తాతపూడి సూర్యనారాయణమూర్తి, గరిమెళ్ళ విశ్వనాధం, రాళ్ళపల్లి సూర్య సుబ్రహ్మణ్యశర్మ తదితరులు ప్రసంగించారు. ఈసందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పురోహితులను పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కర్రా వెంకట సుబ్రహ్మణ్య శర్మ, తోపెళ్ళ కార్తికేయశర్మ, మరువాడ వెంకన్న, కర్రా వినాయకశర్మ తదితరులు పాల్గొన్నారు.