తూర్పుగోదావరి

ఘనంగా గాడ్ వివాహ దినోత్సవ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయవరం, ఏప్రిల్ 30: మండలంలోని వెదురుపాక విజయ దుర్గాపీఠంలో పీఠాధిపతి గాడ్ 55వ వివాహ వేడుకను భక్తులు శనివారం ఘనంగా నిర్వహించారు. తొలుత విజయ దుర్గా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్), సీతామహాలక్ష్మి దంపతులకు వివాహ వేడుకను పురస్కరించుకుని కుటుంబ సభ్యులు, భక్తులు పాదపూజ నిర్వహించి హారతులు పట్టారు. ఈ సందర్భంగా గాడ్ భక్తులకు ఆశీస్సులు అందజేశారు. కార్యక్రమంలో పీఠం అడ్మినిస్ట్రేటర్ వివి బాపిరాజు, పిఆర్వో బాబి, జి సత్యవెంకట కామేశ్వరి, భాస్కర నారాయణ, పి సత్యకనకదుర్గ, మూర్తి దంపతులు, పీఠం భక్తులు పాల్గొన్నారు. అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించారు.