క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో భర్త మృతి, భార్యకు గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజోలు, అక్టోబర్ 3: ఇంటి నుండి బయలుదేరి అత్తవారింటికి మోటారు సైకిల్‌పై భార్యాభర్తలు కలిసి వెళుతుండగా శివకోడులో బొలెరో వాహనం ఎదురుగా వచ్చి ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం గుమ్ములూరుకు చెందిన షేక్ మీరాసాహెబ్ (38), భార్యతో కలిసి అత్తవారింటికి అల్లవరం వెళుతుండగా రాజోలు మండలం శివకోడు శ్మశానవాటిక వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తూ భీమవరం వైపు వెళుతున్న బొలెరో వాహనం ఢీకొంది. ఈ ఘటనలో మీరాసాహెబ్ అక్కడికక్కడే మృతిచెందగా భార్య షేక్ సుభాని స్వల్ప గాయాలతో బయట పడింది. ఆమెను స్థానికులు రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తన కళ్ళ ముందే భర్త మృత్యువాత పడటంతో ఆమె విలపిస్తున్న తీరు చూపరులను కంట తడి పెట్టించింది. మృతునికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ప్రమాదంలో వ్యక్తి మరణించినప్పటికీ ఢీకొట్టిన వాహనం ఆగకుండా వెళిపోయిందని స్థానికులు తెలిపారు. సంఘటనా స్థలానికి రాజోలు ఎస్సై ఎం నాగరాజు చేరుకుని విచారణ నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం రాజోలు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

కన్నుమూసిన అర్చకుడు
* అర్చకుల ధర్నా
రాజమహేంద్రవరం, అక్టోబర్ 3: ధర్మకర్తల వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన అర్చకుడు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్నుమూశాడు. కోరుకొండ మండలం కణుపూరులోని శివాలయంలో అర్చకుడుగా పనిచేస్తున్న కె మల్లిఖార్జునశర్మ మంగళవారం కలుపుమొక్కల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. చికిత్స నిమిత్తం ఆయనను ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కుటుంబానికి 30 ఏళ్లుగా వంశపారంపర్యంగా వస్తున్న అర్చకత్వానే్న శర్మ చేపట్టారు. అయితే ఇటీవల ఆలయ ఆదాయం పెరగడంతో ఆయనను తప్పించి మరో అర్చకుడ్ని విధుల్లోకి తీసుకునేందుకు ధర్మకర్తలు ప్రయత్నించారు. దీనిలో భాగంగా నెలరోజుల క్రితం గుడి తాళాలు లాగేసుకున్నారు. గ్రామపెద్దల సహకారంతో శర్మ మళ్లీ ఆలయంలో అర్చకత్వం చేపట్టారు. సోమవారం ధర్మకర్తలు బలవంతంగా ఇంటికి తాళం వేశారు. దీంతో మనస్తాపం చెందిన శర్మ కలుపుమొక్కలకు వేసే మందుతాగాడు. తీవ్ర అస్వస్థతకు గురైన శర్మను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలో చేర్చగా మృతి చెందాడు. మృతి చెందే సమయంలో కూడా నమకం చమకం చదువుతూ శర్మ దైవనామస్మరణ చేస్తూనే కన్నుమూయడం చూపరులను కంటతడిపెట్టించింది. రాష్ట్ర ఆదిశైవ సంఘం అధ్యక్షుడు ఎం రాంబాబు, అర్చక సమాఖ్య రాష్ట్ర నాయకుడు కెవిఎస్‌ఎన్ ఆచార్యులు, పలువురు అర్చక సంఘం నాయకులు, బ్రాహ్మణ కార్పొరేషన్ నాయకులు మల్లిఖార్జునశర్మ భౌతికకాయాన్ని సందర్శించి, శ్రద్ధాంజలి ఘటించారు. శర్మ మృతికి సంతాపం ప్రకటించారు. శర్మ కుటుంబానికి న్యాయం చేయాలని, శర్మ మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన మృతదేహంతో ప్రభుత్వాసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు. మల్లిఖార్జున శర్మ మృతిపై స్పందించిన ఎపి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఆనంద సూర్య ఆయన కుటుంబానికి గరుడ పథకం కింద రూ. 10 వేలు, సిఎం సహాయ నిధి కింద రూ. 2 లక్షలు చెల్లిస్తామని కార్పొరేషన్ జిల్లా ప్రతినిధి ద్వారా సమాచారాన్ని పంపారు. శర్మ మృతికి సంతాపం ప్రకటించారు.