తూర్పుగోదావరి

ముగ్గురు మాయ‘లేడీ’లు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, ఏప్రిల్ 30: వారి కన్నుపడితే చాలు..క్షణాల్లో ఆ వస్తువు మాయం. చూడ్డానికి మంచి సాంప్రదాయ కుటుంబానికి చెందినవారిలా కనిపిస్తారు. మాటలు కలుపుతారు. సమయం చిక్కగానే కన్నుపడిన వస్తువును కనుల ముందే మాయం చేస్తారు. అలాంటి ముగ్గురు మాయలాడిలను పోలీసులు అరెస్టుచేశారు. ఈ ఘరానా మాయ లేడీలకు సంబంధించి అమలాపురం డిఎస్పీ ఎల్ అంకయ్య తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కృష్ణా జిల్లా కొండపల్లికి చెందిన మోచారపు రజనీ (25), విజయవాడ వాంబేకాలనీ పైపుల రోడ్డుకు చెందిన మట్టపర్తి రాణి (26), గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన పొన్న భారతి (26) గత రెండు రోజులుగా అమలాపురం పట్టణంలో పేరున్న బట్టల దుకాణాలను టార్గెట్‌గా పెట్టుకున్నారు. సాధారణ కొనుగోలుదారుల్లా షాపులో ప్రవేశించి, సేల్స్‌మేన్, సేల్స్ గరల్స్‌తో మాటలు కలిపి, ఖరీదైన చీరలు, వస్త్రాలు చూపించమని దర్పం ప్రదర్శించారు. దీంతో వారడిగిన ఖరీదైన దుస్తులను తీసుకు వచ్చేందుకు సిబ్బంది లోపలకు వెళ్లిన సమయంలో ఖరీదైన చీరలు, దుస్తులను కట్టుకున్న చీరల్లో దాచేశారు. ఈ విధంగా అమలాపురం పట్టణంలోని మూడు వస్త్ర దుకాణాల్లో సుమారు రూ.1.4 లక్షల విలువైన దుస్తులను కాజేసి చివరికి పోలీసులకు చిక్కారు. ఈ నెల 29న స్థానిక శుభమస్తు గ్రాండ్‌లో రూ.60 వేలు విలువజేసే 18 పట్టు చీరలు, అదే రోజు చందన బ్రదర్స్‌లో రూ.40 వేలు విలువజేసే 30 జతల ఫ్యాంట్లు, షర్టులు, ఈ నెల 28న ముస్లిం వీధిలోగల దేవీ శ్రీదేవి బట్టల షాపులో రూ.40 వేలు విలువజేసే 10 పట్టు చీరలను వారు అపహరించారని డిఎస్పీ తెలిపారు. వారి వద్దనుండి 30 పట్టు చీరలు, 30 జతల ఫ్యాంటు, షర్టులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు డిఎస్పీ చెప్పారు. ఈ మహిళా వస్త్ర దొంగలను పట్టుకోవడంలో కృషిచేసిన సిఐ వైఆర్‌కె శ్రీనివాస్, క్రైం పార్టీ సిబ్బంది అయితాబత్తుల బాలకృష్ణ, గుబ్బల సాయి, అనిల్‌సుందర్, లక్ష్మిలను డిఎస్పీతోపాటు వస్త్ర వ్యాపారులు అభినందించారు.