క్రైమ్/లీగల్

ఇద్దరు సోదరులపై ఆకతాయి దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, అక్టోబర్ 7: జులాయిగా తిరిగే ఓ ఆకతాయి స్వల్ప వివాదం కారణంగా ఇద్దరు సోదరులపై చాకుతో దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటనలో ఒకరు మృతిచెందగా మరొకరు గాయపడి కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామం డ్రైవర్స్ కాలినీలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి కాకినాడ రూరల్ సీఐ ఎ రాంబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామం డ్రైవర్స్ కాలినీకి చెందిన స్వర్ణ శ్రీనివాస్ (25), స్వర్ణ మధు (23) అనే ఇద్దరు సోదరులు తాపీ పని చేస్తూ జీవిస్తున్నారు. ఆదివారం సాయంత్రం సమయంలో అన్నదమ్ములు ఇద్దరు కలిసి పొలం వెళ్లి గేదెల నుండి పాలు తీసుకుని ఇంటికి తిరిగి వస్తున్నారు. వారు ఇంటికి చేరుకునే సమయంలో తమ కాలనీలో నూతనంగా రోడ్డు నిర్మాణం కోసం కంకర వేయగా, ఆ కంకరను అదే కాలనీకి చెందిన నర్శిపూడి చంటి అనే వ్యిక్తి పాడుచేస్తున్నాడు. దీంతో స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి కంకర విషయమై చంటితో వివాదం పడుతున్నాడు. ఈ వివాదాన్ని చూసిన అన్నదమ్ములు మధు, శ్రీనివాస్‌లు వివాదంను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో చంటి అనే వ్యక్తి అన్నదమ్ములు మధు, శ్రీనివాస్‌లపై చాకుతో దాడిచేసి గాయపరిచాడు. ఈ సంఘటనలో మధు ఛాతీలోకి చాకు బలంగా దూసుకుపోగా అతని సోదరుడు శ్రీనివాస్ చేతులకు గాయాలయ్యాయి. ఒక్కసారిగా జరిగిన సంఘటనతో ఆర్తనాదాలు చేస్తున్న అన్నదములను చూసిన స్థానికులు వెంటనే స్పందించి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తుండగా మధు మృతిచెందాడు. అతని సోదరుడు శ్రీనివాస్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇంద్రపాలెం ఎస్సై జిఎ రాజు తన సిబ్బందితో సంఘటనా ప్రాంతానికి చేరుకుని ఈ వివాదానికి గల కారణాలపై విచారించారు. అనంతరం ఆయన హత్యోదంతాన్ని సీఐ రాంబాబుకు తెలియజేయగా ఆయన ప్రభుత్వాసుపత్రికి చేరుకుని ఈ సంఘటనకు సంబంధించి వివరాలను మృతుడు సోదరుడు శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నిందితునికోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని, 24 గంటల్లో నిందితుడిని పట్టుకుంటామని ధీమా వ్యక్తంచేశారు. హత్యకు పాల్పడిన నిందితుడు నర్శిపూడి చంటి జులాయిగా తిరుగుతుంటాడని, జేబులో ఉంచుకున్న బటన్ నైఫ్‌తో సోదరులపై దాడికి పాల్పడ్డాడని తెలిపారు. స్వల్ప వివాదంపై నిందితుడు ఈ హత్యకు పాల్పడ్డాడని, వీరికి పాత కక్షలు లేవన్నారు. హత్యకేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాంబాబు తెలియజేశారు. హత్యోదంతం తెలుసుకున్న ఇంద్రపాలెం గ్రామస్థులు ప్రభుత్వాసుపత్రికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

శబరి నదిలో అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత
విఆర్ పురం, అక్టోబర్ 7: మండలాన్ని ఆనుకొని ప్రవహిస్తున్న శబరి నదిలో కలప స్మగ్లర్లు అక్రమంగా తరలిస్తున్న కలపను విఆర్ పురం మండల రేంజి అధికారులు ఆదివారం తెల్లవారు ఝామున మూడు గంటలకు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఆర్వో శ్రీనివాసురెడ్డి మాట్లాడుతూ తమ శాఖ అధికారులు రాత్రి సమయంలో రోడ్డు మార్గంలోను, జలమార్గంలోను అక్రమ కలప రవాణాను నియంత్రించేందుకు గట్టి నిఘాను ఏర్పాటుచేసినట్టు తెలిపారు. అదే విధంగా ఆదివారం రాత్రి గస్తీలో ఉన్న మా సిబ్బందికి శబరి నదిలో బ్రిడ్జికి దిగువన, అక్రమంగా కలపను తెప్పకట్టి తరలిస్తున్నట్లు కనిపించిందని, తమ సిబ్బంది దగ్గరకు వెళ్లేసరికి కలప తరలిస్తున్న స్మగ్లర్లు నీళ్లలోకి దూకి పారిపోయారని అన్నారు. 28 టేకు, 12 జిట్రేగి కర్రలను పట్టుకున్నామని, వాటి విలువ దాదాపు రూ.2 లక్షలు ఉండవచ్చని, స్వాధీనం చేసుకున్న కలపను రేఖపల్లి ఆఫీసుకు తరలించామని తెలిపారు. కలపను పట్టుకున్న వారిలో ఫారెస్టు అధికారులు ఎం వీరన్నరాజు, ఎం శ్రీరాములు, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.