తూర్పుగోదావరి

ఎమ్మెల్యేగా అభివృద్ధికి పాటుపడ్డా: ఎమ్మెల్యే తోట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, అక్టోబర్ 14: మంత్రి పదవులు నిర్వహించిన వారు కూడా సాధించలేని, సాధించని ప్రజా ప్రయోజన పనులు ఎమ్మెల్యేగా నిర్వహించాననే తృప్తి తనకు ఉందని, 1906లో స్వర్గీయ శ్రీకృత్తివెంటి పేర్రాజు పంతులు దాతృత్వ ఆశయం మేరకు వ్యవసాయాధారిత విద్యాసంస్థలు నెలకొల్పాననే ఆత్మ సంతృప్తి తనకు మెండుగా ఉందని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. శ్రీకృత్తివెంటి పేర్రాజు పంతులు జాతీయ విద్యాసంస్థల ప్రాంగణంలో నాలుగురోజులపాటు నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు బహుమతి ప్రదానోత్సవ సభ శ్రీ బుద్ధవరపు మహాదేవుడు కళావేదికపై ఆదివారం ప్రిన్సిపాల్ షేక్ అహ్మద్ షరీఫ్ అధ్యక్షతన జరిగింది. ఈ సభలో ఎమ్మెల్యే తోట ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ భవిష్యత్తును వందేళ్ల క్రితమే ఊహించి వంద ఎకరాల భూమిని దానం చేసిన మహనీయుడు శ్రీకృత్తివెంటి పేర్రాజు పంతులు చారితార్థుడన్నారు. ఈ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులెవరూ దాత ఆశయాన్ని పట్టించుకోని నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడుతో తనకున్న సాన్నిహిత్యంతో వ్యవసాయాధారిత వృత్తి విద్యా కోర్సులను ఎమ్మెల్యేగా తాను ప్రారంభింపజేయడం ఆనందదాయకంగా ఉందన్నారు. స్థాపనకుగల అవకాశాలు, ఆనాటి పెద్దలు తనకు సహకరించిన విధానాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. ప్రస్తుత కాలుష్య వాతావరణాన్ని ఆయన విశే్లషిస్తూ గతంలో ఆహార పద్ధతులు, నేటి ఆహార పద్ధతులకు స్పష్టమైన తేడా ఉందని, వ్యాయామం ద్వారా శరీర ఆకృతులను, మేథస్సును పదును పెట్టుకోవాలన్నారు. గెలుపోటములు సమానమని తాను భావించనని, ఓటమిని గుర్తుంచుకుని పట్టుదలతో విజయం చేకూరేందుకు మెళుకువలు నేర్చుకోవాలని అంటూ ఓటమి-గెలుపు మధ్యగల వ్యత్యాసాన్ని ఆయన తెలిపారు. సమాజ సేవ చేయాలన్న క్రీడాకారుల మనస్తత్వాన్ని మరువకండన్నారు. కళాశాల ప్రాంగణాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. పట్టణ ప్రముఖుడుగా ఉన్న డాక్టర్ చెలికాని స్టాలిన్ ఆ రోజున కళాశాల నిమిత్తం పదెకరాల స్థలాన్ని కేటాయించవద్దని, విలువైన స్థలమని, ఇళ్ల పట్టాలకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేసిన విషయాన్ని సభావేదిక నుంచి తెలిపారు. తాను ఇళ్ల స్థలాలకు వ్యతిరేకంకాదని, దేవదాయ, ధర్మదాయ శాఖ భూముల కేటాయింపు విషయంలో దాత ఆశయాన్ని ప్రతిబింబింపజేయాలన్న లక్ష్యంతోనే పశువైద్య పాలిటెక్నిక్ కళాశాలకు పదెకరాలు కేటాయించినట్టు తెలిపారు. అభివృద్ధి నిరంతర ప్రకియ అని అంటూ ఎవరు అడ్డువచ్చినా అభివృద్ధి విషయంలో తాను ముందుకు పోతానన్నారు. గ్రౌండ్లను బాగు చేయించడమే కాకుండా జాతికి పనికొచ్చే పనులు చేపడతానన్నారు. అంతకుముందు ప్రార్థనా గీతం అంశాన్ని ప్రస్తావిస్తూ విద్యార్థులు ఆ ప్రార్థనా గీతంలోని అంశాలన్నింటినీ గమనించాల్సిన అవసరముందన్నారు. ఆ పాటలో ఎన్నో అంశాలున్నాయని, వాటిని గుర్తుంచుకోవాలన్నారు.చంద్రబాబు నాయుడు అభివృద్ధి విషయంలో ఎటువంటి చిన్న అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకుంటున్నారని, దేశంలోనే నెంబర్‌వన్‌గా ఉండాలని ఆయన నిరంతరం తపన పడుతున్నారన్నారు. బాబు వస్తేనే జాబు వస్తుంది అనే అంశంపై పలు పార్టీలు, ప్రతిపక్షాలు వక్రీకరిస్తున్నాయంటూ ఉపాధి అవకాశాలకు మెరుగైన కృషి జరుగుతోందని, అభివృద్ధికి అవసరమైన అవకాశాలను చంద్రబాబు నాయుడు కల్పిస్తున్నారని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో వివిధ పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాల్స్ తదితరులు ప్రసంగించారు.

దక్షిణాది రాష్ట్రాల రగ్బీ విజేత తమిళనాడు
పిఠాపురం, అక్టోబర్ 14: పిఠాపురంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల అండర్-14 రగ్బీ విజేతగా తమిళనాడు జట్టు విజయకేతనం ఎగురవేసింది. రగ్బీ పోటీలు శనివారం ముగిసినప్పటికీ విజేతలను ఆదివారం ప్రకటించి, బహుమతులు అందజేశారు. బాలుర విభాగంలో తమిళనాడు జట్టుకు తొలి స్థానం, ఆంధ్రప్రదేశ్‌కు ద్వితీయ, కేరళకు తృతీయ స్థానాలు దక్కాయి. బాలికల విభాగంలో కూడా తమిళనాడు ప్రథమస్థానం దక్కించుకుంది. ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరిలు నిలిచాయి. పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ వైసీపీ ఫ్లోర్ లీడర్ గండేపల్లి బాబి, వడిశెట్టి సత్యనారాయణరెడ్డి, జనసేన నాయకులు అనిశెట్టి వెంకట సుబ్బారావు, సూరవరపు కృష్ణార్జునరావు, బాలిపల్లి రాంబాబు తదితరులు విజేతలకు బహుమతులు అందజేశారు. రాష్ట్ర రగ్బీ సంఘం కార్యదర్శి బి.రామాంజనేయులు, జిల్లా సంఘం అధ్యక్షుడు కె.నాగలింగేశ్వరరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి పల్లా లక్ష్మణరావు సమన్వయకర్తలుగా వ్యవహరించారు.