తూర్పుగోదావరి

మన్యంలో కొనసాగుతున్న తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజవొమ్మంగి, అక్టోబర్ 14: ఏజెన్సీలో మావోయిస్టుల కదలికలు పెరగడంతో పోలీసులు ఆదివారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మండలంలో జడ్డంగి పోలీస్‌స్టేషన్ పరిధిలో గ్రామ శివారు ప్రాంతంలో ఎస్సై నరేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో సాయుధ బలగాలు రోడ్డుకు ఇరువైపులా మొహరించి గస్తీ నిర్వహించారు. నర్సీపట్నం-దేవీపట్నం రహదారిపై వచ్చిపోయే వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు. ముఖ్యంగా విశాఖ జిల్లా నుండి, మారుమూల గ్రామాల నుండి వచ్చే వాహనాలపై పోలీసుల దృష్టిసారించి తనిఖీలు చేపట్టారు. అనంతరం జడ్డంగి మార్కెట్‌లో కూడా తనిఖీలు చేపట్టారు. వై.రామవరం మారుమూల అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల పేరుతో వాల్‌పోస్టర్లు వెలువడడంతో ప్రజాప్రతినిధుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటివరకు విశాఖ జిల్లాలోనే మావోయిస్టు కదలికలు ఉన్నాయనుకున్న తరుణంలో తూర్పుగోదావరి ఏజెన్సీలో కూడా కదలికలు కనిపించడంతో మరింత భయపడుతున్నారు.

నేడు ప్రజావాణి రద్దు
కాకినాడ, అక్టోబర్ 14: ప్రతీ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి మీకోసం కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ ఎ మల్లికార్జున తెలిపారు. తిత్లీ తుపాను కారణంగా శ్రీకాకుళంలో నష్ట పునరావాస కార్యక్రమాల్లో జిల్లా నుండి వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొంటున్నందున ప్రజావాణిని రద్దు చేశామని చెప్పారు. సుదూర ప్రాంతాల నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావద్దని ఫిర్యాదుదారులను ఆయన కోరారు.

మహాత్మునికి ఎమ్మెల్యే తోట నివాళి
రామచంద్రపురం, అక్టోబర్ 14: సభావేదికపై ఉన్న పూజ్య బాపూజీ శిలావిగ్రహానికి పూలమాల వేస్తేనేగానీ తాను కార్యక్రమంలో ముందుకు వెళ్లలేనని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ప్రకటించడంతో వెంటనే పూలమాల రప్పించి ఆయనతో మహాత్మునికి వేయించిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. శ్రీ కృత్తివెంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ జాతీయ విద్యాసంస్థల ప్రాంగణంలోని శ్రీబుద్ధవరపు మహాదేవుడు కళావేదికపై శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ అంతర పాలిటెక్నిక్ కళాశాలల పదవ వార్షికోత్సవ క్రీడాసాంస్కృతిక కార్యక్రమాల పోటీల విజేతలకు బహుమతి ప్రదానోత్సవ సభ ఆదివారం నిర్వహించారు. వేదికపైకి ఎక్కిన తరువాత ఎమ్మెల్యే త్రిమూర్తులు మహాత్మునికి పూలమాల వేసే కార్యక్రమం నిర్వహించాలని కోరగా, అప్పటికప్పుడు పూలమాల తీసుకుని వచ్చి ఎమ్మెల్యేతో వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మునికి నివాళి అర్పించడం ప్రతీ భారతీయుని కర్తవ్యమని, గాంధీ బోధించిన శాంతి, అహింస కార్యక్రమాలను ప్రతిఒక్కరూ చేపట్టాలని కోరారు.