తూర్పుగోదావరి

మారేడుమిల్లిలో తాగునీటి ఇబ్బందులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారేడుమిల్లి, అక్టోబర్ 14: తూర్పు ఏజెన్సీ ప్రాంతమైన మారేడుమిల్లిలో తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల మారేడుమిల్లి నుండి ముంపు మండలాలకు వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా ఆక్రమణలు తొలగించి విస్తరణ పనులు ప్రారంభించారు. ఈ పనుల్లో పొక్లెయినర్ సాయంతో మట్టిని తొలగిస్తుండగా ఆయా ప్రదేశాల్లో పైపులైనుకు లీకులు ఏర్పడడంతో స్థానిక దిగువ ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. కొన్ని వీధుల్లో నీటి కుళాయిలు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. ఈ క్రమంలో నాలుగు రోజులకోసారి నీటి సరఫరా జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. గతంలో మారేడుమిల్లికి సుమారు రూ.2.47 లక్షలతో అరకు పార్లమెంటరీ మెంబర్ కొత్తపల్లి గీత ఆధ్వర్యంలో ఇంటింటికి కుళాయిలు ఏర్పాటుచేసే కార్యక్రమంలో భాగంగా గ్రామంలో కొన్ని వీధులకు కుళాయిలు పరిమితం చేసి మమ అనిపించారు. దీంతో దిగువ ప్రాంతాల్లో ఇంటింటికి కుళాయిలు లేకపోవడంతో నీటికి కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. ఇదే కాకుండా మారేడుమిల్లిలో పంచాయతీకి చెందిన నీటి సరఫరా కేంద్రం, సత్యసాయి రక్షిత తాగునీటి పథకం ద్వారా ఆయా ప్రాంతాల్లో సుమారు 9 మినీ ట్యాంకులు, ఎంపీ నిధులతో నిర్మించిన తాగునీటి పథకం ఇన్ని ఉన్నా గ్రామంలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. అలాగే మారేడుమిల్లి పంచాయతీ పరిధిలోని పూజారిపాకలు గ్రామానికి తాగునీటిని అందించేందుకు సత్యసాయి పథకంలో భాగంగా మినీ ట్యాంకులు నిర్మించి నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే రెండు నెలల క్రితం మండలంలో కురిసిన భారీ వర్షాలకు కొండవాగులు ఉధృతంగా ప్రవహించడంతో పైపు లైన్లు కొట్టుకునిపోయాయి. అప్పటి నుండి అధికారులు పట్టించుకున్న దాఖలాలు కరువయ్యాయి. దీంతో గిరిజనులు కొండవాగులో నీటిని గృహావసరాలకు వినియోగిస్తున్నారు. గ్రామంలోని చేతిపంపులు మరమ్మతులకు గురికావడంతో కొండవాగు సమీపంలోని చేతి పంపును వినియోగిస్తున్నారు. గత్యంతరం లేక అదే నీటిని సేవించడంతో జ్వరాల బారిన పడుతున్న సందర్భాలున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తాగునీటి కష్టాలు తీర్చాలని పలువురు గ్రామస్థులు కోరుతున్నారు.

గర్భిణీ, శిశువుకు అస్వస్థత: ఆసుపత్రికి తరలింపు
రాజవొమ్మంగి, అక్టోబర్ 14: గర్భిణి, శిశువు అస్వస్థతకు గురవ్వడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి హుటాహుటిన కాకినాడ జనరల్ ఆసుపత్రికి వైద్యులు తరలించారు. స్థానిక వాల్మీకి పేటకు చెందిన బొర్రా ఉమాదేవి నెలలు నిండగా రక్తహీనతతో బాధపడుతూ హై రిస్క్ కేసుగా నమోదు చేశారు. తీవ్రమైన నొప్పులు, ఆయాసంతో బాధపడుతుండగా కుంటుంబీకులు పీహెచ్‌సీకి తీసుకొచ్చారు. వైద్యులు వంశీ, మొనీషాలు వైద్య పరీక్షలు చేసి అత్యవసర వైద్య సహాయంకై రిఫర్ చేశారు. మూడురోజుల క్రితం ఆమె స్థానిక పీహెచ్‌సీకి అనారోగ్యంతో రాగా వైద్యులు కాకినాడ పంపారు. ఆమెను పరీక్షించిన వైద్యులు కాన్పు వచ్చేంత వరకు ఆసుపత్రిలో ఉండాలని చెప్పినా వైద్యులకు చెప్పకుండా తిరిగి రాజవొమ్మంగి వచ్చేసింది. మరోమారు అస్వస్థతకు గురవ్వడంతో వైద్యులు, సిబ్బంది ఆమెకు కౌన్సిలింగ్ చేసి కాకినాడకు పంపారు. మండలంలో దూసరపాము గ్రామానికి చెందిన లింగందేవి రెండవ కాన్పులో మగబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన వెంటనే బిడ్డ 3 కిలోలు ఉండాల్సి ఉంది. కానీ 2.1 కిలోలు మాత్రమే ఉండడంతో తల్లీ, బిడ్డలను వైద్యులు కాకినాడ జీజీహెచ్‌కి రిఫర్ చేశారు. గర్భిణి, తల్లీ, శిశువులను ఒకే అంబులెన్సులో తరలించారు.