తూర్పుగోదావరి

భూమి నుంచి ఆకాశం వరకూ ఎగసిపడిన ఇసుక రేణువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూనవరం, అక్టోబర్ 14: గొమ్ము అయ్యవారి గూడెం గ్రామంలోని గోదావరి నది ఒడ్డున ఆదివారం సాయంత్రం వేగంగా గాలి వీచింది. దీంతో ఇసుక రేణువులు భూమి నుంచి ఆకాశం వరకూ టోర్నడోలు వలే ఎగసిపడ్డాయి. దీంతో ఇసుకలో ఉన్న రైతులు ఒక్కసారిగా పరుగెత్తుకుని వచ్చి నది ఒడ్డుకు చేరుకున్నారు.
కవాతు జయప్రదానికి జనసేన సన్నాహాలు

కాకినాడ, ఫిబ్రవరి 14: జనసేన పార్టీ సోమవారం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నిర్వహించే కవాతును విజయవంతం చేసేందుకు ఆ పార్టీ నేతలు నడుం బిగించారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ పిలుపుమేరకు జిల్లా కేంద్రం కాకినాడలో ఆదివారం ఆ పార్టీ నేతలు కవాతు విజయవంతాన్ని కాంక్షిస్తూ వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ప్రజాసమస్యలపై ఎలుగెత్తి చాటేందుకు జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ కవాతును జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న నేపథ్యంలో జిల్లా కేంద్రం కాకినాడ సహా వివిధ ప్రాంతాల నుండి జనసైనికులు భారీగా తరలివెళ్తున్నట్టు పార్టీ నాయకుడు పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) చెప్పారు. కాకినాడ నగరంలోని అచ్చంపేట జంక్షన్ నుండి సోమవారం ఉదయం 9 గంటలకు జనసేన కవాతుకు తరలివెళ్ళనున్నట్టు తెలిపారు. నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో కవాతు విజయవంతం కావాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. పార్టీ జిల్లా కో-ఆర్డినేటర్ పెసంగి ఆదినారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ కవాతు కార్యక్రమానికి జనసేన కార్యకర్తలు, పవన్‌కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. భారీ ఎత్తున శ్రేణులు హాజరుకావడం ద్వారా జనసేన సత్తా ఏంటో ఇతర రాజకీయ పార్టీలకు తెలిసేలా చాటాలని పిలుపునిచ్చారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో కవాతును విజయవంతం చేయాలని కోరుతూ ప్రచారం చేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జ్యోతుల వెంకటేశ్వరరావు, కే గోపాల్, కడలి ఈశ్వరి, కార్పొరేటర్ మాకినీడి శేషుకుమారి తదితరులు పాల్గొన్నారు. నగరంలో భానుగుడి జంక్షన్‌లోని జన్మభూమి పార్క్, పాత బస్టాండ్ ప్రాంతాల్లో కవాతు విజయవంతాన్ని కోరుతూ పార్టీ నాయకుడు ముత్తా శశిధర్ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాసమస్యలపై ప్రశ్నించేందుకు చేపట్టిన కవాతును ప్రతివొక్కరు విజయవంతం చేయాలని కోరారు. జనసేన పార్టీ అన్ని వర్గాల సంక్షేమానికి కృషిచేస్తుందని, కుల మతాలకు అతీతంగా పార్టీని ముందుకు తీసుకువెళ్ళేందుకు అధినేత పవన్‌కళ్యాణ్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే కవాతు విజయవంతం కావాలని కోరుతూ సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ నాయకుడు సంగిశెట్టి అశోక్, మాజీ కార్పొరేటర్ ర్యాలి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.