తూర్పుగోదావరి

జనసేన కవాతుకు ప్రత్యేక శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధవళేశ్వరం, అక్టోబర్ 13: ధవళేశ్వరంలో సోమవారం నిర్వహించే జన సేన కవాతును విజయవంతం చేసి తమ జన శక్తి ఏ పాటిదో నిరూపించాలనే పట్టుదలతో ఆ పార్టీ నేతలు అహరహం శ్రమిస్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా జన సమీకరణ చేసి ఎన్నికలకు తాము సిద్ధమేననే సంకేతాలను అధికార, అధికారేతర పార్టీలకు పంపించేందుకు ఈ కార్యక్రమాన్ని వేదికగా మలుచుకోవాలని ఆ పార్టీ యోచిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో పవన్ వెనుక మేమున్నాం..పవన్ పిలుపుతో ఉప్పెనలా కదలి వస్తామని చాటి చెప్పటంతోపాటు అధికార, అధికారేతర పార్టీల గుండెల్లో గుబులు పుట్టించేలా చేయటమే లక్ష్యంగా ‘కవాతు’ కావాలని ఆ పార్టీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. జన సేన కవాతు కార్యక్రమం విజయవంతం చేసేందుకు ఆ పార్టీ శ్రేణులకు శనివారం ధవళేశ్వరం జలవనరుల శాఖ సీఆర్పీ అతిథి గృహంలో శిక్షణా తరగతులు కూడా నిర్వహించారు. ఈ కవాతులో జన సేన ప్రత్యేక ఆకర్షణగా నిలిచేందుకు వస్తధ్రారణ దగ్గర నుంచి అన్నింటిలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. తెలుగు సాంప్రదాయం ఉట్టిపడే విధంగా నృత్యాలు, మహిళలచే హారతులు, తమ నాయకుడికి విజయ తిలకం దిద్దుతూ మహిళలు స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తరాంధ్రా నుంచి తూర్పుగోదావరి వరకూ వచ్చే వాహనాలను వేమగిరి జాతీయ రహదారి వద్ద నాలుగు పార్కింగ్ ప్రదేశాలను ఎంపిక చేశారు. అక్కడే పార్కింగ్ చేయవలసి ఉంటుందని జన సేన నాయకులు స్పష్టం చేస్తున్నారు. అదే విధంగా పశ్చిమ గోదావరి నుంచి రాయలసీమ వైపు నుంచి వచ్చే వాహనాలకు విజ్జేశ్వరంలో నాలుగు చోట్ల పార్కింగ్ ప్రదేశాలను ఎంపిక చేసి ఆయా ప్రాంతాల్లో తగు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే కవాతులో పాల్గొనే పార్టీ శ్రేణులు, తమ అభిమాన నేత పవన్ కళ్యాణ్‌ను దగ్గర్నుంచి చూడాలనే కోరికతో వచ్చే అభిమానులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందీ కలుగకుండా మంచినీరు, భోజన వసతులు ఏర్పాటుచేసేందుకు దాదాపు 50 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ కవాతు ప్రారంభమై సాయంత్రం 6గంటలకు కాటన్ బ్యారేజ్ సెంటర్ వద్ద బహిరంగ సభ నిర్వహించి, అనంతరం రాజమహేంద్రవరం వైపు పవన్ కళ్యాణ్ యాత్ర కొనసాగుతుందని కవాతు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ తెలిపారు.

అర్థాకలితో అద్దంపల్లి చేనేత సొసైటీ
* ఆప్కో నుంచి సొమ్ము అందక ఇబ్బందులు
రామచంద్రపురం, అక్టోబర్ 13: కె గంగవరం మండలం అద్దంపల్లి గ్రామంలో చేనేత సహకార సంఘం 1948లో స్థాపించారని, నేటికీ పనిచేస్తూనే ఉందని, అయితే ఆప్కో నుంచి రావాల్సిన సొమ్ము రాకపోవడంతో పనిలేక అర్ధాకలితో గడిపే దుస్థితి ఏర్పడిందని ఆ సంఘం అధ్యక్షుడు డి గణేశ్వరరావు తదితర సభ్యులు, పాలకవర్గ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని పంపించి, ఆ ప్రతులను విలేఖర్లకు అందించారు. దుప్పట్లు నేసే స్టాండ్ మగ్గాలు కలిగి ప్రస్తుతం హామీతో కూడిన ఉపాధి కోసం కష్టమైనప్పటికీ ప్రభుత్వ అవసరాలకు లివరీ థిక్ బెడ్ షీట్స్ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ అవసరాలకు దుప్పట్లు నేసి అందిస్తున్నామని, అర్ధాకలితో గడిపే పరిస్థితిని తాము ఎదుర్కొంటున్నామన్నారు. నాబార్డు నగదు పరిమితిని కోటీ 40 లక్షల రూపాయలు ఇవ్వగా, డీసీసీబీ నుంచి అదనపు నగదు పరిమితిగా 25 లక్షల రూపాయలు తీసుకున్నట్టు, అయితే ఆప్కో నుంచి తమకు రెండు కోట్ల రూపాయలు సొమ్ము రావాలని, సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్న స్టాకు, స్తంభించిన నిధులు రూ.36 లక్షలు అన్నారు. ఈవిధంగా రెండు కోట్ల 36 లక్షల రూపాయలు తమకు అందాల్సి ఉందన్నారు. ఈ కారణంగా సంఘం నేత కూలీని చెల్లించలేని దుస్థితిలో ఉందని, ఇంతవరకు అప్పులుచేసి బతికామని, ఇక సాధ్యపడదన్నారు. ఆప్కోకు ప్రభుత్వ సంక్షేమ శాఖల నుంచి 140 కోట్ల రూపాయలు రావాలని చెబుతున్నారని అంటూ ఈ అంశంపై స్థానిక ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుకు విన్నవించుకున్నామన్నారు. ఆప్కోను సరిచేసి తమ బతుకులు సరిదిద్దాలని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఉన్న తమకు న్యాయం చేయాలని సభ్యులు, పాలకవర్గ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలావుండగా చేనేత సహకార సంఘాల ఛైర్మన్, హసనబాద చేనేత సహకార సంఘం ఛైర్మన్ దొంతంశెట్టి విరూపాక్షం ఆప్కో మేనేజింగ్ డైరెక్టర్‌కు ఒక లేఖ రాశారు. 40 ఏళ్లుగా అరుదైన అభివృద్ధిని సాధిస్తూ సుదీర్ఘకాలంగా ఎ క్లాస్ సంఘంగా గుర్తింపునందుకున్న హసనబాద చేనేత సహకార సంఘం ఆప్కో వద్ద కోటీ 40 లక్షల రూపాయల నిధులు సంవత్సర కాలంగా స్తంభించిపోవడంతో దిక్కుతోచని స్థితికి చేరిందన్నారు. ఆప్కో నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో బ్యాంకు డిపాజిట్లపై 15 లక్షల రూపాయల రుణం తీసుకున్నారన్నారు. సాధారణ స్థితిలో ఉన్న చేనేత సంఘాల దుస్థితి వర్ణనాతీతమన్నారు. ఆప్కో కార్యకలాపాలు ఏ ఒక్క జిల్లాకు పరిమితం చేయడం ధర్మం కాదన్నారు. జిల్లాలోని చేనేత సహకార సంఘాల బకాయిలు తక్షణం చెల్లించాలని, లేనిపక్షంలో సంఘాలను ఏవిధంగా నడపాలో తమకు సూచించాలని ఆప్కో మేనేజింగ్ డైరెక్టర్ నరేష్‌కు రాసిన లేఖలో దొంతంశెట్టి విరూపాక్షం పేర్కొన్నారు.