తూర్పుగోదావరి

రక్షిత అటవీ ప్రాంతాన్ని ఆక్రమిస్తే సహించేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజవొమ్మంగి, అక్టోబర్ 13: పర్యావరణానికి ఎంతో మేలు చేకూర్చే రక్షిత అటవీ ప్రాంతాన్ని ఆక్రమిస్తే సహించేది లేదని జిల్లా అటవీ అధికారి నందినీ సలారియా అన్నారు. మండలంలో బడదనాంపల్లి రోడ్డులో అటవీ ప్రాంతాన్ని అక్రమంగా ఆక్రమించిన స్థలాన్ని డీఎఫ్‌వో శనివారం ఆకస్మికంగా పరిశీలించారు. అటవీ అభివృద్ధి సంస్థ భూమి పక్కనే 15 రోజుల క్రితం అటవీ భూమి ఆక్రమించినట్టు తమకు సమాచారం అందిందన్నారు. అడవులను అక్రమంగా నరుకుతున్న వ్యక్తిని గుర్తించామని, అతనిపై కేసు కూడా నమోదు చేస్తున్నామన్నారు. లబ్బర్తి, అనంతగిరి, బడదనాంపల్లి తదితర అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా అడవి నరికివేస్తున్నట్టు తమ దృష్టికివచ్చిందని, అడవులు అంతరించిపోతుంటే ఏమి చేస్తున్నారని స్థానిక సిబ్బందిని డీఎఫ్‌వో నిలదీశారు. అడవులను నరుకుతున్నవారిని గుర్తించి వెంటనే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. కొండవాగుల నుండి ఇసుక అక్రమంగా రవాణా చేస్తుంటే వాహనాలను ఎందుకు పట్టుకోడంలేదని సిబ్బందిని గట్టిగా ప్రశ్నించారు. అక్రమాలు జరిగితే సహించేది లేదని, మరోమారు అటవీ ప్రాంతాన్ని సిబ్బందితో తనిఖీ చేయిస్తామన్నారు. రేంజి అధికారి టి. నాగేశ్వరరావు, అటవీ అధికారులు ఆమె వెంట ఉన్నారు.

విజయవంతంగా దక్షిణాది రాష్ట్రాల రగ్బీ పోటీలు
పిఠాపురం, అక్టోబర్ 13: పిఠాపురం పట్టణంలోని ఆర్‌ఆర్‌బిహెచ్‌ఆర్ క్రీడా ప్రాంగణంలో దక్షిణాది రాష్ట్రాల అండర్-14 రగ్బీ పోటీలు శనివారం విజయవంతంగా నిర్వహించారు. ఈ పోటీలను స్థానిక ఎమ్మెల్యే ఎస్‌విఎస్‌ఎన్ వర్మ ప్రారంభించారు. తొలుత క్రీడాజ్యోతి వెలిగించిన ఆయన అనంతరం క్రీడల ఆవశ్యకతను వివరించారు. పిఠాపురం పట్టణంలో జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ క్రీడాకారులు ఉన్నారని, క్రీడారంగం నుంచి ప్రపంచ స్థాయి క్రీడాకారులను తయారు చేయాలన్న సంకల్పంతో ఇక్కడ కోచ్‌లు, పీఈటీలు పనిచేస్తున్నారన్నారు. రగ్బీ క్రీడ రాష్ట్ర కార్యదర్శి రామాజంనేయులు, ఒలింపిక్ సంఘం జిల్లా కార్యదర్శి కె.పద్మనాభం, జిల్లా రగ్బీ సంఘం అధ్యక్షుడు కె.నాగేశ్వరరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి పల్లా లక్ష్మణరావు తదితరులు పోటీలను పర్యవేక్షించారు. కార్యక్రమంలో భాగంగా పట్టణంలో క్రీడాకారులు ర్యాలీ నిర్వహించారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, పాండిచ్చేరి జట్లు తొలిరోజు పోటీల్లో పాల్గొన్నాయి. పాయింట్ల ఆధారంగా విజేతలను ఆదివారం ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు.

మహాలక్ష్మీదేవిగా అమ్మవారు దర్శనం
రాజమహేంద్రవరం, అక్టోబర్ 13: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేవీచౌక్‌లోని అమ్మవారు శనివారం మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవి మహోత్సవ సమితి ఆధ్వర్యంలో శనివారం ఉదయం అమ్మవారికి కుంకుమపూజలు నిర్వహించారు. పెద్దసంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా బళ్ల మల్లేశ్వరరావు పురాణ పఠనం చేశారు. కాగా, రాత్రి ప్రదర్శించిన చింతామణి నాటకం ఆనాటి ప్రేక్షకులను అలరించింది.