తూర్పుగోదావరి

‘తూర్పు’ నుంచే మార్పు కోసం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* 15న కవాతుకు పక్కా ప్రణాళిక * పిచ్చుకలంక నుంచి ధవళేశ్వరం * రెండున్నర కిలోమీటర్ల పవన్ కవాతు* కాటన్ బ్యారేజి దిగువన బహిరంగ సభ * మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం, అక్టోబర్ 13: ఇపుడు అందరి దృష్టి జనసేన ఈ నెల 15న ధవళేశ్వరం కాటన్ బ్యారేజిపై తలపెట్టిన కవాతుపై పడింది. కనీ వినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తామని అధినేత పవన్ కళ్యాణ్ చెప్పడంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేశారు. రాజకీయ జవాబుదారీతనం డిమాండ్ చేస్తూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఈ కవాతును తలపెట్టారని టూర్ ఇన్‌చార్జి మాజీ ఎమ్మెల్సీ కందుల లక్ష్మీదుర్గేష్ చెప్పారు. పిచ్చులంక నుంచి ధవళేశ్వరం బ్యారేజి మీదుగా ధవళేశ్వరం కాటన్ విగ్రహం వరకు కవాతు జరుగుతుందని తెలిపారు. జనసేన కో-ఆర్డినేటర్ మేడా గురుదత్త ప్రసాద్, కో-ఆర్డినేటర్లు శెట్టిబత్తుల రాజబాబు, అనుశ్రీ సత్యనారాయణ, పెసంగి ఆదినారాయణ, పోలింగ్ బూత్‌ల కన్వీనర్ వై శ్రీనివాస్, చోడిశెట్టి శేఖర్, చిక్కాల సుబ్బారావు తదితరులతో కలిసి స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండున్నర కిలోమీటర్లు మేర సాగే ఈ కవాతు అనంతరం బ్యారేజి దిగువన ధవళేశ్వరం కాటన్ విగ్రహం జంక్షన్‌లో జరిగే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ కవాతునుద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు.
కవాతు 15వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు పిచ్చుకలంక నుంచి మొదలవుతుందని, సాయంత్రం నాలున్నర గంటలకు కవాతు ముగుస్తుందన్నారు. అనంతరం సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారని దుర్గేష్ చెప్పారు. పది అడుగుల ఎత్తులో బహిరంగ సభ వేదికను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దూరంలో వున్నవారికి సైతం ఇబ్బంది లేకుండా బహిరంగ సభలో పవన్ ప్రసంగాన్ని తిలకించేలా 25 ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు. బహిరంగ సభ అనంతరం రాజమహేంద్రవరం ఐఎల్‌టీడీ జంక్షన్, రైల్వే స్టేషన్, కోటిపల్లి బస్టాండ్, స్టేడియం రోడ్డు, కారల్ మార్క్స్ రోడ్డు మీదుగా మోరంపూడి జంక్షన్ వరకు బస్సులో చేరుకుంటారన్నారు. అక్కడ నుంచి విజయవాడ వెళ్తారన్నారు.
కవాతు, బహిరంగ సభకు అధికారుల నుంచి అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్నామన్నారు. కవాతు జరిగే పిచ్చుకలంక నుంచి ధవళేశ్వరం ప్రాంతం వరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బ్యారేజి ఫుట్‌పాత్ ఎక్కవద్దని కోరుతున్నామన్నారు. ముందు జాగ్రత్త చర్యగా బ్యారేజికి ఇరువైపులా వందమంది గజ ఈతగాళ్లను సిద్ధం చేశామని తెలిపారు. కవాతు సాంస్కృతిక, సంప్రదాయ విధానాల్లో జరిగేలా ఏర్పాటు చేశామన్నారు. కవాతులో చేతి వృత్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా వెయ్యిమంది మత్స్యకారులు తమ వృత్తి పరికరాల ఆహార్యంతో, అదే విధంగా గీత కార్మికులు వెయ్యిమంది, వెయ్యిమంది మైనార్టీలు సంప్రదాయబద్ధంగా పాల్గొంటారని, దండోరా తదితర వృత్తుల వారు కూడా పాల్గొంటారన్నారు.
ఇక వెయ్యిమంది మహిళలు తెలుపురంగు చీరలు, ఎరుపురంగు బ్లౌజ్ ధరించి సభలో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్‌కి స్వాగతం పలుకుతారని, జనసేన వీర మహిళల విభాగం ఇందుకోసం ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని దుర్గేష్ చెప్పారు. పార్టీ ఆజాద్ యూత్ వింగ్ 1200 మంది వలంటీర్లు సందీప్ పంచకర్ల ఇన్‌చార్జిగా శిక్షణ ఇస్తున్నారన్నారు. ఎలాంటి ప్రమాదం లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ముందు జాగ్రత్త చర్యగా 15 అంబులెన్స్‌లు సిద్ధం చేస్తున్నామన్నారు. కవాతుకు ఎంత సంతోషంగా వస్తున్నారో అంతకంటే సంతోషంగా తిరిగి వెళ్ళాలని పవన్‌కళ్యాణ్ సూచించారని, అందుచేత సూక్ష్మస్థాయిలో ఏర్పాట్లు చేశామన్నారు. వేమగిరి, ధవళేశ్వరం, చెరుకూరి గోదాములు, పెట్రోలు బంకు ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశామని చెప్పారు. పార్టీకి యువశక్తి ఎక్కువ కాబట్టి బైక్ పార్కింగ్‌లకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారి కోసం మార్గమధ్యలో ఫుడ్ ప్యాకెట్లు, మంచినీళ్ళ సీసాలు సరఫరా చేస్తామన్నారు. కొంతమంది స్థానిక ప్రముఖులు మంచినీరు, బటర్ మిల్క్ పంపిణీ చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారన్నారు. పార్టీలోకి రావడానికి ఉత్సాహం చూపేవాళ్ళు కూడా జ్యూస్ వంటివి అందించడానికి ముందుకొస్తున్నారన్నారు. జిల్లా కో-ఆర్డినేటర్ మేడా గురుదత్త ప్రసాద్ మాట్లాడుతూ కవాతు చారిత్రాత్మక ఘటనగా మిగిలిపోతుందని, భవిష్యత్‌లో కూడా ఎవరూ ఇలాంటి కవాతు చేయలేని విధంగా వుంటుందని, లక్షలాది మంది రావడానికి సిద్ధమవుతున్నారని వివరించారు. కవాతు జయప్రదం చేయాలని కోరారు. పెసంగి ఆదినారాయణ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు సంపద, రాజ్యాధికారం పంచడానికి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారని చెప్పారు. అందరూ కవాతు జయప్రదం చేయాలన్నారు. అనంతరం కవాతు పోస్టర్‌ను నాయకులు ఆవిష్కరించారు.

చేతులు మారుతున్న సీలింగ్ భూములు..!
*మాజీ మావోను అడ్డం పెట్టుకుని కాజేసేందుకు యత్నం..!
*రెవెన్యూ రికార్డులు టాంపరింగ్..!!
రాజమహేంద్రవరం, అక్టోబర్ 13: రాజమహేంద్రవరం అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో రూ. కోట్లాది విలువ చేసే సీలింగ్ భూములు చేతులు మారుతున్నాయి. కంచుమర్తి జమీందారుకు చెందిన కోర్టు వివాదంలో వున్న సీలింగ్ భూములను కాజేసేందుకు చట్టబద్ధంగా పవర్ అటార్నీ తీసుకున్నవారే ఇదే అదనుగా ప్రయత్నిస్తున్నట్టు జిల్లా ఉన్నతాధికారులు గుర్తించారు. కొంతమంది వ్యక్తులు రెవెన్యూ రికార్డులు టాంపరింగ్ చేసి అన్యాక్రాంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు బయట పడింది. జిల్లాకు మంజూరైన ప్రాజెక్టులకు అవసరమైన భూములను అధికార యంత్రాంగం పరిశీలిస్తున్న క్రమంలో కోరుకొండ మండలం మధురపూడి గ్రామంలోని సీలింగ్ భూమి వ్యవహారం బయట పడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కోరుకొండ మండలం మధురపూడి గ్రామంలో సుమారు 17 ఎకరాలకు సంబంధించిన సీలింగ్ భూమికి ఎసరు పెట్టే వ్యవహారం బయట పడింది. వరంగల్ జిల్లాకు చెందిన ఒక మాజీ నక్సల్ పేరును అడ్డం పెట్టుకుని సదరు జమీందారు భూములను పవర్ ఆటార్నీ తీసుకున్న వారిలో కొంతమంది ముఠాగా ఏర్పడి కోర్టు వివాదంలో వున్న సీలింగ్ భూములను సైతం ట్యాంపరింగ్ చేసి యాజమాన్య హక్కులను మార్చుకుంటున్న వైనాన్ని పసిగట్టిన గతంలో పని చేసిన కలెక్టర్ అరుణ్‌కుమార్ బ్రేక్ వేసినట్టు తెలిసింది. ఈ సీలింగ్ భూములు స్వాహాకు ఒక ఎమ్మార్వోతో కుమ్మక్కై, వరంగల్‌కు చెందిన మాజీ మావో ద్వారా పావులు కదిపి తీరా అది కాస్తా ఆలస్యమవుతోందని సదరు మాజీ మావోకు ఇచ్చిన అడ్వాన్స్ సొమ్మును వసూలు చేసుకునేందుకు ఈ ముఠా వత్తిడి చేయడంతో అతను ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది.
కంచుమర్తి జమీందారుకు వందల ఎకరాలు జిల్లాలో వున్నాయి. వీటిలో కొన్ని సీలింగ్ భూముల జాబితాలో వున్నట్టు గుర్తించిన ముఠా వీటిని కాజేసేందుకు ట్యాంపరింగ్ చేసి స్వాహా చేశారని అంటున్నారు. స్థానికంగా వెలసిన ఒక లేఅవుట్‌కు సంబంధించి పవర్ ఆఫ్ అటార్నీ తీసుకున్న ప్రధాన వ్యక్తి పవర్ ఆఫ్ అటార్నీని అడ్డుపెట్టుకుని ఇతరత్రా సీలింగ్ భూములను ఈ భూముల స్వాహాకు పన్నాగం పన్నినట్టు తెలుస్తోంది. దీనితో పాటు జమీందారు నుంచి తీసుకున్న భూమిలో లేఅవుట్‌కు సంబంధించి పన్నులు కూడా సక్రమంగా చెల్లించకుండా సదరు జమీందారును ఇరికించే విధంగా వ్యవహరించారని తెలుస్తోంది. అయితే ఈ జమీందారుకు చెందిన భూముల విలువ ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం సుమారు రూ. వెయ్యికోట్ల వరకు వుంటాయని తెలిసింది. జమీందారుకే ఝులక్ ఇచ్చి రియల్ ఎస్టేట్ చేసి వ్యక్తి సుమారు రూ.14 కోట్ల పన్నులు ఎగనామం పెట్టినట్టు తెలిసింది. ఈ సీలింగ్ భూముల వ్యవహారం కాస్తా హైకోర్టులో వున్నప్పటికీ రియల్టర్ బేఖాతరు చేసి స్వాహా చేసేందుకు ఈ వ్యవహారాన్ని నడిపినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారులు దృష్టి సారిస్తే సీలింగ్ భూములకు భద్రత లభిస్తుంది.